వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియోకు షాక్: 300 జీబీ 4జీ డేటా, ఉచిత కాల్స్ ఆఫరిచ్చిన ఎయిర్‌టెల్

జియోకు పోటీగా ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం కొత్త ప్లాన్‌ను ప్రకటించింది. ఏడాది కాలం పాటు ఈ ఆఫర్ వర్తించనుంది. అయితే రూ. 3,999తో రీఛార్జీ చేసుకోవాల్సి ఉంటుంది.ఈ ఆఫర్ కింద 300 జీబీ 4జీ డేటా

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబయి: జియోకు పోటీగా ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం కొత్త ప్లాన్‌ను ప్రకటించింది. ఏడాది కాలం పాటు ఈ ఆఫర్ వర్తించనుంది. అయితే రూ. 3,999తో రీఛార్జీ చేసుకోవాల్సి ఉంటుంది.ఈ ఆఫర్ కింద 300 జీబీ 4జీ డేటా ఇవ్వనున్నట్టు ఎయిర్‌టెల్ ప్రకటించింది. అంతేకాదు అపరిమిత వాయిస్‌కాల్స్‌ను వాడుకోవచ్చు.

జియో బంపర్ ఆఫర్: ఐఫోన్ 10ఎక్స్‌పై 70% క్యాష్‌బ్యాక్జియో బంపర్ ఆఫర్: ఐఫోన్ 10ఎక్స్‌పై 70% క్యాష్‌బ్యాక్

రిలయన్స్‌ జియో రాకతో టెలికాం సంస్థల మధ్య టారిఫ్‌ వార్‌ నడుస్తోంది.తమ కష్టమర్లను కాపాడుకొనేందుకు టెలికం సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్‌ వినియోగదారుల కోసం భారీ డేటా ప్లాన్‌‌ను ప్రకటించింది. 360రోజుల కాలపరిమితి కలిగిన ఈ ప్లాన్‌ కింద 300జీబీ 4జీ డేటా అపరిమిత ఉచిత వాయిస్‌కాల్స్‌ వాడుకొనే అవకాశం ఉంటుంది.

Reliance Jio Recharge Plans: Rs. 399, Rs. 309 V/s Airtel's Rs. 349 Offer

రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పంపుకోవచ్చు. రూ.3,999తో రీఛార్జ్‌ చేసుకోవడం ద్వారా ఈ ప్లాన్‌ను యాక్టివేట్‌ చేసుకోవచ్చు.
ఈ ప్లాన్‌ ప్రకారం వినియోగదారుడు నెలకు రూ.334 చెల్లించినట్లవుతుంది. డేటా విభజిస్తే నెలకు 25జీబీ 4జీ డేటా, అపరిమితకాల్స్‌ పొందే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం అన్ని టెలికం సంస్థలు నెలవారీ ప్యాకేజీని కాలపరిమితి 28రోజులు మాత్రమే ఇస్తున్నాయి. దీనితో పాటు రూ.349 ప్లాన్‌లో కూడా ఎయిర్‌టెల్‌ మార్పులు చేసింది. ఈ పథకం కింద రోజుకు 1.5జీబీ 4జీ డేటా 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత వాయిస్‌కాల్స్‌ అందిస్తోంది. దీని వ్యాలిడిటీ 28రోజులు మాత్రమే.

English summary
Reliance Jio, which has recently revamped its tariffs and data plans, offers attractive plans for customers. The aggressive tariffs from Jio have made the telecom sector fiercely competitive. Key industry players keep rolling out data offers to retain and woo customers. Global brokerage Credit Suisse said that the new tariffs of Jio are still 65 per cent lower than what an average smartphone customer was paying before its launch, reported news agency Press Trust of India. Incumbent telecom operators are thus leaving no stone unturned to retain and attract customers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X