వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వినియోగదారులకు తీపి కబురే: తగ్గిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఓ వైపు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌, సీఎన్‌జీ ధరలు వాహనదారులను కలవరపెడుతున్న నేపథ్యంలో ఎల్పీజీ వినియోగదారులకు ఇది నిజంగానే శుభవార్త అని చెప్పవచ్చు. నాన్‌ సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్ల ధరను రూ 35.50 మేర ఆయిల్‌ కంపెనీలు తగ్గించాయి.

అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా నెలలో ఎల్‌పీజీ సిలిండర్‌ ధరను తగ్గించడం ఇది రెండవసారి. వాణిజ్య సిలిండర్లకు మాత్రమే ప్రస్తుత తగ్గింపు వర్తిస్తుంది. తాజా తగ్గింపుతో 19 కిలోల కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ 54 వరకూ దిగి రాగా, 5 కిలోల చిన్న సిలిండర్‌ రూ 15 తగ్గింది.

Relief for consumers: LPG cylinder rates slashed

కాగా, ప్రతి కుటుంబానికి ఏటా 14.2 కిలోల సబ్సిడీ సిలిండర్లను 12 వరకూ సమకూర్చుతున్నారు. ఈ పరిమితిని దాటితే మార్కెట్‌ రేటు (నాన్‌ సబ్సిడీ)కే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం తగ్గించిన సిలిండర్ ధరలు వారికి కొంత ఊరట కలిగించనున్నాయి.

English summary
At a time when soaring prices of petrol, diesel, CNG and PNG has sent household budget into a spin, oil companies provided relief to some extent by cutting prices of non-subsidised LPG cylinders by Rs 35.50.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X