వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంపర్ ఆఫర్: 168 జీబీ ప్రకటించిన జియో, వివో జియో ఆఫర్ ఇలా...

రిలయన్స్ జియో మరో ఆఫర్ తో మార్కెట్లోకి వచ్చింది.ప్రత్యేక ఆఫర్లతో ఇతర టెలికం కంపెనీలకు చుక్కలు చూపిస్తున్న జియో మరో ఆఫర్ ను ప్రకటించింది. వివో స్మార్ట్ ఫోన్ యూజర్లకు 168 జీబీ వరకు 4జీ డేటాను ఇవ్వనున్నట

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: రిలయన్స్ జియో మరో ఆఫర్ తో మార్కెట్లోకి వచ్చింది.ప్రత్యేక ఆఫర్లతో ఇతర టెలికం కంపెనీలకు చుక్కలు చూపిస్తున్న జియో మరో ఆఫర్ ను ప్రకటించింది. వివో స్మార్ట్ ఫోన్ యూజర్లకు 168 జీబీ వరకు 4జీ డేటాను ఇవ్వనున్నట్టు జియో ప్రకటించింది.

ఉచిత ఆఫర్లతో ఇతర టెలికం కంపెనీలకు కంటి మీద కునుకు లేకుండా జీయో చేసింది. రిలయన్స్ దెబ్బకు టెలికం కంపెనీల ఆదాయం భారీగా పడిపోయింది.

మరో వైపు టెలికం కంపెనీల ఆదాయం తగ్గిపోవడమేకాదు, తమ టారిఫ్ ప్లాన్లలో కూడ భారీ మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన పరిస్థితులు టెలికం కంపెనీలపై నెలకొంది.

అంతేకాదు సమ్మర్ ప్యాకేజీ ఆఫర్ పై ట్రాయ్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ధనాధన్ ఆఫర్ ను రిలయన్స్ జియో ప్రకటించింది. ఈ ఆఫర్ ను ప్రకటించిన రెండు రోజులకే మరో కొత్త ఆఫర్ తో జియో ముందుకు వచ్చింది.

వివో జియో క్రికెట్ మానియా ఆఫర్

వివో జియో క్రికెట్ మానియా ఆఫర్

వివో జియో క్రికెట్ మానియా ఆఫర్ ను ప్రకటించింది జియో. ఈ ఆఫర్ కింద 168 జీబీ వరకు 4జీ డేటాను ఇవ్వనున్నట్టు జియో ప్రకటించింది. వివో స్మార్ట్ ఫోన్ యూజర్లు తమ ఫేవరేట్ ఐపీఎల్ టీమ్ ను ఎంపిక చేసుకోవాలి. ఐపిఎల్ టీమ్ పేరును జియో పేరును కంపెనీకి ఎస్ఎంఎస్ చేయాలి.యూజర్ల ఫేవరేట్ టీమ్ గెలిచినా, ఓడినా లేదా మ్యాచ్ డ్రా అయినా జియో వారికి 4జీబీ డేటాను అందిస్తోంది.

మే 10వ, తేదిలోపుగా ధరఖాస్తు చేయాలి

మే 10వ, తేదిలోపుగా ధరఖాస్తు చేయాలి

ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవడానికి వివో స్మార్ట్ ఫోన్ యూజర్లు మే 10వ, తేది కంటే ముందుగానే తమ ఫేవరేట్ ఐపీఎల్ టీమ్ పేరును జియోకు పంపించాల్సి ఉంటుంది. వచ్చే పది రీచార్జీలలో అంటే జూన్ 1వ, తేది నుండి 2018 మార్చి 31 వరకు చేసుకొనే రీ చార్జీలలో కూడ యూజర్లు తమ అకౌంట్ పై అదనపు డేటా ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.అయితే ఈ డేటా బెనిఫిట్స్ ను వాడుకోవడానికి ఖచ్చితంగా ప్రతి నెల రూ.303 రీచార్జీ చేసుకోవాలి.

.168 జీబీ కంప్లిమెంటరీ డేటా ఎలా పొందాలి?

.168 జీబీ కంప్లిమెంటరీ డేటా ఎలా పొందాలి?

వివో స్మార్ట్ ఫోన్ యూజర్లకు జియో కనెక్షన్ ఉండాలి. ఐపీఎల్ టీమ్ పేరును 59009 నెంబర్ కు జియో వెబ్ సైట్ లో ఇచ్చిన ఫార్మాట్ ప్రకారంగా ఎస్ ఎం ఎస్ చేయాల్సి. టీమ్ పేర్లను వాటి కోడ్స్ ను జియో తన వెబ్ సైట్ లో పొందుపర్చింది.

మ్యాచ్ గెలిచినా ఓడినా 4 జీబీ డేటా

మ్యాచ్ గెలిచినా ఓడినా 4 జీబీ డేటా

యూజర్లు తాము ఎంపిక చేసుకొన్న ఐపిఎల్ టీమ్ గెలిచినా, ఒడినా మ్యాచ్ డ్రా అయినా 3 జీబీ, 2 జీబీ, 4 జీబీ డేలాను జియో అందిస్తోంది. ఒక వేళ యూజర్ల ఫేవరేట్ టీమ్ క్వాలిఫైర్ గా వెళ్తే వారి కంప్లిమెంటరీ డేటా డబుల్ అవుతోంది. ఫైనల్స్ కు రీచ్ అయితే ఆ డేటా ట్రిపుల్ అవుతోంది. సిరిస్ ముగిసే సమయానికి మీ టీమ్ అన్ని మ్యాచ్ లు గెలిస్తే 168 జీబీ వరకు 4 జీబీ డేటాను విన్ అయ్యే అవకాశం ఉంది.

English summary
Reliance Jio has unveiled a new offer for Vivo smartphone users, which gives them a chance to win up to 168GB Jio 4G data. The ‘Vivo Jio Cricket Mania’ offer requires users to start with sending a message with the name of their favourite IPL team.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X