వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపే జియో ఫైబర్ ప్రారంభం: రిజిస్ట్రేషన్, ధరలు, 4కే టీవీ ఆఫర్, ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’, ఇతర వివరాలు

|
Google Oneindia TeluguNews

ముంబై: టెలికాం రంగంలో భారత కుబేరుడు ముకేష్ అంబానీ జియోను తీసుకొచ్చి సంచలనమే సృష్టించారు. ఇప్పుడు జియో ఫైబర్‌((రిలయన్స్ జియో జిగాఫైబర్))తో మరోసారి సంచలనంగా సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జియో ఫైబర్ సేవలు సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్నాయి.

షాక్: ఒకటో తరగతి బాలుడి మీద అత్యాచారయత్నం కేసు, వింటేనే విచిత్రం !షాక్: ఒకటో తరగతి బాలుడి మీద అత్యాచారయత్నం కేసు, వింటేనే విచిత్రం !

జియో ప్రారంభ ఆఫర్లు..

జియో ప్రారంభ ఆఫర్లు..

జియో వెబ్‌సైట్ ద్వారా ఇప్పటికే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. గురువారం (సెప్టెంబర్ 5) జియో ఫైబర్‌ సేవలను ప్రారంభిస్తున్న సందర్భంగా 100 ఎంబీపీఎస్ వేగం నుంచి గరిష్టంగా 1జీబీపీఎస్ వరకు నెట్‌వర్క్‌ను అందించనున్నట్లు తెలిపింది.
అంతేగాక, జియో ఫైబర్ ఇన్‌స్టాలేషన్, కనెక్షన్‌కు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది. ఫిక్స్‌డ్ ఫోన్ సర్వీస్, గేమింగ్ కేబుల్ సెట్-టాప్-బాక్స్, ఉచిత 4కే టీవీ, జియో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ) సర్వీసులు అందించనుంది. అయితే, రూటర్ కోసం మాత్రం రూ. 2,500 డిపాజిట్ చేయాల్సి ఉంటుందని, ఆ మొత్తాన్ని రిఫండ్ చేస్తామని కూడా పేర్కొంది.

జియో ఫైబర్ ప్లాన్స్:

జియో ఫైబర్ ప్లాన్స్:


ప్రీమియం వినియోగదారులకు జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు నెలకు రూ. 700 నుంచి రూ. 10వేల వరకు ఉండనున్నాయి. ప్రస్తుతం జియో ఫైబర్ సేవలను ప్రీపెయిడ్ రూపంలో అందిస్తామని, భవిష్యత్‌లో పోస్ట్ పెయిడ్ సేవలను కూడా అందుబాటులోకి తెస్తామని జియో వివరించింది.

జియో ఫైబర్ రిజిస్ట్రేషన్ ఎలా?

జియో ఫైబర్ రిజిస్ట్రేషన్ ఎలా?

జియో ఫైబర్ సేవలను పొందేందుకు జియో వెబ్ సైట్‌లో అడ్రస్ తెలిపి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కాగా, గత సంవత్సరం నుంచే జియో ఫైబర్ కోసం రిజిస్ట్రేషన్ ను ప్రారంభించింది జియో. ఇప్పటి వరకు 15 మిలియన్లకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. దేశంలో 1600 పట్టణాల్లో జియో సేవలు అందుబాటులోకి తీసుకొస్తోంది. పూర్తి వివరాలు వారంలోగా తెలిపే అవకాశం ఉంది.

ఈ 16 పట్టణాల్లో సేవలు..

ఈ 16 పట్టణాల్లో సేవలు..

ప్రస్తుతం జిగా జియో ఫైబర్ కనెక్షన్లు హైదరాబాద్, విశాఖపట్నం, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, జైపూర్, సూరత్, వడోదర, చెన్నై, నోయిడా, ఘజియాబాద్, భువనేశ్వర్, వారణాసి, అలహాబాద్, బెంగళూరు, ఆగ్రా, మీరట్, లక్నో, జంషెడ్‌పూర్, హరిద్వార్, గయ, పాట్నా, పొర్ట్ బ్లెయిర్, పంజాబ్‌లలో అందుబాటులో ఉన్నాయి. మిగితా నగరాల్లోనూ త్వరలోనే జియో ఫైబర్ సేవలు అందనున్నాయి.

ఫస్ట్ డే ఫస్ట్ షో...

ఫస్ట్ డే ఫస్ట్ షో...

కల్, ఎస్టీడీ సేవలతోపాటు ఓటీటీ కంటెంట్ కూడా ఉచితంగా అందిస్తోంది. ఓటీటీలో ఏం వస్తాయనేది ఇంకా స్పష్టత లేదు. కానీ, జియో సినిమా, జియోటీవీ, జియో సావన్ లాంటి సేవలు అందుబాటులో ఉండనున్నాయి. అంతేగాక, జియో ప్రీమియం జియోఫైబర్ కస్టమర్లకు ‘ఫస్ట్ డే ఫస్ట్ షో' సేవలను కూడా అందిస్తోంది. దీని ప్రకారం కొత్త సినిమాను విడుదలైన రోజే వినియోగదారులు తమ ఇంట్లోనే వీక్షించవచ్చు.

English summary
Reliance Jio GigaFiber that has been renamed Jio Fiber will be launched in India this week on September 5. The JioFiber will be accompanied by a fixed-line phone service, a gaming-capable set-top-box, free 4K TV and Jio Internet of Things (IoT) services.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X