వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్లింట్ జ్ఞాపకార్థం: పెయింటింగ్ పోటీలకు ఎంట్రీల ఆహ్వానం

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: ప్రసిద్ధ బాల చిత్రకారుడు ఎడ్మండ్ థామస్ క్లింట్ జ్ఞాపకార్థం కేరళలోని తిరువనంతపురంలో అంతర్జాతీయ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు ఎంట్రీలను ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కేరళకు చెందిన ఎంటి జోసెఫ్, చిన్నమ్మ జోసెఫ్‌లకు 1976లో ఎడ్మండ్ థామస్ క్లింట్ జన్మించారు. క్లింట్ తను జీవించిన 2,522 రోజుల్లోనే 25వేలకు పైగా చిత్రాలను చిత్రీకరించారు. అతను చిత్రీకరించిన చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందడంతోపాటు అనేకమంది ప్రశంసలు అందుకున్నాయి.

అంతేగాక ఏడు పుస్తకాలను, రెండు డాక్యుమెంటరీలను కూడా థామస్ క్లింట్ రూపొందించాడు. క్లింట్ 30వ వర్ధంతి సందర్భంగా ఈ అంతర్జాతీయ పోటీలను నిర్వహించడం జరుగుతోంది. ఈ పోటీలను కేరళ పర్యటకశాఖ నిర్వహిస్తోంది. పోటీల్లో పాల్గొని గెలుపొందిన వారికి విలువైన బహుమతులను కూడా అందజేయనున్నట్లు నిర్వహకులు తెలిపారు.

Registration for Clint Memorial International Children's Painting Competition Begins

టాప్ 5 ఎంట్రీలకు కేరళ ట్రిప్‌ను అందించనున్నట్లు తెలిపారు. విజేతతోపాటు అతని తల్లిదండ్రులు, ఒక వ్యక్తి లేదా అతని సంరక్షకులకు ఈ అవకాశం ఉంటుందని చెప్పారు. 4 నుంచి 15 ఏళ్ల పిల్లలు కేరళకు సంబంధించిన థీమ్‌తో ఆన్‌లైన్ ద్వారా తమ ఎంట్రీలను పంపవచ్చని తెలిపారు. కేరళకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికీ రెండు ఈ బుక్‌లను కేరళ పర్యాటక శాఖ అందిస్తుందని వెల్లడించారు.

ఒక ఈ బుక్‌లో క్లింట్ వేసిన 30 చిత్రాలుంటాయని, మరో బుక్‌లో కేరళకు సంబంధించిన 100 ఫొటోలు ఉంటాయని వివరించారు. పర్యాటక శాఖ వెబ్ సైట్‌లో 3వేల ఆన్‌లైన్ వీడియోలు, 2 వేల ఫొటోలు ఉచితంగా లభిస్తాయని చెప్పారు. యువత కూడా పోటీల్లో స్వచ్ఛందంగా పాల్గొన వచ్చని తెలిపారు. వీరిలో గెలుపొందిన వారు కూడా ఉచిత కేరళ ట్రిప్ అవకాశాన్ని పొందే వీలుంటుందని చెప్పారు. కేరళ పర్యాటకశాఖ అభివృద్ధిలో క్లింట్ పెయింటింగ్ పోటీలు భాగం కాగలవని వారు వివరించారు.

ఇతర వివరాల కోసం సంప్రదించాలని కోరారు.

English summary
Registration started for the online international painting competition for children in memory of Edmund Thomas Clint.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X