• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాఫెల్ రచ్చ: ఎన్డీటీవీ పై పరువునష్టం దావా వేసిన రిలయన్స్ గ్రూప్

|

అహ్మదాబాద్ : రాఫెల్ ఒప్పందం కేంద్ర ప్రభుత్వానికి నిద్ర పట్టనివ్వకుండా చేస్తోంది. రాఫెల్ పై కేంద్ర ప్రభుత్వ వైఖరిని బట్టబయలు చేస్తూ ప్రముఖ జాతీయ మీడియా ఎన్డీటీవీ కథనం ప్రసారం చేసింది. ఇందులో అనిల్ అంబానికి చెందిన రిలయన్స్ గ్రూపునకు సంబంధం ఉందంటూ కథనాలు ప్రసారం చేసింది. దీంతో అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ గ్రూపు రూ.10వేల కోట్లు పరువు నష్ట దావా వేసింది. రాఫెల్‌ డీల్‌కు సంబంధించి అవాస్తవాలను, కట్టుకథలను ప్రసారం చేసిందని ఆరోపిస్తూ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ కోర్టులో రిలయన్స్‌ గ్రూపు పదివేల కోట్ల రూపాయలకు దావా వేసింది. అక్టోబరు 26న దీనిపై విచారణ జరగనుంది. ఎన్‌టీవీలో సెప్టెంబరు 29 న ప్రసారం చేసిన వీక్లీ ప్రోగ్రాం 'ట్రూత్ వెర్సస్‌ హైప్స్‌'పై ఈ కేసు ఫైల్‌ చేసింది.

రిలయన్స్ గ్రూప్ వేసిన దావాపై ఎన్డీ టీవీ స్పందించింది. తాము ఎట్టి పరిస్థితుల్లో బెదిరేది లేదని తెలిపింది. న్యాయపోరాటానికి ఎన్డీటీవీ సిద్ధమని ప్రకటించింది. రిలయన్స్ ఆరోపణలను కొట్టిపారేసింది. ఆరోపణల్లో వాస్తవం లేదని ఎన్డీటీవీ వెల్లడించింది. ఒ‍క వార్తా సంస్థగా సత్యాన్ని బయటపెట్టే బాధ్యత తమకుందనీ, స్వతంత్ర, న్యాయమైన జర్నలిజానికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. అంతేకాదు ఇది మీడియాకు ఒక హెచ్చరిక అని ఎన్‌డీటీవీ వ్యాఖ్యానించింది.

Reliance Sues NDTV For 10,000 Crores For Rafale Coverage

ఇక షో ఆన్ఎయిర్‌లోకి రాక కొద్దిరోజుల ముందే ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకాయిస్ హోలాండే కేంద్ర ప్రభుత్వమే ఆఫ్‌సెట్ భాగస్వామిగా రిలయన్స్‌ను సూచించిందని చెప్పడంతో మరింత అగ్గి రాజేసింది. ఒప్పందం జరిగిన సమయంలో హోలాండేనే అధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో రాఫెల్‌ ఒప్పందంపై అధికార, ప్రతిపక్షం మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం జోరుగా సాగుతోంది. దివాలా తీసిన అనిల్ అంబానీకి బిల్లియన్ల డాలర్లను కట్టబెట్టేందుకే ప్రభుత్వరంగ సంస్థను కాదని మరీ రిలయన్స్‌ డిఫెన్స్‌కు ఈ కాంట్రాక్టును అప్పగించిందని నరేంద్రమోదీ సర్కార్‌పై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. దేశానికి కాపలాదారుడిగా ఉంటానని చెప్పిన ప్రధాని మోడీ.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
NDTV has been sued for 10,000 crores by Anil Ambani's Reliance Group in a court in Ahmedabad for its reportage on the Rafale fighter jet deal. The hearing has been listed for October 26th and NDTV will argue that the charges of defamation are nothing more than a heavy-handed attempt by Anil Ambani's group to suppress the facts and prevent the media from doing its job - asking questions about a defence deal and seeking answers that are very much in public interest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more