వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: పెరగనున్న ఫోన్ బిల్లులు, జియో ఎఫెక్టే కారణమా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో టారిఫ్ ధరలను పెంచడంతో ఇతర టెలికం కంపెనీలు కూడ తమ టారిఫ్ ధరలను మార్చే అవకాశం ఉంది. జియో తాజాగా ప్రకటించిన ప్లాన్లలో ఒకేసారి 15 నుండి 20 శాతం ధరలు పెంచడం జియో కష్టమర్లకు షాకిస్తోంది.

ఉచిత ఆఫర్లతో మార్కెట్లోకి ప్రవేశించిన రిలయన్స్ జియో ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలు చూపించింది. ఇతర టెలికం కంపెనీల కష్టమర్లు జియో వైపు మొగ్గుచూపారు.అయితే ఈ అవకాశాన్ని ఆసరాగా తీసుకొని ఆరు మాసాల పాటు ఉచిత సేవలను రిలయన్స్ జియో కొనసాగించింది.

అయితే ఉచిత సేవల కారణంగా జియో అనుహ్యంగా తన కష్టమర్లను పెంచుకొంది.ప్రత్యర్థి కంపెనీలకు దెబ్బకొట్టడమే కాకుండా తన కష్టమర్లను పెంచుకొనేందుకు జియోకు ఇది మంచి అవకాశంగా దొరికింది.

జియో ఇస్తున్న ఉచిత సేవలపై ప్రత్యర్థి కంపెనీలు ట్రాయ్‌ను కూడ ఆశ్రయించాయి. ఇదిలా ఉంటే పలు ఆఫర్లతో జియో ప్రత్యర్థి కంపెనీలపై పై చేయి సాధిస్తోంది.

టారిఫ్ ధరలను పెంచనున్న టెలికం కంపెనీలు

టారిఫ్ ధరలను పెంచనున్న టెలికం కంపెనీలు

జియో తన టారిఫ్ ప్లాన్లను పెంచడంతో టెలికం కంపెనీలు కూడ తమ టారిఫ్ ప్లాన్లలో మార్పులు చేసే అవకాశం లేకపోలేదు.భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా వంటి టెలికాం సంస్థలు తమ ప్లాన్ల ధరలను పెంచాలన్న యోచనలో ఉన్నట్టు పరిశ్రమవర్గాల ద్వారా తెలుస్తోంది. ధరల పెరుగుదల టెలికాం కంపెనీలకు సానుకూలమైన అంశమని స్విస్‌ బ్రోకరేజ్‌ సంస్థ యుబిఎస్‌ అంటోంది.

జియో నష్టం రూ.270.59 కోట్లు

జియో నష్టం రూ.270.59 కోట్లు

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జియో 6,147 కోట్ల రూపాయల రాబడిపై 270.59 కోట్ల రూపాయల నష్టాన్ని ప్రకటించింది. ఈ ఫలితాలు విశ్లేషకుల అంచనాలకన్నా భిన్నంగా ఉండటం విశేషం. పెద్ద ఎత్తున కస్టమర్లను సంపాదించుకోవడం వల్ల కంపెనీకి బాగా కలిసి వచ్చింది. వ్యయాలను సమర్థవంతంగా నిర్వహించుకోవడంలో జియో మంచి రాబడులను నమోదు చేసింది. రానున్న కాలంలో కస్టమర్ల నుంచి వచ్చే రాబడి మరింతగా పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది.

 4.2 కోట్ల మంది కష్టమర్ల టార్గెట్

4.2 కోట్ల మంది కష్టమర్ల టార్గెట్


గత సెప్టెంబర్‌ చివరినాటికి జియో కస్టమర్ల సంస్థ 13.9 కోట్ల స్థాయిలో ఉంది. స్మార్ట్‌ఫోన్లు, జియో ఫోన్‌ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4.2 కోట్ల మంది కొత్త కస్టమర్లను ఈ కంపెనీ సంపాదించుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీని వల్ల వచ్చే మార్చినాటికి కంపెనీ మొత్తం కస్టమర్ల సంఖ్య 18.1 కోట్లకు చేరుకోవచ్చు.

లాభాలను పంచేలా జియో వ్యూహం

లాభాలను పంచేలా జియో వ్యూహం

2019 మార్చినాటికి 20.5 కోట్ల కస్టమర్లను సంపాదించుకోవాలన్న యోచనలో జియో ఉంది. ఇదే సమయంలో కస్టమర్ల నుంచి వచ్చే రాబడిని పెంచుకుని ఇన్వెస్టర్లకు మంచి లాభాలను పంచాలనుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ప్లాన్ల ధరలను పెంచడంపై దృష్టిసారిస్తోంది

English summary
Reliance Jio Infocomm’s decision to raise effective prices of most 4G tariff plans by 15-20% from October 19 will allow incumbents Bharti Airtel, Vodafone India and Idea Cellular to consider price hikes after several quarters of chasing the newcomer’s disruptive rates, analysts say.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X