వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రాయ్ పై ఎయిర్ టెల్, ఐడియా ఫిర్యాదు, జియోకు క్లీన్ చీట్ ఇచ్చినందుకేనా?

రిలయన్స్ జియో అందిస్తోన్న ఉచిత ఆఫర్లపై ట్రాయ్ క్లీన్ చీట్ ఇవ్వడంపై టిడిశాట్ ను ఆశ్రయించాయి ఎయిర్ టెల్, ఐడియా కంపెనీలు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై:టెలికాం సంస్థ రిలయన్స్ , జియో ఆపర్ చేస్తోన్న హ్యాపీ న్యూయర్ టారిఫ్ ప్లాన్ కు మరో చిక్కు వచ్చిపడింది.అయితే ట్రాయ్ రిలయన్స్ కు క్లీన్ చీట్ ఇవ్వడంపై ఎయిర్ టెల్ , ఐడియా లు టెలికాం డిస్ప్యూట్ సెటిల్ మెంట్ అండ్ అప్పీలెంట్ ట్రిబ్యునల్ వద్ద ట్రాయ్ పై ఫిర్యాదు చేశాయి.

ఇండియాలో సెల్ ఫోన్ కంపెనీల మద్య యుద్దవాతావరణం నెలకొంది. జియో తన వినియోగదారులకు ఉచితంగా సర్వీసును ఇవ్వడంపై ఎయిర్ టెల్, ఐడియా కంపెనీలు అభ్యంతరాలు చెబుతున్నాయి.

అయితే ఈ విషయమై జియో తీరును తప్పుబడుతూ ట్రాయ్ ను ఆశ్రయించాయి ఐడియా, ఎయిర్ టెల్ కంపెనీలు.అయితే జియో తన వినియోగదారులకు ఉచితంగా సర్వీసును ఇవ్వడంపై ట్రాయ్ క్లీన్ చీట్ ఇచ్చింది.

ట్రాయ్ క్లీన్ చీట్ ఇవ్వడంపై ఎయిర్ టెల్, ఐడియా కంపెనీలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.దీంతో ట్రాయ్ పైనే ఏకంగా ఈ రెండు కంపెనీలు ఫిర్యాదుకు దిగాయి.

ట్రాయ్ పై ఐడియా, ఎయిర్ టెల్ టిడిశాట్ కు ఫిర్యాదు

ట్రాయ్ పై ఐడియా, ఎయిర్ టెల్ టిడిశాట్ కు ఫిర్యాదు

జియో వెల్ కమ్ ఆఫర్ ,హ్యాపీ న్యూ ఇయర్ ఆపర్ అంటూ రెండు వేర్వేరు అంటూ ట్రాయ్ తేల్చిచెప్పింది. రిలయన్స్ కంపెనీ ఇచ్చిన హ్యాపీ న్యూయర్ టారిఫ్ ప్లాన్ పై ఎయిర్ టెల్, ఐడియా కంపెనీలు ట్రాయ్ ను ఆశ్రయిస్తే రెండు వేర్వేరు ఆఫర్లంటూ రిలయన్స్ కు క్లీన్ చీట్ ఇచ్చింది. దీంతో ట్రాయ్ పైనే ఈ రెండు కంపెనీలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.టెలికాం డిస్ప్యూట్ సెటిల్ మెంట్ అండ్ అప్పీలెంట్ ట్రిబ్యునల్ వద్ద ట్రాయ్ పై ఫిర్యాదును దాఖలు చేశాయి.

ఫిభ్రవరి 15 లోపుగా వివరణ ఇవ్వాలి

ఫిభ్రవరి 15 లోపుగా వివరణ ఇవ్వాలి

ఫిబ్రవరి 15వ, తేదిలోపుగా వివరణ ఇవ్వాలని ట్రాయ్ ను ట్రిబ్యునల్ ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల20వ, తేదికి వాయిదా వేసింది. టిడిశాట్ వద్ద ఫిర్యాదు చేసిన ఎయిర్ టెల్, ఐడియా కంపెనీలు ఉచిత కాల్స్, డేటా సర్వీసులు అందిస్తోన్న ప్రమోషనల్ ఆఫర్ నే పేరు మార్చాయని ఆరోపిస్తున్నాయి.

జియో రాకతో తీవ్రమైన పోటీ

జియో రాకతో తీవ్రమైన పోటీ

ఇండియాలో ఎయిర్ టెల్ అగ్రస్థానంలో ఉంది.దాని తర్వాతి స్థానాల్లో ఐడియా, వోఢాఫోన్ లు ఉన్నాయి.అయితే వోఢాఫోన్, ఐడియా కంపెనీల మద్య విలీన చర్చలు సాగుతున్నాయి. రిలయన్స్ జియో పేరుతో మార్కెట్లోకి రావడంతో ఈ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడుతోంది.ఉచితంగానే డేటా, వాయిస్ కాల్స్ ను జియో ఇస్తోంది.దీంతో ఇతర కంపెనీలు కూడ తమ వినియోగదారులకు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

నిబంధనలకు విరుద్దంగా జియో ఆఫర్లు

నిబంధనలకు విరుద్దంగా జియో ఆఫర్లు

ఉచిత కాల్స్ , డేటా సర్వీసులు అందిస్తోన్న ప్రమోషన్ ఆపర్ నే పేరు మార్చి వినియోగదారులకు అందించడానికి జియో రెగ్యులేటరీ అనుమతించడాన్ని ఐడియా, ఎయిర్ టెల్ లు తప్పుబడుతున్నాయి. జియో 2017 మార్చి వరకు ఉచిత వాయిస్, డేటా ఆపర్లను అందించడం నిబంధనలకు విరుద్దమని చెబుతున్నాయి.ట్రాయ్ టెలికాం టారిఫ్ ఆర్డర్లను జియో ఉల్లంఘిస్తోందని ఐడియా, ఎయిర్ టెల్ లు ఆరోపిస్తున్నాయి.

English summary
Amid fresh appeals filed by airtel and idea Cellular against trai's clean chit to reliance jio tariffs, tdsat on monday asked the regulator to clarify whether eeliance jio had informed it and its subscribers of the two free offers Jio Welcome Offer and Happy New Offer - being "distinct".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X