వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేతులు కలపనున్న రిలయన్స్ - ఫేస్‌బుక్: కొత్త యాప్‌తో చైనా యాప్‌కు చుక్కలు..?

|
Google Oneindia TeluguNews

ముంబై: కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో కరాళనృత్యం చేస్తుంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి వేల సంఖ్యలో మృత్యువాత పడగా కొన్ని లక్షల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఆర్థికంగా కూడా ఆయా దేశాలు కుదేలయ్యాయి. ఇక ఆయా దేశాల్లో వాణిజ్య రంగం అట్టడుగుకు పడిపోయింది. ఇక కరోనావైరస్ విజృంభించక ముందు చేసుకున్న కొన్ని ఒప్పందాలకు కూడా మధ్యలోనే బ్రేకులు పడ్డాయి. వాణిజ్య పరంగా ఈ సమయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి దాపురించింది.

Recommended Video

Reliance And Facebook's Multipurpose App To Check Chinese WeChat

కరోనావైరస్ ప్రమాదం ఊహించక ముందు చేసుకున్న ఒప్పందాలపై ఆయా దిగ్గజ సంస్థలు తిరిగి చర్చలు ప్రారంభిస్తున్నాయి. ఇందులో ప్రథమంగా చెప్పుకోవాల్సింది ముఖేష్ అంబానీ సంస్థ రిలయన్స్ మరియు ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్‌లు ఒక యాప్‌ రూపకల్పనపై చర్చలు ప్రారంభించాయి.

 రిలయన్స్ - ఫేస్‌బుక్ తయారు చేస్తున్న యాప్

రిలయన్స్ - ఫేస్‌బుక్ తయారు చేస్తున్న యాప్

రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు ఫేస్‌బుక్ సంస్థలు సంయుక్తంగా ఒక యాప్‌ను డిజైన్ చేసేందుకు చర్చలు ప్రారంభించాయి. వాస్తవంగా ఓ యాప్ తయారు చేయాలని గతంలోనే భావించినప్పటికీ కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో చర్చల్లో కాస్త జాప్యం చోటుచేసుకుంది. చైనాలో అత్యంత పాపులర్ అయిన వీచాట్ తరహా యాప్‌ను తయారు చేయాలని భావిస్తున్నాయి. ఈ మల్టీపర్పస్ యాప్ వాట్సాప్ యూజర్ బేస్‌ను కూడా పెంచేలా తయారు చేయాలని రెండు సంస్థలు భావిస్తున్నాయని ఈ విషయంపై అవగాహన ఉన్న నలుగురు వ్యక్తులు ధృవీకరించారు. ఈ కొత్త ప్రాజెక్టు కోసం రెండు సంస్థలు పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తున్నాయని అంతేకాదు సాంకేతిక పరమైన అంశాలను కూడా చర్చించినట్లు సమాచారం.

మల్టీ పర్పస్ యాప్‌గా రూపకల్పన

మల్టీ పర్పస్ యాప్‌గా రూపకల్పన

ఇక కొత్తగా రూపొందించాలని భావిస్తున్న యాప్‌ కేవలం కమ్యూనికేషన్‌కు మాత్రమే పరిమితం కాకుండా ఇతర అవసరాలకు తగ్గట్టుగా రూపొందించాలని రిలయన్స్-ఫేస్‌బుక్‌ సంస్థలు నిర్ణయించాయి. అంటే రిలయన్స్ రీటెయిల్ స్టోర్స్ నుంచి యాప్ ద్వారా సరుకులు కొనుగోలు, జియోడాట్‌కామ్ నుంచి షాపింగ్ లేదా జియో మనీ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేసేలా ఈ కొత్త యాప్‌ను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. అంటే ఓవరాల్‌గా ఒకే యాప్‌లో డిజిటల్ పేమెంట్స్, సోషళ్ మీడియా, గేమింగ్, ఫ్లైట్ మరియు హోటల్ బుకింగ్స్ ఉంటాయి.

 భారీ వ్యయంతో రూపొందుతున్న ప్రాజెక్టు

భారీ వ్యయంతో రూపొందుతున్న ప్రాజెక్టు

ఇక యాప్ కోసం వాణిజ్యపరంగా దృష్టి సారించిన సంస్థలు మోర్గాన్ స్టాన్లీ సంస్థను ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా నియమించినట్లు సమాచారం. అయితే ఈవ్యవహారంపై రిలయన్స్ కానీ ఫేస్‌బుక్ సంస్థలు కానీ స్పందించలేదు. ఈ ప్రాజెక్టు భారీ వ్యయంతో చేపడుతున్నట్లు రిలయన్స్ సంస్థ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అత్యంత జాగ్రత్తగా దీనిపై పనిచేస్తున్నట్లు చెప్పిన ఆయన... సాంకేతికపరమైన అంశాలపై వర్కౌట్ చేస్తున్నవారికి ఆర్థిక పరమైన విషయాలతో సంబంధం ఉండదని చెప్పారు. అంత గోప్యంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు చెప్పారు.

రిలయన్స్ ఫేస్‌బుక్‌ల మధ్య బంధం బలోపేతం

రిలయన్స్ ఫేస్‌బుక్‌ల మధ్య బంధం బలోపేతం

ఈ కొత్త ప్రాజెక్టు రిలయన్స్ మరియు ఫేస్‌బుక్‌ సంస్థలను మరో ఎత్తుకు తీసుకెళుతాయని రిలయన్స్ ఉన్నతాధికారి చెప్పారు. ఫేస్‌బుక్ రిలయన్స్‌లో ఇన్వెస్ట్ చేయడం కానీ, రిలయన్స్ ఫేస్‌బుక్‌లో పెట్టుబడులు పెట్టడం గానీ జరుగుతుందని తద్వారా దృఢమైన భాగస్వామ్యం ఏర్పడుతుందని విశ్వసనీయ సమాచారం. ఇరు సంస్థలు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అత్యుత్తమమైన కన్సల్టెంట్లను, లాయర్లను ఈ ప్రాజెక్టు కోసం నియమించుకున్నట్లు సమాచారం.

English summary
Mukesh Ambani-led Reliance Industries and Facebook are exploring the possibility of creating a multipurpose app, similar to Chinese super-app WeChat, by leveraging the WhatsApp platform and user base, said four people familiar with the matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X