వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త వ్యాపారంలోకి ముఖేష్ అంబానీ... హిట్ అయితే ఈ విదేశీ సంస్థలకు పెద్ద దెబ్బే...!

|
Google Oneindia TeluguNews

ఇప్పటి వరకు టెలికాం రంగంలో చరిత్ర సృష్టించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తర్వలో మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే భారత్‌లో ఈకామర్స్ వెబ్‌సైట్లు ఎంత పాపులర్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ముఖేష్ అంబానీ కూడా త్వరలో ఆన్‌లైన్ షాపింగ్ రంగంలోకి దిగనున్నారు. భారత్‌లో అమెజాన్, వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్టు లాంటి సంస్థలకు పోటీగా రిలయన్స్ ఆన్‌లైన్ షాపింగ్‌ను తీసుకుచ్చి తన ప్రత్యేకతను చాటాలని ముఖేష్ అంబానీ భావిస్తున్నారు.

ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ తన సొంత సంస్థ అయిన జియో నెట్‌వర్క్ సేవలను కూడా ఈ ఆన్‌లైన్ షాపింగ్ కోసం వినియోగించుకునేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమచారం. ఈ సరికొత్త ప్రాజెక్టు మరో ఏడాది సమయంలో పట్టాలు ఎక్కుతుందని రిలయన్స్ కంపెనీకి చెందిన విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. జియో రిలయన్స్ రిటెయిల్‌లు సంయుక్తంగా కలిసి కొత్త ఈకామర్స్ మార్కెట్‌ను లాంచ్ చేస్తాయని రిలయన్స్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఒక్క గుజరాత్‌లోనే 12 లక్షల మంది చిన్న రీటెయిలర్లు దీంతో లబ్ధి పొందుతారని ఓ కార్యక్రమంలో ముఖేష్ అంబానీ వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు ముంబై, కోల్‌కత,చెన్నై, బెంగళూరు నగరాల్లో జరుగుతున్నాయని సమాచారం.

Reliance to step into E-commerce business, Ambani outlines his plan to take on Amazon and wallmart

ఇదిలా ఉంటే గత నెలలో విదేశీ ఆన్‌లైన్ షాపింగ్ రిటైలర్స్ పై కేంద్రం కన్నెర్ర చేసింది. నిబంధనలను కఠినతరం చేసింది. ఒక కంపెనీకి చెందిన వస్తువులను అధిక డిస్కౌంట్‌లు ఇచ్చి ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న నేపథ్యంలో సదరు కంపెనీ వస్తువులు తీసుకున్న ఇతర వ్యాపారులు భారీగా నష్టపోతున్నారని కేంద్రం వివరణ ఇచ్చింది. ఈ క్రమంలోనే విదేశీ యాజమాన్యాలు నడుపుతున్న ఈకామర్స్ వెబ్‌సైట్లపై ఆంక్షలు విధించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్స్ అయిన అమెజాన్, వాల్ మార్ట్, ఫ్లిప్ కార్ట్‌ల కార్యకలాపాలకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. కేంద్ర తీసుకువచ్చిన కఠిన నిబంధనలు రిలయన్స్‌ ఈకామర్స్‌కు వరంలా మారనున్నాయి.

ఇదిలా ఉంటే రిలయన్స్ ఈకామర్స్‌కు సంబంధించి ముఖేష్ అంబానీ క్రమంగా వివరాలను బయటకు వెల్లడిస్తూ వచ్చారు. జూలైలో తమ కంపెనీ షాపింగ్ రంగంలో వినూత్న పద్ధతులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందంటూ గతేడాది జూలైలో చిన్న సమాచారం ఇచ్చారు. అయితే ఈకామర్స్ పోర్టల్ లేదా ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ ముఖేష్ అంబానీ ప్రారంభించనున్నారని నాడు ఎవరూ ఊహించలేదు.

English summary
Reliance Industries Ltd. will roll out its online shopping platform to 1.2 million retailers and store-owners in India, starting on an ambitious plan to take on Amazon.com Inc. and Walmart Inc.’s Flipkart on its home turf.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X