వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ లో.. ఇప్పటికీ ‘జియో’నే టాప్: ట్రాయ్

కేవలం ఆఫర్లలోనే కాదు, మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ విషయంలో కూడా దేశంలోనే బెస్ట్ 4జీ నెట్ వర్క్ గా రిలయన్స్ జియో నిలిచింది. ఇప్పటికీ ఇతర టెలికాం సంస్థల కన్నా అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ ను ఇవ్వడంలో జియోనే

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబై: గతేడాది మార్కెట్ లోకి ప్రవేశించిన రిలయన్స్ జియో.. వెల్ కమ్ ఆఫర్, హ్యాపీ న్యూ ఇయర్, ధన్ ధనా ధన్ ఆఫర్.. ఇలా రకరకాల ఆఫర్లు ప్రవేశపెట్టి కోట్ల సంఖ్యలో ఖాతాదారులను సమకూర్చుకుంది.

కేవలం ఆఫర్లలోనే కాదు, మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ విషయంలో కూడా దేశంలోనే బెస్ట్ 4జీ నెట్ వర్క్ గా నిలిచింది. ఇప్పటికీ ఇతర టెలికాం సంస్థల కన్నా అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ ను ఇవ్వడంలో జియోనే టాప్ పొజిషన్ లో కొనసాగుతోంది.

Reliance Jio was fastest 4G network in India in April, reveals TRAI data

టెలికాం రెగ్యులేటరీ ఆధారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) లెక్కల ప్రకారం ఏప్రిల్ నెలలో దేశంలో ఉన్న అన్ని మొబైల్ నెట్ వర్క్ లలో జియో 4జీ ఇంటర్నెట్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఏప్రిల్‌లో జియో ద్వారా యూజ‌ర్లు గ‌రిష్టంగా 19.123 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్‌ను పొందార‌ని ట్రాయ్ తెలిపింది.

ఇక ఆ త‌రువాతి స్థానాల్లో వ‌రుస‌గా వొడాఫోన్ (13.387 ఎంబీపీఎస్‌), ఐడియా (13.709 ఎంబీపీఎస్‌), ఎయిర్‌టెల్ (10.153 ఎంబీపీఎస్‌)లు నిలిచాయి. ఫిబ్ర‌వ‌రిలో జియో ద్వారా యూజ‌ర్లకు అందిన 4జీ మొబైల్ ఇంట‌ర్నెట్ స్పీడ్ 16.487 గా ఉండ‌గా, మార్చిలో అది పెరిగి 18.487 ఎంబీపీఎస్‌కు చేరుకుంద‌ని, ఏప్రిల్ లో స‌గ‌టు స్పీడ్ 19.123 ఎంబీపీఎస్‌గా న‌మోదైంద‌ని జియో తెలియ‌జేసింది.

నెల నెలా జియో మొబైల్ ఇంట‌ర్నెట్ స్పీడ్ పెరుగుద‌ల‌ను న‌మోదు చేసుకుంటుంద‌ని ట్రాయ్ చెప్పింది. ఈ వివ‌రాల‌ను ట్రాయ్ గ‌తంలో విడుద‌ల చేసిన మై స్పీడ్ యాప్ ద్వారా సేక‌రించడం గ‌మ‌నార్హం.

English summary
New entrant Reliance Jio has surpassed other telecom companies to become the fastest 4G network in India. As per the TRAI report, Jio topped the chart in 4G network speed for the month of April. The network recorded an all-time high download speed of 19.12 megabit per second. This speed came in the month that saw Jio ending the free services for users who did not subscribe to any of its plans. The fall in number of active users could be one of the reasons why the Jio 4G showed speed faster speeds.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X