వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేషనల్ హెరాల్డ్, కాంగ్రెస్ నేతలపై 5వేల కోట్ల పరువు నష్టం దావ విరమించుకున్న అనిల్ అంబానీ

|
Google Oneindia TeluguNews

రఫెల్ వివాదంలో భాగంగా నేషనల్ హెరాల్డ్, తో పాటు మధ్యప్రదేశ్‌కు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులపై పై 5000 వేల కోట్ల రుపాయల పరువు నష్టం దావా కేసు కేసును రిలయన్స్ గ్రూప్ విరమించుకుంది. ఇందుకు సంబంధించి దావాను విరమించుకుంటున్నట్టు ముద్దాయిలకు చెప్పినట్టు రిలయన్స్ గ్రూప్ న్యాయవాది తెలిపారు.

 Reliance Group withdraw the Rs 5,000 crore civil defamation suits

కాగా రఫేల్ ఒప్పందానికి సంబంధించి ఒప్పందానికి పది రోజుల ముందుగానే తెలుసని నేషనల్ హెరాల్డ్ పత్రిక కథనాన్ని ప్రచురించింది. దీంతో అనిల్ అంబానీ గ్రూప్ర నెషనల్ హెరాల్డ్ పత్రికతోపాటు కాంగ్రెస్ నాయకులైన రణదీప్‌సింగ్ సుర్జేవాల, ఉమెన్ చాందీ, అశోక్ చవాన్ , అభిషేక్ సింఘ్వీ, సంజయ్ నిరుపమ్, తోపాటు కొంతమంది జర్నలిస్టులపైన సుమారు 5000 కోట్ల రుపాయలకు పరువు నష్టం దావ వేశారు.

కాగా దీనికి సంబంధించి నెషనల్ హెరాల్డ్ పత్రికతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కేసును విరమించుకోవాలని కోరినట్టు రిలయన్స్ గ్రూప్‌కు చెందిన కౌన్సిల్‌కు అప్పీల్ చేసుకున్నట్టు వారు తెలిపారు.కాగా రఫెల్ ఒప్పందంపై అటు కాంగ్రెస్ నేతలతో పాటు బీజేపీ మధ్య పెద్ద ఎత్తున ఆరోపణలు తలెత్తాయి. దీంతో ప్రధాని నరేంద్రమోడీ రఫెల్ ఒప్పందం కుంభకోణం నుండి బయటపడేందుకు ఏకంగా రాజీవ్ గాంధీ భోఫోర్స్
కుంభకోణం కేసులో ఆయన రాజీవ్ పై ఆరోపణలు చేశాడు. దీంతో ఎన్నికల నేపథ్యంలో రెండు పార్టీల మధ్య ఓవైపు రఫెల్ ఒప్పందం మరోవైపు రాజీవ్ గాంధీ బోఫోర్స్ కుంభకోణం ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

English summary
Anil Ambani’s Reliance Group has decided to withdraw the Rs 5,000-crore civil defamation suits filed in an Ahmedabad court against Congress leaders and National Herald newspaper over their statements and an article on Rafale fighter jet deal
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X