• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సర్దార్ పటేల్‌కు ఘోర అవమానం -మహానేత పేరు తీసి, స్టేడియానికి మోదీ పేరా? -బీజేపీ వంచన: హార్దిక్

|

ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియానికి ఇవాళ ప్రారంభోత్సవం జరిగింది. అహ్మదాబాద్ సిటీలో సబర్మతి నది ఒడ్డున ఉండే ఈ క్రీడా ప్రాంగణాన్ని మోతేరా స్టేడియంగా పిలుస్తున్నప్పటికీ, అధికారికంగా దాని పేరు ఇన్నాళ్లూ 'సర్దార్ వల్లభాయ్ పటేల్ క్రికెట్ స్టేడియం'గా కొనసాగింది. అయితే, ఇప్పుడు 1.10లక్షల మంది ప్రేక్షకులు కూర్చునేలా ఆధునీకరణ తర్వాత దాని పేరును 'నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం'గా మార్చడం వివాదాస్పదం అయింది.

  Insult to Sardar Patel? Controversy Erupts After Motera Renamed As Narendra Modi Stadium | Oneindia

  లైవ్ డిబేట్‌లో విష్ణుపై చెప్పుతో దాడి -అమరావతి జేఏసీ నేతపై ఛానల్ ఆగ్రహం -కులం కోణం -బీజేపీvsటీడీపీలైవ్ డిబేట్‌లో విష్ణుపై చెప్పుతో దాడి -అమరావతి జేఏసీ నేతపై ఛానల్ ఆగ్రహం -కులం కోణం -బీజేపీvsటీడీపీ

  పటేల్‌ను అవమానించిన బీజేపీ

  పటేల్‌ను అవమానించిన బీజేపీ

  ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ ప్రాంగణంగా ‘నరేంద్ర మోదీ స్టేడియం'ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మరో మంత్రి కిరన్ రిజిజు, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ తదితరులు బుధవారం ప్రారంభించారు. భారత్ లో తొలిసారిగా పింక్ బాల్ తో జరిగే డే అండ్ నైట్ టెస్ట్(భారత్, ఇంగ్లాండ్ మధ్య) మ్యాచ్ కు ఈ స్టేడియం వేదిక కానుంది. వసతుల పరంగా అత్యద్భుతంగా ఉన్నప్పటికీ, స్టేడియం పేరును మార్చేయడం ద్వారా పటేల్ ను బీజేపీ అవమానించిందని గుజరాత్ కాంగ్రెస్ యువ నేత, పటేల్ రిజర్వేషన్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ ఆరోపించారు. ఈ మేరకు..

  క్రికెటర్ మనోజ్ తివారీ అనూహ్యం -మోదీని కాదని దీదీకి జై -టీఎంసీలో చేరిక -బెంగాల్ ఎన్నికల వేళ..క్రికెటర్ మనోజ్ తివారీ అనూహ్యం -మోదీని కాదని దీదీకి జై -టీఎంసీలో చేరిక -బెంగాల్ ఎన్నికల వేళ..

  సర్దార్ పేరుతో ఓట్లు అడిగారే..

  సర్దార్ పేరుతో ఓట్లు అడిగారే..

  ‘‘అహ్మదాబాద్ లోని సర్దార్ పటేల్ క్రికెట్ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్దది. ఇప్పుడు దీనిని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం గా పేరు మార్చారు, ఇది ముమ్మాటికీ సర్దార్ పటేల్‌ను అవమానించడం కాదా? సర్దార్ పటేల్ పేరిట ఓట్లు అడుక్కున్న బీజేపీ.. ఇప్పుడు అదే సర్దార్ సాహెబ్‌ను అవమానిస్తోంది. పెద్దాయనకు జరిగిన ఈ అవమానాన్ని గుజరాత్ ప్రజలు ఎన్నటికీ సహించబోరు'' అని హార్దిక్ పటేల్ మండిపడ్డారు. సర్దార్ ను తమవాడిగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తోన్న బీజేపీ ఇంత అనాలోచితంగా ఆయన పేరును తొలగించిందా? అంటే మాత్రం..

  సబర్మతి అవతలి ఒడ్డున స్పోర్ట్స్ ఎంక్లేవ్

  సబర్మతి అవతలి ఒడ్డున స్పోర్ట్స్ ఎంక్లేవ్

  మోతేరా స్టేడియంగా వాడుకలో ఉన్న సర్దార్ పటేల్ స్టేడియం పేరును నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చడం పెద్ద విషయమే అయినప్పటికీ, దానిపై వివాదం రేగకుండా బీజేపీ పకడ్బందీగానే ప్లాన్ గీసింది. అమ్మదాబాద్ సిటీ గుండా వెళ్లే సబర్మతి నదికి ఈ ఒడ్డున మోదీ స్టేడియం ఉంటే, అవతలి ఒడ్డున మరోసారి సర్దార్ పటేల్ పేరుతో భారీ స్పోర్ట్స్ ఎంక్లేవ్ నిర్మాణాన్ని చేపడుతున్నారు. దీనికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులు ఇవాళే భూమి పూజ కూడా నిర్వహించారు. పటేల్ పేరుతో నిర్మించబోయే కొత్త ఎంక్లేవ్ లో 50వేల మంది కూర్చునే అథ్లెటిక్, ఫుట్ బాల్ స్టేడియం, హాకీ, మల్టీపర్పస్ గ్రౌండ్లు, టెన్నిస్, బ్యాడ్మింటన్, సైక్లింగ్, బాక్సింగ్.. ఇలా సకల క్రీడలకు వేదికలను నిర్మించబోతున్నారు.

  English summary
  Congress leader Hardik Patel has expressed his displeasure at the renmaing of the Sardar Patel Stadium to Narendr Modi Stadium. "is it not an insult to Sardar Patel? The BJP, which has been seeking votes in the name of Sardar Patel, is now insulting Sardar Saheb. The people of Gujarat will not tolerate this insult of Sardar Patel" says Hardik Patel
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X