వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియో ఫీచర్ ఫోన్ ఉచితం, కానీ: ముఖేష్ సంచలనం, తల్లి కంటతడి

|
Google Oneindia TeluguNews

ముంబై: రిలయన్స్ సంస్థ కొత్త ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ ఫోన్‌ను ఈషా అంబానీ, ఆకాశ్ అంబానీలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫోన్‌లోని ఫీచర్స్‌ను ప్రదర్శించారు.

వాయిస్ మెసేజ్, వీడియోలు చూపించారు. బాహుబలిలో రమ్యకృష్ణకు సంబంధించిన క్లిప్పింగ్‌ను ప్రదర్శించారు. అనంతరం ఈ ఫోన్‌లోని ఫీచర్స్‌ను ముఖేష్ వెల్లడించారు.

జియో ఫోన్ ఉచితం..కానీ

జియో ఫోన్ ఉచితమని ముఖేష్ చెప్పారు. ఈ ఫోన్‌కు రూ.1,500 అని చెప్పారు. అయితే ఈ మొత్తం తిరిగి మూడేళ్ల తర్వాత (రిఫండబుల్) ఇస్తామని చెప్పారు.

కోకిలాబెన్ భావోద్వేగం

కోకిలాబెన్ భావోద్వేగం

రిల‌యెన్స్ 40వ వార్షిక స‌ర్వ‌స‌భ్య స‌మావేశం సంద‌ర్భంగా ముకేష్ అంబానీ కంట‌త‌డి పెట్టారు. ఈ 40 ఏళ్ల‌లో రిల‌యెన్స్ సాధించిన ప్ర‌గ‌తిని చెబుతూ కంట‌త‌డి పెట్టారు. దీంతో ప్రేక్ష‌కుల్లో ఉన్న ఆయ‌న త‌ల్లి కోకిలాబెన్ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీ రిలయన్స్ అని ముఖేష్ చెప్పారు.

Recommended Video

Reliance Jio's Big Announcement on July 21, Here's What You Want
170 రోజుల్లో 10 కోట్ల మంది వినియోగదారులు

170 రోజుల్లో 10 కోట్ల మంది వినియోగదారులు

అంతకుముందు ముఖేష్ మాట్లాడుతూ... 170 రోజుల్లో 10 కోట్ల మంది జియో వినియోగదారులు అయ్యారని చెప్పారు. ప్రతి సెకనుకు ఏడుగురు కస్టమర్లు కొత్తగా వచ్చారన్నారు. చిన్న కంపెనీ నుంచి గ్లోబల్ కంపెనీగా రిలయన్స్ ఎదిగిందన్నారు.

మొబైల్ డేటా వినియోగంలో ప్రథమ స్థానంలో భారత్

మొబైల్ డేటా వినియోగంలో ప్రథమ స్థానంలో భారత్

జియోలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు ఉన్నాయని చెప్పారు. మొబైల్ డేటా వినియోగంలో భారత్ ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. నెలకు 125 కోట్ల జిబి డేటాను జియో వినియోగదారుల వాడుతున్నారన్నారు.

అప్పుడు.. ఇప్పుడు రిలయన్స్..

అప్పుడు.. ఇప్పుడు రిలయన్స్..

1977లో మూడున్నర వేల మంది ఉద్యోగులు ఉండేవారని, ఇప్పుడు 2.50 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. 1977లో రూ.1000 కోట్లతో ప్రారంభమైన రిలయన్స్ ఇఫ్పుడు రూ.16.5 లక్షల కోట్లకు చేరిందన్నారు. 40 ఏళ్ల క్రితం రిలయన్స్ ప్రాఫిట్ రూ.30 కోట్లుగా ఉండేదని, ఇప్పుడు రూ.30,000 కోట్లు అన్నారు.

ఎక్కువ ఫీచర్ ఫోన్లే

ఎక్కువ ఫీచర్ ఫోన్లే

దేశంలో 78 కోట్ల మొబైల్ ఫోన్లు ఉన్నాయని చెప్పారు. అందులో 50 కోట్ల ఫోన్లు ఫీచర్ ఫోన్లే అన్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్ కన్నా జియో వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. 12 నెలల్లో జియో ఫోన్ 99 శాతం మందికి అందుబాటులోకి వచ్చిందన్నారు.

English summary
4G VoLTE feature phone unveiled at Reliance Jio Annual General Meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X