వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లైఫ్‌లో వచ్చిన ఫస్ట్ ఓటును వేయని రెహాన్! కారణం చెప్పిన ప్రియాంక గాంధీ..

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ఆరోదశ పోలింగ్‌లో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. భర్త రాబర్ట్ వాద్రాతో కలిసి పోలింగ్ బూత్‌కు చేరుకున్న ఆమె ఓటు వేశారు. అయితే ప్రియాంక కుటుంబ సభ్యుల్లో మరొకరు ఓటు వేసేందుకు రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కొడుకు రెహాన్ (19)తొలిసారి ఓటు వేయాల్సి ఉండగా.. అతను వారి వెంట కనిపించకపోవడంపై మీడియా ప్రియాంకను ప్రశ్నించింది. లండన్‌లో చదువుతున్న రెహాన్‌కు ఎగ్జామ్స్ ఉన్నందున తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి వెళ్లాల్సి వచ్చిందని ఆమె సమాధానమిచ్చారు.

బీజేపీ ఓటమీ ఖాయం, కేంద్రంపై ప్రజల్లో ఆగ్రహం ఉంది : ప్రియాంక గాంధీబీజేపీ ఓటమీ ఖాయం, కేంద్రంపై ప్రజల్లో ఆగ్రహం ఉంది : ప్రియాంక గాంధీ

Rehan couldnt vote, gone back to London for his exams : Priyanka

లండన్‌లో చదువుకుంటున్న రెహాన్ వెకేషన్ కోసం ఇండియాకు వచ్చాడు. ఫిబ్రవరిలో మామ రాహుల్ గాంధీతో కలిసి తిరుపతి వెళ్లాడు. తూర్పు యూపీ ఇంఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రియాంక ప్రచారంలో బిజీ అయ్యారు. ఈ క్రమంలో పిల్లలతో కాస్త సమయం గడపాలన్న ఉద్దేశంతో ఆమె కొడుకు రెహాన్‌తో పాటు కూతురు మిరాయను ఎన్నికల ప్రచార సభలకు తీసుకెళ్లారు. క్యాంపెయినింగ్‌లో వారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 19ఏళ్లు రెహాన్‌కు ఓటుహక్కు రావడంతో ఆయన ఈసారి ఓటు వేస్తారని అందరూ భావించారు. అయితే పరీక్షల కారణంగా రెహాన్ తొలిసారి ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయారు.

English summary
As Priyanka Gandhi Vadra and her husband Robert Vadra voted today in Delhi in the sixth round of the national election, the Congress leader was asked about the missing voter in the family. Her son Rehan Vadra, 19, would have been a first time voter in this election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X