• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమిత్ షా తదుపరి లక్ష్యం మావోయిస్టులేనా..? నక్సలిజంపై మోడీ సర్కార్ స్టెప్ ఏంటి..?

|

గత కొంత కాలంగా సైలెంట్‌గా ఉన్న మావోయిస్టులు మళ్లీ పంజా విసిరేందుకు స్కెచ్ వేస్తున్నారా...? ఈ సారి వారి లక్ష్యం పెద్దదిగా ఉండనుందా..? 2019 ఎన్నికల తర్వాత కాస్త నెమ్మదించిన మావోయిస్టులు వైలెంట్‌గా రియాక్ట్ అయ్యేందుకు వేచిచూస్తున్నారా.. ఇంతకీ వారి టార్గెట్ ఎవరు..?

అమిత్ షా తదుపరి టార్గెట్ నక్సలిజం

అమిత్ షా తదుపరి టార్గెట్ నక్సలిజం

గత కొంతకాలంగా చాలా సైలెంట్‌గా ఉన్న నక్సలైట్లు మరోసారి తమ మెదడుకు పదును పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సారి వారి లక్ష్యం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనే వార్త ప్రచారంలో ఉంది. రెండో సారి అధికారం చేపట్టిన మోడీ సర్కార్ ఆర్ఎస్ఎస్ కన్న కలలను సాకారం చేస్తూ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో ముఖ్యంగా జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేయడం, ట్రిపుల్ తలాక్ లాంటి చట్టం తీసుకురావడం వంటివి జరిగాయి. ఇక దేశంలో నక్సలిజం లేకుండా చేయాలన్నదే మోడీ సర్కార్ తదుపరి లక్ష్యంగా ఉన్నట్లు సమాచారం. ఆ దిశగా చర్యలు ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. నక్సలిజంను అంతమొందించేందుకు ఆర్‌ఎస్ఎస్ ఎప్పటి నుంచో వ్యూహరచన చేస్తోంది. ఈ మధ్య కాలంలో అర్బన్ నక్సల్స్ అంటూ ఆర్ఎస్ఎస్ బీజేపీ మద్దతుదారులు మాట్లాడుతున్నారు.

 నక్సలిజంపై ఆర్ఎస్ఎస్ వ్యూహం ఏంటి..?

నక్సలిజంపై ఆర్ఎస్ఎస్ వ్యూహం ఏంటి..?

గతేడాది అక్టోబరులో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అర్బన్ నక్సల్స్ ఎవరూ అనే పుస్తకం రాశారు. దీన్ని పబ్లిష్ చేసింది కూడా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ విశ్వసంవాద్ కేంద్ర. అర్బన్ నక్సల్స్ ను గుర్తించాలంటూ ఆ పుస్తకం ద్వారా ప్రజలను కోరారు. దేశంలో కొందరు అతివాదులు తమను తాముగా మావోల మద్దతుదారులమని చెప్పుకుని తిరుగుతున్నారని చెప్పారు. ఇక మావోల ఛాయలు కాషాయం జెండాతో రూపుమాపాలని ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోంది. ఇందుకు 2019లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఆర్‌ఎస్ఎస్‌కు మరింత బలాన్ని ఇచ్చాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు సజాతీయ భారతీయ సమాజం ఏర్పాటులో నక్సలిజం అడ్డంకిగా మారిందని ఆర్ఎస్ఎస్ భావించింది. అయితే జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్‌ చట్టం తీసుకురావడంతో ఆర్ఎస్ఎస్ స్వప్నం కొంతవరకు సాకారం అయ్యింది. ఇక బీజేపీ ప్రభుత్వం తదుపరి లక్ష్యం నక్సలిజంను నిర్మూలించడంగా ఉందని తెలుస్తోంది.

 సీఎంలతో అమిత్ షా సమావేశం అజెండా అదేనా..?

సీఎంలతో అమిత్ షా సమావేశం అజెండా అదేనా..?

ఇక నక్సలిజం నిర్మూలించేందుకు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా నక్సల్ ప్రభావిత రాష్ట్ర ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రులతో అమిత్ షా సమావేశం కావడం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో నక్సలిజంను ఎలా ఎదుర్కోవాలో చర్చించారు. సమావేశం తర్వాత అమిత్ షా ట్విటర్ వేదికగా ఓ పోస్టు చేశారు. నక్సలిజం అణిచివేతపై జరిగిన సమావేశం ఫలితాలను ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రజాస్వామ్యంకు విఘాతం కలిగించేది ఏదైనా సరే సమూలంగా నిర్మూలిస్తాం అంటూ ట్వీట్ చేశారు. ఇందులో భాగంగానే భద్రతాదళాలకు కొద్ది రోజుల ముందే అన్ని అధికారాలు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోంశాఖ.

కేంద్ర హోంశాఖ గణాంకాలు ఏం చెబుతున్నాయి..?

కేంద్ర హోంశాఖ గణాంకాలు ఏం చెబుతున్నాయి..?

భద్రతాదళాలు నక్సల్ ప్రభావిత ప్రాంతాలను జల్లెడపట్టడమే కాదు.. మావోలను నిర్మూలణ కోసం కౌంటర్ ఆపరేషన్స్ కూడా నిర్వహిస్తాయని కేంద్ర హోంశాఖ తెలిపింది. గత ఐదేళ్లలో మావోల కదలికలు దాదాపుగా లేవని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ... అమిత్ షా కేంద్రహోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే నక్సలిజం నిర్మూలనకు కొత్త ప్రణాళికలు రచించినట్లు సమాచారం. ఇక కేంద్రహోంశాఖ విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం... మోడీ ప్రభుత్వంలో 43.4శాతం నక్సలిజంను అణిచివేసినట్లు తెలుస్తోంది. 2009-13 మధ్య 8782 నక్సలిజం కేసులు నమోదు కాగా... 2014-18ల మధ్య 4,969కి పడిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి.ఇక నక్సలైట్లు పాల్పడిన హింసలో భద్రతాబలగాలతో కలిపి మృతుల సంఖ్య 2014లో 60శాతంగా ఉన్నిందని.. 2009-13 మధ్య 3326 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఇక 2014 నుంచి 2018 మధ్య ఆ సంఖ్య 1321 మృతి చెందారు. ఇక నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రూ.1000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడిస్తోంది.

అమరుల ప్రాణత్యాగం వృథా పోనీయము: మోడీ

అమరుల ప్రాణత్యాగం వృథా పోనీయము: మోడీ

ఇక జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ చట్టంతో పాటు నక్సలిజం నిర్మూలన కూడా బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చింది. ఇక మధ్యప్రదేశ్‌లో సాగర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నరేంద్ర మోడీ... దేశానికి సేవ చేసే క్రమంలో అమరులైన ప్రతిఒక్క జవాను ఆత్మకు శాంతి చేకూరుస్తామని అలా జరగాలంటే ముందుగా దేశంలో ఉగ్రవాదం, నక్సలిజంను సంపూర్ణంగా నిర్మూలిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసమే మోడీ సర్కార్ వ్యూహాలు రచిస్తోంది. అయితే మావోయిస్టులు కూడా తమ ఏర్పాట్లలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారి టార్గెట్‌గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నారనే వార్త ప్రచారంలో ఉంది.

English summary
After fulfilling long-standing demand of the RSS-BJP by scrapping special status of Jammu and Kashmir, it seems Union Home Minister Amit Shah is turning his attention to Naxal insurgency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X