వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటీటీ, వెబ్‌సైట్ల నియంత్రణ కోసం ప్రత్యేక వ్యవస్థ.. ఎందుకంటే...

|
Google Oneindia TeluguNews

ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాపై ఆంక్షలు ఉంటాయి. ప్రింట్ మీడియాపై నియంత్రణ కోసం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉండగా.. ఎలక్ట్రానిక్ మీడియాపై అదుపు కోసం కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్ రెగ్యులేషన్ చట్టం ఉంది. అయితే వెబ్ మీడియా, ఓటీటీపై ఎలాంటి చట్టం, వ్యవస్థ లేదు. ఏ కథనం రాస్తున్నారు/ వీడియో ప్లే చేస్తున్నారు. దీనిపై కేంద్రం ఫోకస్ చేసింది. ప్రత్యేక వ్యవస్థ రూపొందించాలని అనుకుంటోంది.

డిజిటల్ మీడియాను కట్టడి చేసేందుకు సెల్ఫ్ రెగ్యులేటరీ వ్యవస్థను, సంబంధిత చట్టాన్ని తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. దేశంలో 100కి పైగా న్యూస్ కంటెంట్ వెబ్ సైట్లు, 40కి పైగా ఓటీటీ వేదికలు ఉన్నాయి. వీటిపై వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ఓ చట్టం ఉండాలని కేంద్రం అనుకుంటోంది. న్యూస్ వెబ్ సైట్ల నుంచి ఫేక్ న్యూస్ వస్తున్నాయని, ఓటీటీ వేదికల నుంచి కూడా భాషా సంబంధిత ఫిర్యాదులు, వీడియో కంటెంట్ పై అభ్యంతరాలు వస్తున్నాయని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు అంటున్నారు.

regulatory for websites and otts in country..

ఫిర్యాదులపై స్పందించేందుకు ఓ వ్యవస్థ అవసరమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. నూతనంగా తీసుకువచ్చే చట్టంలో డిజిటల్ మీడియా స్వేచ్ఛకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. కథనం/ భాషా, వీడియో కంటెంట్‌ను మానిటరింగ్ చేస్తుందని వివరించారు. ఓటీటీ/ వెబ్ సైట్లను మానిటరింగ్ చేయడంతో విచ్చలవిడి తనాన్ని నియంత్రించే అవకాశం ఉంటుంది. ఇకపై అసభ్య పదజాలం/ వీడియో కంటెంట్ కంట్రోల్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటోంది.

English summary
regulatory for websites and otts in country because control of these sites.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X