వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్:ఏప్రిల్ తర్వాత జియో కస్టమర్లు తగ్గే అవకాశం, నాణ్యత, సర్వీస్ చూసే కస్టమర్లు కొనసాగే అవకాశం

టెలికం రంగంలో ఉచిత హమీతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన రిలయన్స్ ఏప్రిల్ తర్వాత తన కస్టమర్లను కోల్పోయే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై:టెలికం రంగంలో రిలయన్స్ జియో ఇతర టెలికం కంపెనీలకు చుక్కలు చూపింది. జియో రంగ ప్రవేశంతో ప్రత్యర్థి కంపెనీలు తమ టారిఫ్ రేట్లను తగ్గించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.అయితే ఏప్రిల్ తర్వాత జియోకు కూడ ఇతర టెలికం కంపెనీలు పడిన కష్టాలను పడే పరిస్థితి కన్పిస్తోందని నివేదికలు చెబుతున్నాయి.

రిలయన్స్ జియో మార్కెట్ లోకి ప్రవేశించడంతో దేశీయ టెలికం దిగ్గజ కంపెనీలు ఢీలా పడ్డాయి. రిలయన్స్ ను ధీటుగా ఎదుర్కోవడానికి పలు రకాల వ్యూహలను అనుసరించాయి.అయితే ఈ వ్యూహాలు మాత్రం పనిచేయలేదు.

రిలయన్స్ జియో మార్కెట్ లోకి రావడంతోనే కస్టమర్లను ఆకర్షించేందుకుగాను ఉచిత వాయిస్ కాల్స్, డేటా ను ప్రవేశపెట్టింది. ఉచిత ఆఫర్లతో కస్టమర్లు రిలయన్స్ జియో వైపుకు కస్టమర్లు మళ్ళారు.

అయితే ఎయిర్ టెల్ కంపెనీ రిలయన్స్ జియోను దెబ్బతీసేందుకు గాను ఉచితంగా రోమింగ్ ను ప్రవేశపెట్టింది. అంతర్జాతీయ కాల్స్ కు కూడ రోమింగ్ ఛార్జీలు వసూలు చేయడం లేదని ఎయిర్ టెల్ ప్రకటించింది. ఉచిత ఎస్ ఎం ఎస్ పథకానికి కూడ ఎయిర్ టెల్ శ్రీకారం చుట్టింది.

ఏప్రిల్ తర్వాత జియో కస్టమర్లు తగ్గుతారా?

ఏప్రిల్ తర్వాత జియో కస్టమర్లు తగ్గుతారా?

ఉచిత ఆఫర్లతో మార్కెట్ లోకి రిలయన్స్ జియో వచ్చింది.అయితే మార్చి మాసాంతం వరకే ఉచిత ఆఫర్లు ఉంటాయని జియో ప్రకటించింది. అయితే ఏప్రిల్ తర్వాత జియో తన కస్టమర్లను కోల్పోయే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. హ్యాపీ న్యూయర్ ఆఫర్ మార్చి 31వ, తేదితో పూర్తి కానుంది.దీంతో రిలయన్స్ జియో కస్టమర్లు ఇతర నెట్ వర్క్ ల వైపుకు వెళ్ళే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.

జియో టారిఫ్ లతో నెట్ వర్క్ లో కొనసాగే విషయమై సందిగ్థత

జియో టారిఫ్ లతో నెట్ వర్క్ లో కొనసాగే విషయమై సందిగ్థత

మార్చి 31 వరకు ఉచిత ఆఫర్ ను రిలయన్స్ జియో కొనసాగిస్తోంది.అయితే ఆరు మాసాల పాటు ఉచితంగా రిలయన్స్ జియో సేవలను ఉపయోగించుకొన్న కస్టమర్లు ఈ నెట్ వర్క్ లో ఉండాలా , వేరే నెట్ వర్క్ కు మళ్ళాలా అనే విషయమై సందిగ్థతలో ఉన్నారు.కొత్త టారిఫ్ లు ఏప్రిల్ నుండి అమలు కానున్నాయి. అలాగే డేటా క్వాలిటీ, స్పీడ్ పై వేచి చూసే ధోరణిని అవలంభిస్తున్నారు కస్టమర్లు.

సేవలు బాగుంటే జియోలో కొనసాగుతాం

సేవలు బాగుంటే జియోలో కొనసాగుతాం

రిలయన్స్ జియో సేవల నాణ్యత ఆధారంగా ఏప్రిల్ నుండి ఆ కంపెనీకి కస్టమర్ల సంఖ్య కొనసాగే అవకాశం ఉందని నివేదికలుచెబుతున్నాయి. ఇతర కంపెనీల నెట్ వర్క్ లను ఉపయోగిస్తూనే రిలయన్స్ జియో నెట్ వర్క్ ను కూడ ఉపయోగించే కస్టమర్లు అనేకమంది ఉన్నారు.అయితే ఇతర టెలికం కంపెనీల కంటే నాణ్యత, సేవల విషయంలో రిలయన్స్ జియో కస్టమర్లను సంతృప్తి పర్చగలిగితే కస్టమర్లు అదే నెట్ వర్క్ లో కొనసాగే అవకాశం ఉంది.

జియో కు చెక్ పెట్టేందుకు టారిఫ్ లను తగ్గిస్తోన్న కంపెనీలు

జియో కు చెక్ పెట్టేందుకు టారిఫ్ లను తగ్గిస్తోన్న కంపెనీలు

రిలయన్స్ జియో దెబ్బకి ఇబ్బందులను ఎదుర్కొన్న ప్రత్యర్థి టెలికం కంపెనీలు రిలయన్స్ జియో అనుసరించిన ఉచిత ఆఫర్లను ప్రవేశపెడుతున్నాయి. ఎయిర్ టెల్ తాజాగా ఈ ఏడాది ఏప్రిల్ నుండి కొత్త టారిఫ్ లను అమలు చేయనున్నట్టుప్రకటించింది. రోమింగ్ ఛార్జీలు లేవని ఎయిర్ టెల్ ప్రకటించింది. దీనికి తోడు అంతర్జాతీయ కాల్స్ కు ఇదే పద్దతిని అనుసరిస్తామని ఆ కంపెనీ ప్రకటించింది. వొడాఫోన్ గత పరిమితంగానే ఉచిత ఆఫర్ ను ప్రకటించింది. ఎయిర్ టెల్ ఉచిత ఆఫర్లను ప్రకటిండంతో ఇతర టెలికం కంపెనీలు కూడ ఇదే బాటన సాగే అవకాశం లేకపోలేదు.

English summary
For the 100 million plus consumers lured by Reliance jio's disruptive welcome and happy New year free offers in six months, the party has finally ended, starting April they will have to choose to stay or leave the jio network. which has lined up easy and attractive entry points.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X