వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియో మరో సంచలన ఆఫర్: రూ.500లకే 600జీబీ బ్రాడ్ బాండ్

రిలయన్స్ జియో బ్రాడ్ బాండ్ ద్వారా.. కేవలం రూ.500లకే 600జీబీ డేటాతో ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించే దిశగా రిలయన్స్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

ముంబై : జియో ఎంట్రీ ద్వారా ఇప్పటికే టెలికాం రంగం కంపెనీలకు చుక్కలు చూపించిన రిలయన్స్.. త్వరలో మరన్ని సంచలనాత్మక నిర్ణయాలతో మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. రిలయన్స్ జియోను కేవలం టెలికాంకే పరిమితం చేయకుండా.. ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్, డీటీహెచ్ రంగాలకు సైతం విస్తరించాలనే ప్లాన్ లో ఉన్నారు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ.

ఈ నేపథ్యంలోనే.. ముఖేష్ అంబానీ ఇప్పుడో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నట్టుగా ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. ఇండియాలో ఇంటర్నెట్ ను అతి చౌకగాను, 'ది బెస్ట్' గాను అందించేందుకు కసరత్తులు చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇందులో భాగంగానే.. త్వరలోనే రిలయన్స్ జియో బ్రాడ్ బాండ్ సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది.

Reliance Jio To Start Broadband Service, Will Offer 600 GB Free Internet At Just Rs 500!

రిలయన్స్ జియో బ్రాడ్ బాండ్ ద్వారా.. కేవలం రూ.500లకే 600జీబీ డేటాతో ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించే దిశగా రిలయన్స్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే గనుక జరిగితే.. ఇంటర్నెట్ రంగంలో మరో విప్లవాత్మక మార్పుకు రిలయన్స్ శ్రీకారం చుట్టినట్టే. రూ.500లకే అందించబోయే ఈ ఇంటర్నెట్ ప్యాక్.. స్పీడ్ లోను మెరుగైన క్వాలిటీతో (120ఎంబీపీఎస్ నుంచి 1జీబీ) సేవలు అందించనున్నట్టు సమాచారం.

ఇక మొన్నీమధ్యే.. తెరపైకి వచ్చిన రిలయన్స్ జియో డీటిహెచ్ ఇంకా కార్యరూపం దాల్చని సంగతి తెలిసిందే. రిలయన్స్ జియో ద్వారా రూ.185 లకే డీటీహెచ్ సేవలను రిలయన్స్ అందించబోతున్నట్టుగా కథనాలు వచ్చాయి. అలాగే ఇప్పుడు రిలయన్స్ జియో బ్రాడ్ బాండ్..! చూడాలి మరి.. రిలయన్స్ జియో బ్రాడ్ బాండ్ మార్కెట్లోకి ఎప్పుడు అడుగుపెడుతుందో!

English summary
So, Reliance is up for a new venture. The company said that it will soon scope the space of broadband services and offer free internet of 600 GB at just Rs 500!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X