వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

24 గంటలు కీలకం, ఎగ్జిట్ పోల్ గతంలోనూ తప్పాయి : కౌంటింగ్ కేంద్రాల వద్ద అలర్ట్‌గా ఉండాలన్న రాహుల్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఈవీఎంలతోపాటు వీవీ ప్యాట్లను లెక్కించాలన్న డిమాండ్‌ను ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో అలర్ట్‌గా ఉండాలని శ్రేణులకు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. మరో 24 గంటలు జాగ్రత్తగా ఉండాలని .. ఏమరుపాటు వద్దని కార్యకర్తలకు స్పష్టంచేశారు రాహుల్. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు.

ఈ సమయం కీలకం ..
'మరో 24 గంటలు మనకు చాలా ఇంపార్టెంట్ అని .. అప్రమత్తంగా ఉండాలన్నారు రాహుల్. ఎగ్జిట్ పోల్ అంచనాలు గతంలో కూడా తప్పాయని గుర్తుచేశారు. వాటిని చూసి మీరు నిరాశకు గురికాకండి అని సూచించారు. తమ పార్టీ సీట్లు గెలవదేమో అనే సందేహాలు వద్దు .. భయపడొద్దని ధైర్యం నూరిపోశారు. మీరు సత్యంతో పోరాడుతున్నారనే విషయాన్ని కలలో కూడా మరచిపోవద్దన్నారు. ఇప్పటికీ మీరు ఎగ్జిట్ పోల్ అంచనాలను నమ్ముతున్నారా అని కార్యకర్తలను ప్రశ్నించారు. మీరు కాంగ్రెస్ పార్టీని, మిమ్మల్ని, మీరు కష్టపడ్డ సమయాన్ని మాత్రమే గుర్తుంచుకోవాలి' అని రాహుల్ కార్యకర్తల్లో మనోధైర్యం నింపుతూ ట్వీట్లు చేశారు.

Remain alert and cautious for next 24 hours, Rahul Gandhi tells Congress workers

ప్రియాంక కూడా ..
దాదాపు ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీఏకు ప్రజలు పట్టం కడుతారని అంచనా వేశాయి. దీంతో రాహుల్ స్పందించారు. ఇంతకుముందే కాంగ్రెస్ తురుపుముక్క ప్రియాంక గాంధీ కూడా ఆడియో మేసెజ్‌ను తన పార్టీ కార్యకర్తలకు పంపించారు. పోల్ అంచనాలను నమ్మొద్దని .. అదంతా ఫేక్ అని వారిలో ధైర్యం నూరిపోశారు ప్రియాంక. ఎగ్జిట్ పోల్ అంచనాలతో నిరాశకు గురికావద్దు, దానిని మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు .. స్ట్రాంగ్ రూంల వద్ద, కౌంటింగ్ జరిగే చోట అప్రమత్తంగా ఉండాలని కోరారు. తాను ఇప్పటికీ ఫలితాలపై సానుకూలంగా ఉన్నాని .. దానికి కారణం మీరు కష్టపడిన విధానమేనని స్పస్టంచేశారు. తర్వాత రాహుల్ రంగంలోకి దిగి పార్టీ శ్రేణులకు మనోధైర్యం కల్పించారు.

English summary
with the Supreme Court and the Election Commission rejection Opposition's demand of 100% random physical counting of EVM-VVPAT in the Lok Sabha polls, Congress president Rahul Gandhi has asked his party workers to remain cautious and alert. Taking to Twitter on Wednesday, Rahul Gandhi wrote, "The next 24 hours are important. Be cautious and alert. Don't be scared. You are fighting for the truth." Asking Congress workers not to believe in the exit poll findings, Rahul Gandhi wrote, "Don't be disappointed with the propaganda of fake exit poll. Have trust in the Congress and yourself. Your hard work will not go waste."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X