బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి అశ్వథనారాయణ: శశికళ కోరికలు ఏంటీ ?

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి కావాలనే కలలు అడియాసలు కావడంతో ఇప్పుడు ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవించడానికి శశికళ బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు చేరుకుంటున్నారు. శశికళ, ఇళవరసి, దివాకరన్ జైలు ఆవరణంలో ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి ముందు లొంగిపోతున్నారు.

<strong>సీన్ రివర్స్: ఎమ్మెల్యేలతో స్టాలిన్ సమావేశం: అధికారంలోకి డీఎంకే!</strong>సీన్ రివర్స్: ఎమ్మెల్యేలతో స్టాలిన్ సమావేశం: అధికారంలోకి డీఎంకే!

బుధవారం సాయంత్రం 4.45 గంటల సమయానికి క్రిష్ణగిరి జిల్లాలోని హోసూరులో ఉన్న శశికళ ఇప్పుడు పరప్పన అగ్రహార జైలు దగ్గరకు చేరుకుంటున్నారు. ఇప్పటికే జైలు ఆవరణంలో ప్రత్యేక కోర్టుకు న్యాయమూర్తి అశ్వథనారాయణ చేరుకున్నారు. శశికళ తన కోరుతున్న కోరికలకు న్యాయమూర్తి అనుమతి ఇస్తారా ? లేదా ? అనే విషయం కొద్ది సేపట్లో తేలిపోనుంది.

Registrar of Karnataka HC ordered shifting of court to Central prison from city civil court.

ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయమూర్తి అశ్వథనారాయణ ముందు శశికళ, ఇళవరసి, దివాకరన్ లు లొంగిపోయిన తరువాత జైలులో వారికి వేర్వేరుగా గదులు కేటాయిస్తామని జైళ్ల శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే శశికళ అనుచరులు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు దగ్గర మకాం వేశారు.

<strong>చిన్నమ్మకు ఝలక్ ఇచ్చిన రాఘవ లారెన్స్: ఆ దమ్ము ఒక్కరికే ఉంది</strong>చిన్నమ్మకు ఝలక్ ఇచ్చిన రాఘవ లారెన్స్: ఆ దమ్ము ఒక్కరికే ఉంది

తమిళనాడు మంత్రి, హోసూరు అన్నాడీఎంకే శాసన సభ్యుడు బాలక్రిష్ణారెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు దగ్గరకు చేరుకున్నారు. డీసీపీ భూరలింగయ్య నేతృత్వంలో అధిక సంఖ్యలో పోలీసు బలగాలు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుతో పాటు పరిసర ప్రాంతాల్లో మొహరిస్తున్నాయి.

English summary
DA case convicted Sasikala Natarajan leaves Chennai and likely to reach Bengaluru by evening and she will appear before Special court in Parappana Agrahara today(Feb 15).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X