• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జియోనా మజాకా? 150 ఎంబీపీఎస్ స్పీడ్‌తో... 32 మందికి ఒకేసారి వైఫై! రూ.999కే డివైజ్!

By Ramesh Babu
|

ముంబై: టెలికాం రంగంలో రిలయన్స్ జియో సంచలనమే సృష్టించింది. జియో రాకతో ఈ రంగంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజువారీ డేటా ఇప్పుడు ప్రతి టెలికాం కంపెనీ ఆఫర్ చేస్తోందంటే అందుకు జియో ఆరంగేట్రమే కారణం.

ఇక బ్రాండ్‌బ్యాండ్‌ రంగంలోనూ జియోఫై డివైజ‌‌్‌ను విడుదల చేసి అధిక వేగంతో డేటాను అందించేందుకు జియో యత్నిస్తోంది. తాజాగా 'జియోఫై జేఎంఆర్‌ 815' 4జీ ఎల్‌టీఈ హాట్‌స్పాట్‌ డివైజ్‌ను విడుదల చేసింది. ఇక గత ఏడాది విడుదల చేసిన జియోఫై డివై‌జ్‌తో పోలిస్తే ఈ మోడల్‌లో చాలా మార్పులను తీసుకొచ్చింది.

డౌన్‌లోడ్ స్పీడ్ 150 ఎంబీపీఎస్...

డౌన్‌లోడ్ స్పీడ్ 150 ఎంబీపీఎస్...

రిలయన్స్ జియో కొత్త వైఫై డివైజ్ అత్యధిక వేగంతో డేటా డౌన్లోడ్‌కు అవకాశం కల్పిస్తుంది. ఈ వైఫై డివైజ్ ద్వారా 150 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో డేటా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అప్‌లోడ్‌ 50 ఎంబీపీఎస్‌ వరకూ ఉంటుంది. దీని ధర రూ.999. మేకిన్ ఇండియాలో భాగంగా ఈ డివైస్‌ను భారత్‌లోనే తయారు చేయడం మరో విశేషం.

ఒక్క ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే...

ఒక్క ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే...

జియో విడుదల చేసిన కొత్త జియోఫై డివైజ్ రిలయన్స్‌కు చెందిన డిజిటల్‌ స్టోర్స్‌లో గానీ, జియో ఈ స్టోర్‌లో గానీ అందుబాటులో లేదు. ఇది కేవలం

ప్రముఖ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌లోనే అందుబాటులో ఉంది. దీన్ని బట్టి ఫ్లిప్‌కార్ట్‌ మాత్రమే ఈ జియోఫై డివైజ్‌ను విక్రయిస్తోందని అర్థమవుతోంది.

కొనుగోలుదారులకు బోలెడు ఆఫర్లు...

కొనుగోలుదారులకు బోలెడు ఆఫర్లు...

రిలయన్స్ జియో తన కొత్త జియోఫై డివైజ్‌ను కొనేవారికి దాంతోపాటు అనేక ఆఫర్లను సైతం అందిస్తోంది. యాక్సిస్‌ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ డివైజ్ కొనుగోలు చేసే వారికి 5 శాతం డిస్కౌంట్‌ లభించనుంది. 10 రోజుల రీప్లేస్‌మెంట్‌ పాలసీతో పాటు ఏడాది వారెంటీని కూడా జియో అందిస్తోంది.

ఒకేసారి 32 మందికి వైఫై...

ఒకేసారి 32 మందికి వైఫై...

కొత్తగా విడుదలైన జియోఫై డివైజ్‌ ద్వారా ఒకేసారి దాదాపు 32 మంది వైఫైకి కనెక్ట్‌ కావొచ్చు. వీరందరూ తమ స్మార్ట్‌ఫోన్లలోని జియో 4జీ వాయిస్‌ యాప్‌ ద్వారా హెచ్‌డీ వీడియో, వాయిస్‌ కాల్స్‌ కూడా చేసుకోవచ్చు. ఇందులోని మెమెరీ కార్డు స్లాట్‌ను ఉపయోగించి స్టోరేజి సామర్థ్యాన్ని 64జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇంకా ఇందులో 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీని పొందుపర్చారు. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే దాదాపు 3.5 గంటల పాటు జియోఫై డివైజ్ పనిచేస్తుంది.

English summary
Reliance Jio has expanded its lineup of products with the launch of the updated version of JioFi. This time, Jio is choosing a puck-shaped design for the device that supports download speeds up to 150Mbps and uploads at the maximum rate of 50Mbps. The device is half the price of the last year’s version and is priced at ₹999. The Wi-Fi puck features physical buttons to turn it on or off as well to switch on WPS. It also features LED notification lights to inform you about the strength of the 4G signal and the battery status. The updated JioFi allows up to 32 users to connect to the device including one on via USB. Once connected to the Wifi, users can also make VoLTE calls even on smartphones that don’t support HD calls – the feature, however, was also available on the previous generation. The updated JioFi features a bigger battery compared to the previous version, rated at 3,000mAh against 2,300mAh in JioFi 2. The battery is claimed to last up to 8 hours of internet usage but may vary with the signal reception. The external storage has been bumped up and JioFi now supports microSD cards up to 64GB and you can wirelessly transmit data to users using the wireless connection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X