వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: ఆగష్టు 24 నుండి రిలయన్స్ ఫీచర్‌ఫోన్ బుకింగ్స్ ప్రారంభం

రిలయన్స్ ఫీచర్‌ఫోన్ కోసం బుకింగ్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి.ఈ ఫోన్‌లో అనేక రకాల ఫీచర్లున్నాయని ముఖేష్ అంబానీ ఇదివరకే ప్రకటించారు. ఈ ఫోన్‌ బుకింగ్స్ ఈ నెల 24వ, తేది నుండి ప్రారంభం కానున్నాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: రిలయన్స్ ఫీచర్‌ఫోన్ కోసం బుకింగ్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి.ఈ ఫోన్‌లో అనేక రకాల ఫీచర్లున్నాయని ముఖేష్ అంబానీ ఇదివరకే ప్రకటించారు. ఈ ఫోన్‌ బుకింగ్స్ ఈ నెల 24వ, తేది నుండి ప్రారంభం కానున్నాయి.

శుభవార్త: ఆగష్టు 24 నుండి రిలయన్స్ ఫీచర్‌ఫోన్ బుకింగ్ , ఎలాగంటే?శుభవార్త: ఆగష్టు 24 నుండి రిలయన్స్ ఫీచర్‌ఫోన్ బుకింగ్ , ఎలాగంటే?

రిలయన్స్ జియో మార్కెట్లోకి రావడమే సంచలనంతో ప్రారంభమైంది. ఉచిత వాయిస్ కాల్స్, ఉచిత డేటాలతో రిలయన్స్ ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలను చూపించింది.

కొత్త 4జీ ఫోన్‌తో మార్కెట్లోకి రానున్నట్టు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇదివరకే ప్రకటించారు. ఈ ఫోన్‌ కోసం రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్‌ను చెల్లించాలి. మూడేళ్ళ తర్వాత ఈ సెక్యూరిటీ డిపాజిట్‌ను ఖతాదారులకు చెల్లించనున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది.

షాక్: జియో ఫీచర్‌ఫోన్‌పై మోర్గాన్ సంచలన నివేదికషాక్: జియో ఫీచర్‌ఫోన్‌పై మోర్గాన్ సంచలన నివేదిక

ఈ ఫోన్‌లో ఉండే ఫీచర్లను ఇప్పటికే రిలయన్స్ ప్రకటించింది. అయితే ఈ ఫోన్‌ను మూడురోజుల్లో టెస్టింగ్‌ కోసం రిలయన్స్ మార్కెట్లోకి తీసుకురానుంది. టెస్టింగ్‌లో చోటుచేసుకొన్న లోపాలను సరిదిద్దుకొనే ప్రయత్నాలను రిలయన్స్ చేయనుంది.

ఆగష్టు 24 నుండి రిలయన్స్ ఫీచర్‌ఫోన్ బుకింగ్స్

ఆగష్టు 24 నుండి రిలయన్స్ ఫీచర్‌ఫోన్ బుకింగ్స్

రిలయన్స్ ఫీచర్‌ఫోన్ బుకింగ్స్ ఈ నెల 24వ, తేదిన నుండి ప్రారంభం కానున్నాయి.ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో ఈ ఫోన్‌లను బుక్ చేసుకొనే అవకాశం ఉంది. తొలుత ఈ ఫోన్‌ను ఎవరు బుక్ చేసుకొంటారో, ఈ ఫోన్ తొలుత వారికే అందించనున్నట్టు రిలయన్స్ ప్రకటించింది.

సెప్టెంబర్ నుండి ఫీచర్ ఫోన్ అందుబాటులోకి

సెప్టెంబర్ నుండి ఫీచర్ ఫోన్ అందుబాటులోకి

రిలయన్స్ ఫీచర్‌ఫోన్ మూడు రోజుల్లో టెస్టింగ్‌కు రానుంది.ఇండియా 4జీ స్మార్టో‌ఫోన్‌గా ఫీచర్‌‌ఫోన్‌ను రిలయన్స్ ప్రకటించింది. ఈ 4జీ వీవోఎల్టీఈ ఎంట్రీ లెవల్ హ్యాండ్‌సెట్ ఆగష్టు 15వ, తేది నుండి బీటా టెస్టింగ్‌కు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన డేటా ప్రణాళికలను సిద్దం చేసినట్టు కంపెనీ ప్రకటించింది.

వారానికి 50 లక్షల ఫోన్ల విక్రయానికి టార్గెట్

వారానికి 50 లక్షల ఫోన్ల విక్రయానికి టార్గెట్

ఫీచర్‌ఫోన్లను వారానికి 50 లక్షలు విక్రయించాలని కంపెనీ టార్గెట్‌గా నిర్ణయించింది. జియో ఫీచర్‌ఫోన్‌ కోసం వినియోగదారుల బుకింగ్స్‌కు తగ్గట్టుగానే ఫోన్లను అందించేందుకుగాను వారానికి 50 లక్షల ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ మేరకు కంపెనీ అన్ని చర్యలను తీసుకొంది. ఫీచర్‌ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ ప్రభావాన్ని అంచనా వేయలేమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఫీచర్‌ఫోన్ గిరాకీ

ఫీచర్‌ఫోన్ గిరాకీ

జూలై 21న, రిలయన్స్ ఫీచర్‌ఫోన్‌ను ఆవిష్కరించనున్నట్టు ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఆగష్టు 15 నాటికి ఈ ఫోన్ పరీక్ష కోసం అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌కు పోటీగా ఇతర కంపెనీలు కూడ కొత్త పోన్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నట్టు ప్రకటించాయి.

English summary
Three days to go for Jio to begin testing of the new JioPhone. Mukesh Ambani's Reliance Jio will be commercially launching the new 4G feature phone next month. The USP of the device is its price tag and 4G connectivity. The company claims it is effectively free but the user still has to pay a price of Rs 1,500, which can be refunded after three years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X