• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

‘ఐ’ తీస్తే శవం -‘ఏ’ తీస్తే మృతం -మాజీ సీఎం భార్యకు కౌంటర్ -పండుగ వేళ చావు రాజకీయం

|

కరోనా విలయంతో విస్తరించిన చీకట్లను.. దీపావళి ప్రమిదలతో పారదోలుతూ.. దేశమంతా పండుగ వాతావరణ నెలకొన్న తరుణాన.. రెండు హిందూత్వ పార్టీ మధ్య చావు రాజకీయం సంచలనంగా మారింది. శవం, మృతం అంటూ ఒకరినొకరు తిట్టిపోసుకుంటోన్నతీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. మిగతా రాజకీయ నేతల భార్యలకు భిన్నంగా భర్త పార్టీకి అడుగడుగునా మద్దతు పలికే అమృత ఫడ్నవిస్ ఈ వివాదాన్ని మొదలుపెట్టడా.. ఆమెకు దిమ్మతిరిగేలా శివసేన మహిళా నేతలు కౌంటరిచ్చారు.

బీహార్ సీఎం పదవికి నితీశ్ రాజీనామా -గవర్నర్ ఆమోదం -ఆయన కలల పథకానికి బీజేపీ గండిబీహార్ సీఎం పదవికి నితీశ్ రాజీనామా -గవర్నర్ ఆమోదం -ఆయన కలల పథకానికి బీజేపీ గండి

 అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నేత‌ దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇంచార్జిగా వ్యవహరించడం తెలిసిందే. కరోనా బారినపడి, ఇంటికే పరిమితం అయిపోయినా.. ఫడ్నవిస్ తనదైన చాణక్యంతో బీజేపీని నడిపించారు. ఫలితంగా బీహార్ ఎన్డీఏ కూటమిలో బీజేపీ సీనియర్ భాగస్వామిగా ఎదిగి, జేడీయూను కమాండ్ చేసే స్థాయిలో విజయం సాధించింది. మహారాష్ట్రకే చెందిన అధికార పార్టీ శివసేన కూడా బీహార్ లో తొలిసారి బరిలోకి దిగగా.. సున్నా స్థానాలతో.. దాదాపు అభ్యర్థులందరూ డిపాజిట్లు కోల్పోయారు. బీహార్ లో సేన ఓటమిని ఎద్దేవా చేస్తూ ఫడ్నవిస్ భార్య అమృత అనూహ్య వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం మొదలైందిలా..

 ఐ తీసేస్తే శవసేన..

ఐ తీసేస్తే శవసేన..

‘‘అసలేం జరుగుతోంది? మహారాష్ట్రలో తన భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా శివసేన బీహార్ లో పోటీ చేసింది. మహారాష్ట్ర ముచ్చట ఎలా ఉన్నా, బీహార్ ప్రజలు ప్రజలు మాత్రం శివసేనను సరైన స్థానంలోనే ఉంచారు. అక్కడ శివసేన(Shiv Sena) పరిస్థితి.. తన ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో ‘ఐ' అక్షరం కోల్పోయి ఏ చేర్చినట్లుగా శవసేన(Shav Sena)గా తయారైంది'' అని అమృత ఫడ్నవిస్ కామెంట్ చేశారు. ప్రతిగా..

 అమృతా.. మాట‌లు జాగ్ర‌త్త

అమృతా.. మాట‌లు జాగ్ర‌త్త

శివసేనలో 'ఐ' తీసేసి 'ఏ' చేరిస్తే శవసేన అవుతుందన్న అమృత ఫడ్నవిస్ కు శివసేనకు చెందిన మహిళా నేత, మండలి డిప్యూటీ స్పీకర్ నీలమ్ గోర్హే ఘాటుగా కౌంటరిచ్చారు. ‘‘అమృత(Amruta) పేరులో నుంచి ‘ఏ'అక్షరాన్ని తీసేస్తే ‘మృత(mruta) అవుతుంది. బతికున్న నీకు ఆ పేరు బాగోదు. నువ్వు ఇంకో విషయం తెలుసుకోవాలి. వర్ణమాలలోని ప్రతి అక్షరం విలువైందే. అయితే దాన్ని ఎలా ఉపయోగించాలో తెలిసి ఉండాలి. దీపావళి పండగపూట ఇలాంటి చెడు వ్యాఖ్యలు చేయకండి. ఎదుటివారిపై విమ‌ర్శ‌లు చేసేట‌ప్పుడు కొన్ని హ‌ద్దులు ఉంటాయని గుర్తుంచుకోండి.''అని శివసేన కౌంటరిచ్చింది.

  Dubbaka Bypoll Result: CM KCR over GHMC Elections | Oneindia Telugu

  డైవర్స్-డిస్టెన్స్: ట్రంప్‌ను కాదని సైనికుడితో మెలానియా -అసలేంటీ రచ్చ -చిట్టచివరి వేడుకడైవర్స్-డిస్టెన్స్: ట్రంప్‌ను కాదని సైనికుడితో మెలానియా -అసలేంటీ రచ్చ -చిట్టచివరి వేడుక

  English summary
  The Shiv Sena on Friday hit out at Amruta Fadnavis, wife of BJP leader Devendra Fadnavis, over her critical remarks against the party and said she should realise that every alphabet was important. amid bihar election result, Amruta Fadnavis called it "Shav (corpse) Sena". "Don't let the alphabet 'A' in your name go into "mruta" state (dead in Marathi). Realise the importance of 'A' in your name Amruta, says sena Neelam Gorhe.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X