వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టెరిలైట్‌ కంపెనీకి షాక్: విస్తరణ పనులపై మద్రాస్ హైకోర్టు స్టే

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకూడిలోని స్టెరిలైట్ ఫ్యాక్టరీ విస్తరణ పనులను నిలిపివేయాలని మద్రాస్ హైకోర్టు బుధవారం నాడు స్టే విధించింది. ఈ మేరకు వేదాంత గ్రూప్‌కు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు నిర్ణయం ఫ్యాక్టరీ యాజమాన్యానికి నిరాశను కల్గించింది. ఇదిలా ఉంటే ఈ ఫ్యాక్టరీ విషయమై తూత్తుకూడిలో ప్రజలు నిరసనలు కొనసాగిస్తున్నారు. మే 22వ తేదిన కలెక్టరేట్ ముట్టిడి వెళ్ళిన ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 11 మంది మృత్యువాత పడ్డారు.

తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్‌ విస్తరణ పనులను నిలిపివేయాలని మద్రాస్‌ హైకోర్టు బుధవారం స్టే జారీ చేసింది. ఈ మేరకు వేదాంత గ్రూప్‌నకు ఆదేశాలు జారీ చేసింది. మరోపక్క తూత్తుకుడిలో ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన తర్వాతే స్టెరిలైట్‌ విస్తరణకు సంబంధించిన పర్యావరణ అనుమతులు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. నాలుగు నెలల్లోపు ఈ ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించాలని కోర్టు ఆదేశాలను జారీ చేసింది.

Relief for Thoothukudi: madras High court stays further expansion by Sterlite Copper smelter

ఇప్పటివరకు ఏటా 4,00,000 టన్నుల రాగిని ఉత్పత్తి చేసే కర్మాగారాన్ని ఇక్కడ స్టెరిలైట్‌ నిర్వహిస్తోంది. దాదాపు మరో రూ.3,000 కోట్లు వెచ్చించి ఇక్కడే మరో రాగి ప్లాంట్‌ నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే కాలుష్యం కారణంగా ఇబ్బందులు పడుతున్న స్థానికులు పరిశ్రమ విస్తరణను వ్యతిరేకిస్తూ మంగళవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో దాదాపు 11 మృతి చెందారు.

అయితే తూత్తుకుడిలో పోలీస్‌ కాల్పుల ఘటన 'కోల్డ్‌ బ్లడెడ్‌ మర్డర్‌' అని పీఎంకే చీఫ్‌ అన్బుమణి రామదాస్‌‌ ఆరోపించారు. అక్కడి ఎస్పీ, కలెక్టర్‌, డీజీపీ, ప్రధాన కార్యదర్శులను సస్పెండ్‌ చేసి వారిపై హత్యానేరం కింద విచారణ జరపాలన్నారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పళనిస్వామి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

English summary
The Madurai bench of the Madras High Court has passed an interim order in connection with allegations of Sterlite operating a second unit in Thoothukudi by violating the Environmental Protection Act of 1986. The court on Wednesday stayed construction of a new copper smelter by Sterlite.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X