వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఖేష్ అంబానీ:భారీ లక్ష్యానికి రిలయన్స్ జియో ఇలా..ప్రత్యర్థులకు చుక్కలేనా?

టెలికం ఇండస్ట్రీలోకి కొత్తగా రంగ ప్రవేశం చేసిన రిలయన్స్ జియో భారీ లక్ష్యాన్ని చేధించింది. రిలయన్స్ జియో పది కోట్ల మంది చందాదారులను లక్ష్యాన్ని దాటింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై:టెలికం ఇండస్ట్రీలోకి కొత్తగా రంగ ప్రవేశం చేసిన రిలయన్స్ జియో భారీ లక్ష్యాన్ని చేధించింది.రిలయన్స్ జియో పది కోట్ల మంది చందాదారుల లక్ష్యాన్ని దాటింది.అనతి కాలంలోనే టెలికం ఇండస్ట్రీలోనూ రిలయన్స్ జియో పదికోట్ల చందాదారుల లక్ష్యాన్ని దాటింది.

రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో ఇతర టెలికం కంపెనీలు తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ఈ మేరకు జియో ఇస్తోన్న ఆఫర్లపై ఇతర టెలికం కంపెనీలు న్యాయ పోరాటానికి కూడ దిగాయి.

ట్రాయ్ తో పాటు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను కూడ టెలికం కంపెనీలు ఆశ్రయించాయి. అయినా ఉచితంగా వాయిస్ కాల్స్, డేటా ఉపయోగించుకొనే సౌకర్యాన్ని ఈ ఏడాది మార్చి వరకు జియో వినియోగదారులకు రిలయన్స్ అందించింది.

పదికోట్ల చందాదారులను దాటిన జియో

పదికోట్ల చందాదారులను దాటిన జియో

రిలయన్స్ జియో అతి తక్కువ కాలంలోనే పది కోట్ల చందాదారుల మార్క్ ను దాటింది.జియో పదికోట్ల చందాదారులను దాటింది.రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ బుదవారం ప్రకటించారు.జియో సేవలను ప్రారంభించిన సమయంలో అతి తక్కువ సమయంలోనే వంద మిలియన్ కస్టమర్లను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకొంది.కానీ, నెలల వ్యవధిలోనే లక్ష్యాన్ని చేరుకొంటామని అంచనా వేయలేదు.

ఆధార్ తో సులభంగా లక్ష్యానికి చేరువగా

ఆధార్ తో సులభంగా లక్ష్యానికి చేరువగా

ఆధార్ ఆధారంగా రిలయన్స్ జియో సేవలను వినియోగదారులకు చేరుకొన్నట్టుగా ముఖేష్ అంబానీ చెప్పారు.ఆధార్ కారణంగానే తాము అతి త్వరలోనే వంద మిలియన్ కస్టమర్లను లక్ష్యంగా చేరుకొన్నట్టు చెప్పారు.మిలియన్ కస్టమర్లను చేరుకోవడానికి ఆధార్ సహకరించిందని ముఖేష్ అంబానీ చెప్పారు.నాస్కామ్ ఇండియా లీడర్ షిప్ ఫోరమ్ 2017 ఇంటరాక్టివ్ సెషన్స్ లో ఆయన చెప్పారు.

5జీ సేవలు కూడ ఉచితంగా

5జీ సేవలు కూడ ఉచితంగా

2016 సెప్టెంబర్ ఐదవ తేది నుండి జియో ఉచిత సేవలను అందుబాటులోకి తెచ్చింది.2015 డిసెంర్ 27వ, తేది నుండి కంపెనీ తొలుత తమ ఉద్యోగులకు ఉచితంగా 4జీ సర్వీసులను ఇస్తోంది.ఈ మేరకు కస్టమర్లకు ఉచితంగానే ఈ సర్వీసులను అందించింది.వినియోగదారులకు ఉచిత సేవల ద్వారా రిలయన్స్ జియో అనతి కాలంలోనే ఎక్కువ మందిని తనవైపుకు తిప్పుకోగలిగింది.

83 రోజుల్లోనే 50 మిలియన్ కస్టమర్లకు ఉచిత సేవలు

83 రోజుల్లోనే 50 మిలియన్ కస్టమర్లకు ఉచిత సేవలు

83 రోజుల్లోనే రిలయన్స్ జియో 50 మిలియన్ కస్టమర్లను చేరుకొంది.ఇటీవలే రిలయన్స్ ఇండస్ట్రీస్ విడుదల చేసిన త్రైమాసిక ఫలితాల సందర్భంగా జియోకు డిసెంబర్ 31 వరకు 72.4 మిలియన్ల చందాదారులకు చేరుకొంది. ప్రస్తుతం జియో వంద మిలియన్ చందాదారుల లక్ష్యాన్ని చేరుకొందని ముఖేష్ అంబానీ చెప్పారు.

English summary
Reliance Industries Chairman and Managing Director Mukesh Ambani on Wednesday said the company's newly launched telecom venture Reliance Jio has crossed 100 million customer base.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X