వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంపర్ ఆఫర్: 18 నెలలపాటు ఆఫర్లను కొనసాగించనున్న జియో, కారణమిదే!

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: ఉచిత ఆఫర్లతో మార్కెట్లోకి ప్రవేశించిన రిలయన్స్ జియో మరో ఏడాదిపాటు తన ఆఫర్లను ప్రకటించాలని భావిస్తోంది. ప్రత్యర్థి కంపెనీలను దెబ్బకొట్టేందుకు జియో ఈ నిర్ణయాన్ని తీసుకొనే దిశగా అడుగులు వేస్తోంది.

ఆరుమాసాల పాటు ఉచితంగా వాయిస్ కాల్స్, డేటాను ఉచితంగా ఇచ్చిన రిలయన్స్ జియో అదే తరహలో కొత్త ఆఫర్లను ప్రకటించాలని భావిస్తోంది.

రిలయన్స్ జియో తరహాలోనే ఇతర టెలికం కంపెనీలు కూడ ఆఫర్లతో ముందుకు రావడంతో జియో కూడ ప్రత్యర్థి కంపెనీల కంటే ఇతర ఆఫర్లతో ముందుకు వస్తోంది.

అయితే ప్రస్తుతం కొనసాగిస్తున్న ఆఫర్లను మరో ఏడాదిపాటు ఇవ్వాలని జియో భావిస్తోంది.ఇదే తరహలో ఆఫర్లను ప్రకటించడం వల్ల ఇతర టెలికం కంపెనీలపై ఒత్తిడి పెంచే అవకాశాలు ఉంటాయని జియో భావిస్తోంది.

మరో 18 నెలలపాటు ఆఫర్లను కొనసాగించనున్న జియో

మరో 18 నెలలపాటు ఆఫర్లను కొనసాగించనున్న జియో

ఉచిత ఆఫర్లతో మార్కెట్ లోకి ప్రవేశించిన రిలయన్స్ జియో ఇంకా కొత్త కొత్త ఆఫర్లను ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కొత్త కొత్త ఆఫర్లను మరో 18 మాసాలపాటు కొనసాగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కొత్త ఆఫర్లను ప్రకటించడం వల్ల ప్రత్యర్థి కంపెనీలపై తీవ్రమైన ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని ఆ కంపెనీ భావిస్తోంది.ఈ కారణంగానే ఆఫర్లను మరో ఏడాది లేదా 18 మాసాల పాటు కొనసాగించే అవకాశాలున్నాయి.

జియో వ్యూహాత్మక ఎత్తుగడ

జియో వ్యూహాత్మక ఎత్తుగడ

రిలయన్స్ జియో వ్యూహాత్మక ఎత్తుగడకు దిగింది. ప్రత్యర్థి టెలికం కంపెనీలను వ్యాపారపరంగా ఇబ్బంది పెట్టేందుకుగాను రిలయన్స్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆఫర్లను కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే రిలయన్స్ జియో కారణంగా ఇతర టెలికం కంపెనీలు కూడ ఆఫర్లతో హోరెత్తిస్తున్నాయి.

ఏడాది పాటు అన్ లిమిటెడ్ ప్లాన్స్ భరించడం కష్టమే

ఏడాది పాటు అన్ లిమిటెడ్ ప్లాన్స్ భరించడం కష్టమే

ఏదాదిపాటు అన్ లిమిటెడ్ ప్లాన్స్ ను భరించడం రిలయన్స్ జియో కాకుండా ఇతర టెలికం కంపెనీలకు కష్టమేనని మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నారు.ఈ కారణంగానే ఏడాది పొడవునా ఆఫర్లతో టెలికం కంపెనీలపై ఒత్తిడి పెంచాలనే వ్యూహాన్ని జియో అనుసరించనుంది.

ఒక్కో కస్టమర్ నుండి మూడు వందలే

ఒక్కో కస్టమర్ నుండి మూడు వందలే

అన్ లిమిటెడ్ ప్లాన్స్ ఆఫర్ ను ప్రకటించడం వల్ల టెలికం కంపెనీలకు పెద్దగా ఆదాయం దక్కడం లేదు. ఈ ప్లాన్స్ పై కేవలం ఒక్కో కస్టమర్ నుండి రూ.300 లే వస్తున్నాయని యూఎస్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ నివేదికలో వివరించింది.అయితే జియో ఆఫర్ల వల్ల ఒక్కో వినియోగదారుడి నుండి నెలకు వసూలు చేసే సగటు ఆదాయం భారీగా పడిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఇతర టెలికం కంపెనీల మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని మోర్గాన్ స్టాన్లీ ప్రకటించింది.

English summary
Reliance jio offers will continues for 18 months, it's market strategy purpose jio continues these offers said analysts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X