వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియో ఎఫెక్ట్: ట్విట్టర్‌లో పేలిన జోకులు, మూటముల్లే సర్దుకోవాల్సిందేనా?

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కొత్త ఫీచర్ ఫోన్‌ ప్రకటన చేయగానే ట్విట్టర్ కూడ ఈ వేడుకల్లో పాల్గొంది. ప్రత్యర్థి కంపెనీలపై ట్విట్టర్‌లో నెటిజన్లు జోకులు పేల్చారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కొత్త ఫీచర్ ఫోన్‌ ప్రకటన చేయగానే ట్విట్టర్ కూడ ఈ వేడుకల్లో పాల్గొంది. ప్రత్యర్థి కంపెనీలపై ట్విట్టర్‌లో నెటిజన్లు జోకులు పేల్చారు.

జియో ఫోన్ ఎఫెక్ట్: ఈ రంగాలపై పడుతుందా?జియో ఫోన్ ఎఫెక్ట్: ఈ రంగాలపై పడుతుందా?

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ జియో ఫీచర్‌ను లాంఛ్ చేయనున్నట్టు శుక్రవారంనాడు ప్రకటించారు. ఆగష్టు 15వ, తేది నుండి ఈ ఫోన్ టెస్టింగ్‌కు అందుబాటులోకి రానుందని ఆయన ప్రకటించారు.

Reliance JioPhone at Rs 0: Twitter rejoices launch of 4G-enabled handset

అంతేకాదు ఈ ఫోన్‌ను ఉచితంగా అందించనున్నట్టు అంబానీ ప్రకటించారు. ఈ పోన్ కొనుగోలు చేయాలనుకొనేవారు వన్ టైమ్ సెక్యూరిటీ కింద రూ.1500 చెల్లిస్తే సరిపోతోంది. మూడు సంవత్సరాల తర్వాత ఈ డబ్బులను జియో తిరిగి చెల్లించనుంది.

ముఖేష్ అంబానీ ఈ ప్రకటన చేయగానే ట్విట్టర్‌లో కూడ ట్వీట్లు వెల్లువెత్తాయి. అంబానీని ప్రశంసలతో ముంచెత్తారు. ఓ రకంగా ట్విట్టర్ కూడ ఈ వేడుకల్లో పాల్గొందని అనుకోవచ్చు అంతేకాదు జియో దెబ్బకు ప్రత్యర్థి కంపెనీలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నాయోననే విషయాలపై నెటిజన్లు జోకులు పేల్చారు.

జియో ఎఫెక్ట్‌తో రీచార్జీ చేసుకోనే విషయాలను మర్చిపోయారని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఇతర టెలికం కంపెనీలను ఒఎల్ఎక్స్‌లో అమ్మకానికి పెట్టాలంటూ ట్విట్టర్ యూజర్లు చలోక్తులను విసిరారు. చైనా కంపెనీలు కూడ మూట ముల్లే సర్ధుకొని తమ దేశానికి వెళ్ళిపోవాలని నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలను సంధించారు.

English summary
Mukesh Ambani-led Reliance Industries Ltd announced the launch of 'effective smartphone' JioPhone, Twitterati got engaged in celebrating the launch. Few users congratulated Ambani for the move. The announcement was trending on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X