వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిలయన్స్ ఫీచర్‌ఫోన్‌లో ఒకే సిమ్, ఇతర సిమ్‌లు పనిచేయవు

రిలయన్స్ పీచర్ ఫోన్ సింగిల్‌సిమ్‌ మాత్రమే ఉంటుందని ఆ సంస్థ ప్రకటించింది.ఈ ఫోన్‌ గురించి ఇప్పటికే అనేక ప్రత్యేకతలు ఉన్న విషయాన్ని ఆ సంస్థ ప్రకటించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: రిలయన్స్ పీచర్ ఫోన్ సింగిల్‌సిమ్‌ మాత్రమే ఉంటుందని ఆ సంస్థ ప్రకటించింది.ఈ ఫోన్‌ గురించి ఇప్పటికే అనేక ప్రత్యేకతలు ఉన్న విషయాన్ని ఆ సంస్థ ప్రకటించింది. అయితే ఎన్ని సిమ్‌కార్డులతో ఈ ఫోన్‌ను ఉపయోగించుకోవచ్చనే విషయమై స్పష్టత రాలేదు. ఒకే సిమ్‌కార్డుతో ఈ ఫోన్ ఉపయోగించుకొనేలా తయారుచేస్తున్నట్టు ఆ సంస్థ ప్రతినిధి ఒకరు ప్రకటించారు.

శుభవార్త: ఆగష్టు 24 నుండి రిలయన్స్ ఫీచర్‌ఫోన్ బుకింగ్ , ఎలాగంటే?శుభవార్త: ఆగష్టు 24 నుండి రిలయన్స్ ఫీచర్‌ఫోన్ బుకింగ్ , ఎలాగంటే?

ఈ ఏడాది సెప్టెంబర్‌ నుండి రిలయన్స్ పీచర్ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ ఫోన్‌కు తొలుత సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.1500 చెల్లిస్తే ఫోన్‌ను ఇవ్వనున్నారు. అయితే మూడేళ్ళ తర్వాత ఈ సెక్యూరిటీ డిపాజిట్‌ను తిరిగి ఇచ్చివేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది.

అయితే ఈ ఫోన్‌లో అనేక ప్రత్యేకతలున్నాయని ముఖేష్ అంబానీ ఇటీవలే ప్రకటించారు. అయితే ఫోన్‌లో ఎన్ని సిమ్‌కార్డులతో వాడుకోవచ్చనే అంశంపై స్పష్టత ఎట్టకేలకు వచ్చింది.

ఒకే సిమ్‌కార్డ్‌తో ఫీచర్ పోన్

ఒకే సిమ్‌కార్డ్‌తో ఫీచర్ పోన్

రిలయన్స్ ఫీచర్‌ ఫోన్‌లో ఒకే సిమ్ కార్డు పనిచేస్తోందని ఆ కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. అయితే ఈ ఫోన్‌ వోల్టే టెక్నాలజీ పనిచేయనుంది. అయితే ఎయిర్‌టెల్, బిఎస్ఎన్ఎల్, ఐడియా, వోడాఫోన్ లాంటి సిమ్‌కార్డులు ఈ ఫోన్‌లో పనిచేసే అవకాశాలు లేవని ఆ కంపెనీ పనిచేస్తాయి. అయితే ఇదే తరహ సర్వీస్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్టు ఎయిర్‌టెల్ కూడ ప్రకటించింది.

Recommended Video

Reliance Jio New Phone features and booking details
ఉచిత ఫోన్‌పై మెలిక పెట్టిన రిలయన్స్

ఉచిత ఫోన్‌పై మెలిక పెట్టిన రిలయన్స్

ఉచిత ఫోన్‌పై రిలయన్స్ మెలికపెట్టింది. రూ.1500 డిపాజిట్ చేసి, రిలయన్స్ ఫీచర్ పోన్ స్వంతం చేసుకొంటే మూడేళ్ళ తర్వాత ఆ సెక్యూరిటీ డిపాజిట్‌ను తిరిగి చెల్లిస్తామని ఆ కంపెనీ ప్రకటించింది.అయితే ప్రతినెలా రిలయన్స్ జియో రీచార్జీ చేసుకొంటే పూర్తి మొత్తాన్ని మూడేళ్ళ తర్వాత వెనక్కు చెల్లించేందుకు ఆ కంపెనీ ప్లాన్ ఉందని ఓ రిపోర్ట్ వెల్లడిస్తోంది. అయితే మధ్యలో రీఛార్జీ చేసుకోకపోతే పూర్తి మొత్తాన్ని చెల్లించే అవకాశాలు లేవని ఆ రిపోర్ట్ చెబుతోంది.

ట్విస్ట్: రిలయన్స్ ఫోన్‌తో టెలికం పరిశ్రమకు ఆదాయం, ఎలాగంటే?ట్విస్ట్: రిలయన్స్ ఫోన్‌తో టెలికం పరిశ్రమకు ఆదాయం, ఎలాగంటే?

కేబుల్ ప్రసారాలు సక్సెస్ కావు

కేబుల్ ప్రసారాలు సక్సెస్ కావు

ఈ ఫోన్‌తో పాటే కేబుల్ ప్రసారాలను టీవీలో చేసే కేబుల్ కూడ అందిస్తామని రిలయన్స్ వెల్లడించింది. అయితే ఇప్పటికే మార్కెట్లో ఉన్న డిటిహెచ్ సంస్థలు మాత్రం ఏ మాత్రం ఆందోళన చెందడం లేదు. ఫోన్ కేబుల్‌తో పాటు టీవి అనుసంధానమై ఉన్నప్పుడు మాత్రమే టీవీలో ప్రసారాలను చూసే వీలుంటుంది. ఫోన్‌ను బయటకు తీసుకెళితే టీవీలో ప్రసారాలు చూసే వీలుండదు. ఫోన్ కేబుల్ సక్సెస్ కాదనే అభిప్రాయంతో డీటీహెచ్ సంస్థలున్నాయి.

రూ.309 తో కేబుల్ టీవీ ప్రసారాలు

రూ.309 తో కేబుల్ టీవీ ప్రసారాలు

రిలయన్స్ జియో కేబుల్ టీవి యాక్ససరీస్‌ను టివికి కనెక్ట్ చేసుకొంటే కేబుల్ ప్రసారాలను జియో ఫోన్‌లోని సినిమా యాప్ ద్వారా చూసే వెసులుబాటు ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పోన్‌కు టీవికి అనుసంధానం చేసే టీవి యాక్ససరీస్‌ను రూ.309 విక్రయించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

English summary
Reliance JioPhone is not a dual-SIM feature phone but a single-SIM device, now Jio is sticking with the single-SIM variant. Another report on The Mobile Indian had said that a JioPhone with dual-SIM capabilities will be launched in October.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X