వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియో కస్టమర్లకు గుడ్ న్యూస్: ఆల్‌ ఇన్ వన్ ప్లాన్ ప్రకటించిన జియో..ప్రారంభ ధర ఇదే..!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: టెలికాం రంగంలో సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ జియో సంస్థ తాజాగా తన టారిఫ్‌లను కూడా పెంచిన సంగతి తెలిసిందే. టారిఫ్ రేట్లు అయితే పెంచిందికానీ తన కస్టమర్లకు మాత్రం ఊరటనిస్తూ మరో ఆల్‌ ఇన్ వన్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ఆల్‌ ఇన్ వన్ ప్లాన్ రూ.199తో ప్రారంభం అవుతుంది. ఇక గరిష్టంగా రూ.2,199గా ఆల్‌ ఇన్ వన్ ప్లాన్ ఉంది. కొత్త టారిఫ్ రేట్లు ఒకనెలా, రెండు నెలలు, మూడు నెలలు , 12 నెలలుగా వాటిని కేటగిరీలో చేర్చింది. ఇవన్నీ 28 రోజుల నుంచి 365 రోజులు వ్యాలిడిటీతో వస్తున్నాయి. పాత ప్లాన్ల కంటే ఈ కొత్త ప్లాన్లు 40శాతం ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తాయని జియో చెబుతోంది. అదే సమయంలో 300శాతం మేరా లబ్ధి చేకూరుతుందని జియో వెల్లడించింది.

ఆస్తులు అమ్మి డబ్బులు కట్టాలి..ఆ టెలికాం ఆపరేటర్లను ప్రభుత్వం ఆదుకోరాదు: జియోఆస్తులు అమ్మి డబ్బులు కట్టాలి..ఆ టెలికాం ఆపరేటర్లను ప్రభుత్వం ఆదుకోరాదు: జియో

Recommended Video

News Roundup : Chidambaram Satires On Nirmala Sitharaman Comments Over Onion Prices !
రూ. 199తో బేస్ ప్లాన్ ప్రారంభం

రూ. 199తో బేస్ ప్లాన్ ప్రారంభం

ఇక జియో ఆల్ ఇన్ వన్ బేస్ ప్లాన్ రూ.199తో ప్రారంభమవుతుంది. ఇందులో రోజుకు 1.5 జీబీ డేటాతో పాటు జియో నుంచి మరో జియో నెట్‌వర్క్‌కు అన్‌లిమిటెడ్ కాలింగ్, నాన్ జియో నెట్‌వర్క్‌లకు 1000 నిమిషాలు కాలింగ్, వంటివి ఉన్నాయి. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులు. ఇక 28 రోజుల పాటు వ్యాలిడిటీ ఉన్న ఇతర జియో ప్లాన్లు రూ.249, రూ. 349 ఉన్నాయి. ఇవి వరుసగా రోజుకు 2జీబీ, 3జీబీ డేటాను అందిస్తాయి.

రెండు నెలల ప్లాన్లు రూ.399తో ప్రాంరంభం

రెండు నెలల ప్లాన్లు రూ.399తో ప్రాంరంభం

ఇక రిలయన్స్ జియో రెండు నెలల ప్లాన్లు రూ.399తో ప్రాంరంభం అవుతాయి. ఈ ప్లాన్‌లో కూడా రోజుకు 1.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ జియో నుంచి జియోకు కాలింగ్, ఇతర నెట్‌వర్క్‌లకు 2000 నిమిషాలు కాలింగ్ సదుపాయాలు ఉన్నాయి. ఇక రూ.444 ప్లాన్‌ కూడా రూ.399లాంటి బెనిఫిట్లనే అందిస్తుండగా డేటా మాత్రం రోజుకు 2జీబీని ప్రొవైడ్ చేయనుంది.

రెండు 3 నెలల ప్లాన్లు 84 రోజుల వ్యాలిడిటీ

రెండు 3 నెలల ప్లాన్లు 84 రోజుల వ్యాలిడిటీ

ఇక రెండు మూడు నెలల ప్లాన్లను కూడా జియో అందిస్తోంది. దీని వ్యాలిడిటీ 84 రోజులు. జియో నుంచి జియోకు అపరిమిత కాలింగ్, ఇతర్ నెట్‌వర్క్‌లకు 3వేల నిమిషాల ఉచిత కాలింగ్ వంటి సదుపాయాలు కల్పిస్తోంది. ఇక రూ.555 ప్లాన్ రోజుకు 1.5 జీబీ డేటా అందిస్తుండగా.. రూ.599 ప్లాన్ రోజుకు 2జీబీ డేటాను అందిస్తుంది. ఇక వార్షిక ప్లాన్‌కు వస్తే రూ.2,199తో రీచార్జ్ చేయించుకుంటే 12 నెలల వ్యాలిడిటీ రోజుకు 1.5 జీబీ డేటాతో పాటు జియో టు జియో అపరమిత కాలింగ్, ఇతర నెట్ వర్క్‌లకు 12000 నిమిషాల ఉచిత కాలింగ్ వంటి బెనిఫిట్లు ఉన్నాయి.

ఇక రిలయన్స్ జియో అన్ని అప్లికేషన్లను ఒకే తాటిపైకి తీసుకొచ్చింది. ఇందులో జియో సినిమా, జియో టీవీ, జియో సావ్న్, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్, జియో హెల్త్ క్లబ్ లాంటి కేవలం ప్రైమ్ కస్టమర్లకు మాత్రమే అందిస్తోంది.

English summary
Reliance Jio has announced its new All-in-One plans in line with recent tariff hikes in the telecom industry. The cheapest plan costs Rs 199, whereas the costliest plan has been priced at Rs 2,199
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X