వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియోకు షాక్: రూ.348లకే ప్రతిరోజూ 1జీబీ డేటా, ఉచిత కాల్స్‌ను ప్రకటించిన ఎయిర్‌సెల్

రిలయన్స్ జియోకు పోటీగా కొత్త ప్లాన్స్‌ను ఎయిర్‌సెల్‌ను ప్రకటించింది. తమ కస్టమర్లను కాపాడుకొనేందుకు ఎయిర్‌సెల్‌ను తెచ్చింది. ఎయిర్‌సెల్ తమ ప్రీపెయిడ్ కస్టమర్లకు బంపర్‌ఆఫర్ ప్రకటించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రిలయన్స్ జియోకు పోటీగా కొత్త ప్లాన్స్‌ను ఎయిర్‌సెల్‌ను ప్రకటించింది. తమ కస్టమర్లను కాపాడుకొనేందుకు ఎయిర్‌సెల్‌ను తెచ్చింది. ఎయిర్‌సెల్ తమ ప్రీపెయిడ్ కస్టమర్లకు బంపర్‌ఆఫర్ ప్రకటించింది.

షాక్: జియో యూ టర్న్, వినియోగదారుల డేటా లీక్, ఫిర్యాదుషాక్: జియో యూ టర్న్, వినియోగదారుల డేటా లీక్, ఫిర్యాదు

ఉచితడేటా, ఉచిత వాయిస్‌కాల్స్ సేవలతో రిలయన్స్ జియో మార్కెట్‌లోకి ప్రవేశించిన సంచలనాలు సృష్టించింది. ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలు చూపించింది జియో.

ఉచిత ఆఫర్లతోపాటు ధనాధన్, సమ్మర్‌సర్‌ప్రైజ్ ఆఫర్లు గడువు ఈ నెలతో పూర్తికానున్నాయి. ఈ గడువు ముగుస్తున్నందున కొత్త ప్లాన్స్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్స్ కు ధీటుగా కొత్త ప్లాన్స్‌ను ఎయిర్‌సెల్ ప్రకటించింది.

శుభవార్త: రూ.349, రూ.399లకు కొత్తప్లాన్స్‌ను ప్రకటించిన జియోశుభవార్త: రూ.349, రూ.399లకు కొత్తప్లాన్స్‌ను ప్రకటించిన జియో

జియో కంటే తక్కువ ధరకే ఎయిర్‌సెల్‌ కొత్త ప్లాన్స్‌ను ప్రకటించింది. జియో వైపుకు తమ కస్టమర్లను జియో వైపుకు మళ్ళకుండా ఉండేందుకుగాను ఆ ప్లాన్‌కంటే మెరుగైన ఆఫర్‌ను ప్రకటించింది.

రూ.348లకే కొత్త ప్లాన్‌ను ప్రకటించిన ఎయిర్‌సెల్

రూ.348లకే కొత్త ప్లాన్‌ను ప్రకటించిన ఎయిర్‌సెల్

రూ.348లకే తమ యూజర్లకు కొత్త ప్లాన్స్‌ను ప్రకటించింది ఎయిర్‌సెల్. ఈ ప్లాన్‌కింద ప్రతిరోజూ 1జీబీడేటాతోపాటు అపరిమిత వాయిస్‌కాల్స్‌ను చేసుకొనే అవకాశం కల్పించింది. దీనికితోడు అపరిమితంగా ఎస్ఎంఎస్‌లు కూడ ఉపయోగించుకోవచ్చు. ఈ సౌకర్యం 84రోజులపాటు ఉంటుంది. ఎయిర్‌సెల్ ప్రకటించిన ఈ ఆఫర్ జియో ప్రకటించిన రూ.399 ప్లాన్‌కు గట్టిపోటీ ఇవ్వనుందని మార్కెట్ల నిపుణులు అంచనావేస్తున్నారు.

రూ. 348 ప్యాకేజీ యూపీకే పరిమితం

రూ. 348 ప్యాకేజీ యూపీకే పరిమితం

ఎయిర్‌సెల్ కొత్త రీచార్జీ ప్యాక్ రూ.348 ప్రస్తుతం ఉత్తరయూపీలో మాత్రమే అందుబాటులో ఉందనే నిపుణులు చెబుతున్నారు. ఈ ప్యాక్ కింద యూజర్లు ఏ నెట్‌వర్క్‌కైనా 84 రోజులపాటు అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. ఎలాంటి డైలీ, లేదా వీక్లి పరిమితులు లేవు. అయితే ఇంటర్నెట్ స్పీడ్ మాత్రం 3జీగానే ఉంటుంది. రిలయన్స్ జియో అయితే 4జీ స్పీడ్ పొందే అవకాశం ఉంది.

రూ.348 ఆఫర్ అందరికీ ప్రయోజనం

రూ.348 ఆఫర్ అందరికీ ప్రయోజనం

ఎఫ్‌ఆర్‌సీ రూ.348 మార్కెట్లో ఇప్పటివరకు అత్యుత్తమమై విలువ గలదన్నారు ఎయిర్‌సెల్ యూపీ ఈస్ట్ సర్కిల్ బిజినెస్ హెడ్ రాజీవ్‌గుప్తా చెప్పారు.2జీ,3జీ,4జీ హ్యండ్‌సెట్ ఉన్న కస్టమర్లందరీకీ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. బ్యాలెన్స్ అయిపోతోందనే బాధ అవసరం లేకుండానే వీడియో చాటింగ్ సోషల్ నెట్‌వర్కింగ్, వీడియోల స్ట్రీమింగ్, వాయిస్‌కాల్స్ చేసుకొనే కస్టమర్లకు ప్రత్యేకంగా ఈ ప్యాకేజీని డిజైన్ చేసినట్టు ఆయన తెలిపారు.

టెలికం పరిశ్రమకు ఊరట

టెలికం పరిశ్రమకు ఊరట

రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ల నుండి టారిఫ్ ప్లాన్స్ అమలు చేయడం , ఆ తర్వాత ప్లాన్ల రేట్లను పెంచడం టెలికం ఇండస్ట్రీకి సానుకూలంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ప్రత్యర్థి కంపెనీలు కూడ జియో రేట్లకు అనుగుణంగా తమ టారిఫ్ ప్లాన్లను పెంచుకొనేందుకు వెసులుబాటు కలుగుతోందన్నారు.

English summary
Aircel has launched a new prepaid pack, priced at Rs. 348, which will give users 1GB of data and unlimited calls for 84 days as well, totalling 84GB data for the period.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X