వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఓసీ షాక్: పెట్రోల్, డీజిల్‌పై తగ్గింది రూపాయి కాదు, 1పైసా మాత్రమే!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) వాహనదారులతో ఆడుకుంటున్నట్లు కనిపిస్తోంది. బుధవారం పెట్రోల్, డీజీల్ ధరలపై 59పైసలు తగ్గించినట్లు మొదట ప్రకటించిన ఈ సంస్థ.. ఇప్పుడు ఒక పైసా మాత్రమే తగ్గించినట్లు తెలిపి ఊసురుతీసింది.

ఎట్టకేలకు స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధరలు: నేటి ధరల వివరాలు ఇవే! ఎట్టకేలకు స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధరలు: నేటి ధరల వివరాలు ఇవే!

రూపాయి వరకు తగ్గించినట్లు ప్రకటించి ఇప్పుడు పైసా మాత్రమే తగ్గించడంపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెంచేప్పుడు రూపాయలు పెంచుతూ.. తగ్గించేప్పుడు మాత్రం పైసాల్లో తగ్గిస్తారా? అంటూ మండిపడుతున్నారు.

Relief at last? IOC cuts petrol, diesel prices by 1 paise not 59 paise

ప్రస్తుతం న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.77.83 ఉండగా, డీజిల్ లీటర్ ధర 68.75 కొనసాగుతోంది. దేశంలోని పలుప్రాంతంలో పెట్రోల్ ధరలు రూ. 84, డీజిల్ లీటర్ ధర రూ. 75గా కొనసాగుతోంది.

గత 15రోజులుగా వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నాయి. అయితే, ధరల తగ్గింపుపై కేంద్రం కసరత్తులు చేస్తోందని ఇటీవల బీజేపీ ఎంపీ అమిత్ షా ప్రకటించారు.

English summary
Indian Oil Corp, the country's top refiner and fuel retailer, has marginally cut pump prices of petrol and diesel around India, its website showed on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X