అంబానీ పెళ్లి కానుక.. ఉచితంగా జియో రూ.259 రీఛార్జి?

ప్రపంచలోని టాప్-5 కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈనెల ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు అత్యంత వైభవంగా ఈ వేడుకలు జరిగాయి. మనదేశంలోని ప్రముఖులతోపాటు ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. జులై 12వ తేదీన వీరి వివాహం జరగబోతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. రిలయన్స్ జియో తన యూజర్లకు రూ.259 రీఛార్జి ఉచితంగా ఇవ్వనున్నారనేది ఈ వార్తల సారాంశం.

దీనికి సంబంధించిన గడువు మూడురోజుల్లోనే ముగియబోతోందని, వెంటనే రిజిస్టర్ చేసుకోవాలంటూ వాట్సాప్ లో లింకులు వైరలవుతున్నాయి. వెంటనే దీనిపై పోలీసులు అప్రమత్తమయ్యారు. తాము ఎటువంటి ఫ్రీ రీఛార్జి ప్రకటించలేదని రిలయన్స్ సంస్థ ప్రకటించింది. వస్తున్న వార్తలు అవాస్తవమని, వాట్సాప్ లో వచ్చే లింకులపై క్లిక్ చేయవద్దని పోలీసులు హెచ్చరించారు.

reliance jio free recarge worth 259 rupees

ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ను వివాహమాడనున్నారు. ఈ ఏడాది జులై 12వ తేదీన పెళ్లి జరగబోతోంది. ప్రపంచంలోని కుబేరుల్లో ఒకరైన ముఖేష్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ప్రముఖులందరినీ ఆహ్వానించారు. మనదేశంలో సినీ పరిశ్రమకు చెందిన అతిరథ మహారథులంతా హాజరయ్యారు. తెలుగు నుంచి రామ్ చరణ్ ఒక్కడికే ఈ వేడుకలకు ఆహ్వానం అందించింది. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ త్రయంతో కలిసి నాటు నాటు పాటకు రామ్ చరణ్ కూడా స్టెప్పులేశారు. అనంత్ అంబానీ పెళ్లి వేడుకను అత్యంత వైభవోపేతంగా నిర్వహించాలని ముఖేష్ అంబానీ భావిస్తున్నారు. ఇప్పటినుంచే అందుకు తగ్గ ఏర్పాట్లు చేయిస్తున్నారు. పెళ్లి వేడుకకు అన్నిరంగాల్లో ప్రముఖులైన మరింతమంది అతిరథులంతా హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+