వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియో 4జీ ఫీచ‌ర్‌ ఫోన్‌.. పూర్తి కాన్ఫిగ‌రేష‌న్, ఫీచర్లివే..!

జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్ అన్నీ సంచ‌ల‌నాల‌నే సృష్టిస్తోంది. ఈ ఫోన్ బుకింగ్స్ కూడా మొదలైన నేప‌థ్యంలో జియో 4జీ ఫీచర్ ఫోన్ కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ను రిలయన్స్ జియో వెల్లడించింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబై: రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ చైర్మ‌న్ ముఖేష్ అంబానీ ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్ అన్నీ సంచ‌ల‌నాల‌నే సృష్టిస్తోంది. తాజాగా ఈ ఫోన్ ప్రీ బుకింగ్స్ కూడా పెద్ద ఎత్తున జ‌రిగాయి.

జియో ఫోన్ కోసం యూజ‌ర్లు భారీ సంఖ్య‌లో బుకింగ్స్ చేసుకున్నారు. అయితే జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్ సంచలనం ఏమోగానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఫోన్‌కు చెందిన ఫీచ‌ర్లు పూర్తిగా ఎవ‌రికీ తెలియ‌లేదు. ఈ క్ర‌మంలో తాజాగా ఈ ఫోన్ బుకింగ్స్ కూడా మొదలైన నేప‌థ్యంలో జియో 4జీ ఫీచర్ ఫోన్ కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ను రిలయన్స్ జియో వెల్లడించింది.

జియో ఫోన్ పై అన్నీ సందేహాలే...!

జియో ఫోన్ పై అన్నీ సందేహాలే...!

జియో ఫోన్ లో వైఫై ఉంటుందా? వాట్సాప్ ఉండ‌దా? ఫేస్‌బుక్‌, యూట్యూబ్ బ్రౌజ్ చేసుకోవ‌చ్చా? ఇలా జియో ఫోన్ గురించి ఎంతో మందికి ఎన్నో సందేహాలు ఉన్నాయి. అందులో వాట్సప్ యాప్ ఉండదంటూ వదంతులు కూడా వచ్చాయి. ఈ క్ర‌మంలో తాజాగా ఈ ఫోన్ బుకింగ్స్ కూడా మొదలైన నేప‌థ్యంలో జియో 4జీ ఫీచర్ ఫోన్ కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ను రిలయన్స్ జియో వెల్లడించింది.

2.4 అంగుళాల తెర.. ఇంకా..

2.4 అంగుళాల తెర.. ఇంకా..

జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్ 2.4 అంగుళాల తెరను క‌లిగి ఉంటుంది. దీని రిజ‌ల్యూష‌న్ 320 x 240 పిక్స‌ల్స్‌గా ఉంది. ప్రాసెస‌ర్ విష‌యానికి వ‌స్తే.. ఈ ఫోన్‌లో స్ప్రెడ్‌ట్ర‌మ్ లేదా క్వాల్‌కామ్ కంపెనీకి చెందిన ప్రాసెస‌ర్ ఉండే అవకాశముంది. స్ప్రెడ్‌ట్ర‌మ్ అయితే 1.2 గిగాహెర్ట్జ్ సామ‌ర్థ్యం ఉన్న డ్యుయ‌ల్ కోర్ స్ప్రెడ్‌ట్ర‌మ్ ఎస్‌పీ9820ఎ ప్రాసెస‌ర్ ఉంటుంది. అదే క్వాల్‌కామ్ అయితే 1.1 గిగాహెర్ట్జ్ డ్యుయ‌ల్ కోర్ క్వాల్‌కామ్ 205 ప్రాసెస‌ర్ ఉంటుంది. మొత్తానికి జియో ఫోన్‌లో ఈ రెండింటిలో ఏదైనా ఒక ప్రాసెస‌ర్ ఉండేందుకు అవ‌కాశం ఉంది. రెండు కంపెనీల నుంచి పెద్ద ఎత్తున ప్రాసెస‌ర్‌ల‌ను దిగుమతి చేసుకున్నందున ఈ ఫోన్‌లో పైన చెప్పిన‌ రెండింటిలో ఏదో ఒక ప్రాసెస‌ర్ క‌చ్చితంగా ఉంటుంద‌ని తెలుస్తుంది.

ప్రత్యేకంగా ఆపరేటింగ్ సిస్టం...

ప్రత్యేకంగా ఆపరేటింగ్ సిస్టం...

ఈ ఫోన్‌లో కొత్త‌గా KAI OSను ఏర్పాటు చేశారు. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ల‌కు భిన్న‌మైంది. కేవలం జియో ఫోన్ కోస‌మే ఈ ఆప‌రేటింగ్ సిస్ట‌ంను తీర్చిదిద్దారు. MyJio, JioTV, JioCinema, JioChat, JioMusic, JioXpressNews వంటి జియో యాప్స్ అన్నీ ఈ ఫోన్‌లో వ‌స్తాయి. ఇంట‌ర్నెట్ బ్రౌజ‌ర్‌ను ఇవ్వ‌డం వ‌ల్ల కావ‌ల్సిన సైట్‌ను ఓపెన్ చేసి నెట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు. యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లను ఈ ఫోన్‌లో ప‌నిచేసేలా ప్ర‌త్యేకంగా యాప్‌ల‌ను అందివ్వ‌నున్నారు.

సింగిల్ సిమ్ మాత్రమే...

సింగిల్ సిమ్ మాత్రమే...

జియో 4జీ ఫీచర్ ఫోన్‌లో కేవ‌లం ఒక సిమ్‌ మాత్రమే ఉంటుంది. సింగిల్ సిమ్ వేరియెంట్‌లోనే ఈ ఫోన్‌ను అందిస్తున్నారు కాబట్టి డ్యూయల్ సిమ్ కార్డులు ఇందులో పనిచేయవు. ఇక ర్యామ్ విషయానికొస్తే.. జియో 4జీ ఫోన్‌లో 512 ఎంబీ ర్యామ్, 4జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఇచ్చారు. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో స్టోరేజి సామర్థ్యాన్ని 128 జీబీ వ‌ర‌కు పెంచుకోవచ్చు. ఆ మేర‌కు మెమొరీ కార్డుతో స్టోరేజీని పెంచుకోవ‌చ్చు.

ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా, నో ఫ్లాష్...

ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా, నో ఫ్లాష్...

జియో 4జీ ఫీచర్ ఫోన్ వెనుక భాగంలో 2 మెగాపిక్స‌ల్ సామ‌ర్థ్యం ఉన్న కెమెరా ఉంది. ఫ్లాష్ లేదు. ముందు భాగంలో 0.3 మెగాపిక్స‌ల్ సామ‌ర్థ్యం ఉన్న వీజీఏ సెల్ఫీ కెమెరా అమర్చారు. దీనికి కూడా ఫ్లాష్ లేదు. ఫోన్ పై భాగంలో టార్చి లైట్ ఉంటుంది. కింది భాగంలో 3.5 ఎంఎం ఆడియో జాక్‌, మైక్రో యూఎస్‌బీ స్లాట్ ఉన్నాయి.

ఇంకా.. ఏమేం ఉన్నాయంటే..

ఇంకా.. ఏమేం ఉన్నాయంటే..

వైర్‌లెస్ ఎఫ్ఎం ఫీచ‌ర్ ఉండ‌డం వ‌ల్ల హెడ్‌ఫోన్స్ పెట్ట‌కుండానే జియో ఫోన్ లో ఎఫ్ఎం రేడియోను ఆస్వాదించ‌వ‌చ్చు. 4జీ వీవోఎల్‌టీఈ ఫీచర్ ఉండ‌డం వ‌ల్ల హెచ్‌డీ వాయిస్ కాల్స్ చేసుకోవ‌చ్చు. దీనికోసం మళ్లీ ప్ర‌త్యేక యాప్ అవ‌స‌రం లేదు. వైఫై ఉంది కాబట్టి ఫోన్ ను వైఫై హాట్ స్పాట్ ల‌కు క‌నెక్ట్ చేసుకోవ‌చ్చు. కానీ ఇందులో వైఫై హాట్ స్పాట్ పెట్టుకునే అవ‌కాశం మాత్రం లేదు కాబట్టి ఈ ఫోన్ ఇంట‌ర్నెట్‌ను ఇత‌ర డివైజ్ ల‌కు షేర్ చేయ‌లేం. బ్లూటూత్ 4.1 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ ఉండడం వ‌ల్ల ఫైల్స్ వేగంగా షేర్ అవుతాయి. జియో ఫోన్ లో 2000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగి ఉన్న బ్యాట‌రీ ఉంది. ఫీచ‌ర్ ఫోనే క‌నుక బ్యాట‌రీ బ్యాక‌ప్ బాగానే వ‌స్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. దీని స్టాండ్ బై టైం 15 రోజులు.

English summary
Reliance JioPhone can be pre-booked starting 5:30 today. Ahead of registrations, Jio has put out full specifications and detailed data plans for this 4G -enabled feature phone on its website. JioPhone, which is being dubbed as ‘India ka smartphone’ by RIL chairman Mukesh Ambani, ships with features that sets it apart from any other feature phone in the market. At a disruptive ‘effective’ price of Rs 0, the company is asking for a refundable security deposit of Rs 1,500 for three years from users who buy the phone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X