వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: కొత్త ఆఫర్లతో జియో, 15 శాతం పెంచిన రూ.399 ప్లాన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Jio increases prices : Jio Rs. 459 Pack to Replace Rs. 399 Plan | Oneindia Telugu

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో మరో సారి మరిన్ని ఆఫర్లతో ముందుకు వచ్చింది.ధనా ధన్ ఆఫర్లతో మరోసారి జియో దీపావళి పండుగ సంబురాలను ముందుకు తీసుకు వచ్చింది. అయితే ధనా ధన్ ఆఫర్ అయినప్పటికీ పాత రేట్లను కొంత సవరించిందనే అభిప్రాయం కూడ లేకపోలేదు.

మార్కెట్లోకి రిలయన్స్ జియో ప్రవేశమే ఓ సంచలనంగా మారింది. ఉచిత వాయిస్ కాల్స్, ఉచిత డేటాలతో రిలయన్స్ జియో సంచలనాలు సృష్టించింది. అయితే ఏకంగా ఆరు మాసాలపాటు జియో ఉచిత ఆఫర్లను కొనసాగించింది.

ఆరు మాసాల తర్వాత జియో వినియోగదారుల నుండి డబ్బులు వసూలు చేస్తోంది. జియో మార్కెట్లోకి ప్రవేశించి ఇప్పటికే ఏడాది దాటింది. అయితే ఇంకా అనేక కొత్త టారిఫ్ ప్లాన్‌లను ప్రవేశపెడుతూ ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది జియో.కొత్త టారిఫ్ పాత, కొత్త వినియోగదారులందరికీ వర్తింపజేయనున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించింది.

జియో కొత్త ఆఫర్లు

జియో కొత్త ఆఫర్లు

రిలయన్స్ జియో మరోమారు ధన్ ధనా ధన్ ఆఫర్‌‌తో ముందుకొచ్చింది. పేరుకే ధన్ ధనా ధన్ అయినా పాత రేట్లనే సవరించినట్టు తెలుస్తోంది. దీపావళి పర్వదినం నుండి కొత్త టారిఫ్ అందుబాటులోకి రానుంది. ఈ ఆఫర్లను కొత్త, పాత 4జీ వినియోగదారులు అందరూ ఊపయోగించుకోవచ్చని తెలిపింది. ఫెయిర్ యూసేజ్ పాలసీ (ఎఫ్‌యూపీ) స్పీడ్స్ ప్రకారం హైస్పీడ్ డేటా, అపరిమిత లోకల్, ఎస్టీడీ, నేషనల్ రోమింగ్ కాల్స్ పొందవచ్చని కంపెనీ తెలిపింది.

రూ.149 ప్లాన్ 2 జీబీ డేటా ఫ్రీ

రూ.149 ప్లాన్ 2 జీబీ డేటా ఫ్రీ

ఎఫ్‌యూపీ ప్లాన్లలో రూ.149 ప్లాన్‌లో ప్రస్తుతం నెలకు 2జీబీ డేటా ఉచితంగా అందించనున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించింది. ఉచిత వాయిస్ కాల్స్ లభిస్తుండగా ఇక నుంచి 4జీబీ 4జీ డేటా లభించనుంది జియో ప్రకటించింది.

.హైస్పీడ్ డేటా కోసం రూ.509 ప్లాన్

.హైస్పీడ్ డేటా కోసం రూ.509 ప్లాన్

రూ.509 ప్లాన్‌తో రోజుకు 2జీబీ హైస్పీడ్ డేటాను 49 రోజుల కాలపరిమితితో ఉపయోగించుకోవచ్చని జియో ప్రకటించింది.ఉచిత వాయిస్ కాల్స్‌తో పాటు జియో యాప్స్‌ను వినియోగించుకోవచ్చు.ఇక నాన్ ఎఫ్‌యూపీ ప్లాన్లలో హై స్పీడ్ డేటాను ఇచ్చేలా జియో ప్లాన్ చేసింది. రూ.999 ప్లాన్‌లో వినియోగదారులు మూడు నెలలపాటు 60 జీబీ హైస్పీడ్ డేటాను పొందవచ్చు.రూ.1,999 ప్లాన్‌లో ఆరు నెలల పాటు 125 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది.రూ.4,999 ప్లాన్‌లో ఏడాదిపాటు 350జీబీ హైస్పీడ్ డేటాను అందుకోవచ్చు.

5.వారానికి రూ. 52 ప్లాన్లు

5.వారానికి రూ. 52 ప్లాన్లు

డైలీ, వీక్లీ ప్లాన్లను కూడ జియో ప్రకటించింది. ఈ ప్లాన్లలో భాగంగా యూజర్లు ఉచిత కాల్స్, ఎస్ఎంఎస్, రోజుకు 0.15 జీబీ డేటాను పొందవచ్చు. రోజుకు రూ.19 చెల్లించాలి. ఇక వారానికి రూ.52 రూపాయాల ప్లాన్ కూడ ప్రకటించింది. ఇక రెండు వారాలకు రూ.98లను చెల్లించి జియో ప్లాన్లను పొందవచ్చని రిలయన్స్ ప్రకటించింది.

English summary
Reliance Jio, the latest entrant in India's telecom sector has increased the rate of its popular 84-day Rs. 399 Dhan Dhana Dhan plan to Rs. 459 from Thursday, under which subscribers get 1GB 4G data per day, according to information published on the company's website. The Mukesh Ambani-led company however said that subscribers of its Rs. 149 plan will get double the amount of high speed data 4 GB of data for each billing cycle of 28 days under the new scheme "Diwali Dhamaka" compared to 2GB being offered at present.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X