వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెనోపాజ్‌పై సరికొత్త అధ్యయనం : యాక్టివ్ సెక్స్ లైఫ్‌లో ఉండే మహిళల్లో కాస్త ఆలస్యంగా..

|
Google Oneindia TeluguNews

మహిళల్లో రుతుస్రావం ఆగిపోయే దశను మెనోపాజ్ అంటారు. సాధారణంగా మెనోపాజ్‌ అనేది 40-50 సంవత్సరాల మధ్య వస్తుంది. మారిన ఆహారపు అలవాట్లు,జీవన విధానంతో కొంతమంది మహిళల్లో 40 ఏళ్లకు ముందుగానే మెనోపాజ్ వస్తోంది. దీన్ని ప్రీ మెనోపాజ్ అంటారు. అయితే తరుచూ శృంగారంలో పాల్గొనేవారిలో మెనోపాజ్ దశ కాస్త ఆలస్యంగానే వస్తుందని యూనివర్సిటీ కాలేజీ లండన్‌ చేపట్టిన కొత్త అధ్యయనంలో తేలింది.

 మెనోపాజ్‌-శృంగారం..

మెనోపాజ్‌-శృంగారం..

శృంగారానికి దూరంగా ఉండే మహిళలతో పోలిస్తే.. తరుచూ శృంగారంలో పాల్గొనే మహిళల్లో మెనోపాజ్ కాస్త ఆలస్యంగా వస్తుందని పరిశోధకులు తేల్చారు. రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్‌ జర్నల్‌లో దీనికి సంబంధించిన వ్యాసాన్ని ప్రచురించారు. కనీసం వారానికి ఒకసారి శృంగారంలో పాల్గొనడం ద్వారా మెనోపాజ్ వచ్చే అవకాశాలు 28శాతం తగ్గుతాయని తమ పరిశోధనలో తేలినట్టు వెల్లడించారు.

 పరిశోధన వివరాలు..

పరిశోధన వివరాలు..

తాజా అధ్యయనం కోసం 1996-97 నుంచి దాదాపు 3వేల మంది మహిళలపై దశాబ్ద కాలం పాటు పరిశోధనలు జరిపారు. ఇందులో సగటు మహిళ వయసు 46 ఏళ్లు. వీరెవరూ మెనోపాజ్ దశలోకి ప్రవేశించనివారే. వీరిలో 45శాతం మంది మహిళలు సహజంగా మెనోపాజ్ దశలోకి ప్రవేశించారు. సగటున 52 ఏళ్లకు వారిలో మెనోపాజ్ మొదలైంది. ఇందులో 78శాతం మంది మహిళలు వివాహితలు లేదా పురుషులతో రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు. వీరిలో తరుచూ శృంగారంలో పాల్గొనేవారిలో మెనోపాజ్ 50 ఏళ్లు లేదా ఆ తర్వాత వచ్చినట్టు గుర్తించారు. శృంగారానికి దూరంగా ఉన్నవారు 50ఏళ్ల కంటే ముందు గానే మెనోపాజ్ దశకు చేరుకున్నట్టు గుర్తించారు.

 మెనోపాజ్ లక్షణాలు

మెనోపాజ్ లక్షణాలు

మెనోపాజ్ వచ్చే ముందు పీరియడ్స్ తేదీల్లో మార్పు వస్తుంది. సాధారణంగా 28రోజులకు ఒకసారి రావల్సిన పీరియడ్‌.. కాస్త ఆలస్యంగా లేదా ముందుగానే రావడం జరుగుతుంది. కొంతమంది నెలసరి రావడంలో తేడా ఉన్నా రక్తస్రావం తక్కువగా ఉంటుంది. కొంత కాలం తర్వాత వీరిలో మెనోపాజ్‌ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక కొంతమందికి నెలసరి ముందుగా లేదా ఆలస్యంగా రావడంతో పాటు రక్తస్రావం కూడా ఎక్కువవుతుంది. మరికొంతమందిలో హార్మోన్ల తేడా వల్ల ఎక్కువ రోజులు రక్తస్రావం జరుగుతుంది.

 మెనోపాజ్ సమస్యలు

మెనోపాజ్ సమస్యలు

మెనోపాజ్ దశలో శరీరం వేడిగా ఉండటం,ఆవిర్లు రావడం జరుగుతుంది. మెనోపాజ్‌ రావడానికి కొన్ని సంవత్సరాల ముందు నుంచే ఈ లక్షణాలు కనిపించవచ్చు. కొంతకాలానికి ఈ సమస్య తగ్గిపోతుంది. మెనోపాజ్ దశలో 75శాతం మంది ఈ సమస్యతో బాధపడ్తారు. మెనోపాజ్ కారణంగా యోని మార్గం పొడిగా మారడం, దురద, ఇన్ఫెక్షన్స్‌ రావడం, కలయిక బాధాకరంగా ఉండటం జరుగుతుంది.

English summary
Women approaching menopause who have frequent sex are less likely to cross that threshold than women of the same age who are not as active sexually, researchers said Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X