• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అన్నంత పనీ చేసిన రేణుక: కిరణ్ ‘శూర్పణఖ’పై ప్రివిలేజ్ నోటీసు, అసలేం జరిగిందంటే?

|
  Renuka Chowdhury Issue : Here Are The Reactions Of Politicians And Parties

  న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి చెప్పినట్లుగానే.. కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకు ప్రివిలేజ్ నోటీసులు జారీ చేశారు. 'శూర్పణక నవ్వు' సోషల్ మీడియా పోస్టుకు గానూ శుక్రవారం ఉదయం రాజ్యసభలో ఆమె హక్కుల తీర్మానం కూడా ప్రవేశపెట్టారు.

  పార్లమెంటులో రేణుకా చౌదరి పెద్దగా నవ్వడంపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత ఆమెనుద్దేశించి కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

  మోడీ కామెంట్: రేణుకా చౌదరిపై శూర్పణఖ వీడియోను పోస్టు చేసిన రిజిజు

  ‘శూర్పణఖ’ పోస్టు

  ‘శూర్పణఖ’ పోస్టు

  రామాయణం సీరియల్‌లోని శూర్పణఖ పాత్ర నవ్వుతున్న వీడియోకి.. మోడీ మాట్లాడిన సమయంలో రేణుకా చౌదరి నవ్వుతున్న దృశ్యాలను కిరణ్ రిజిజు జత చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే, కొద్దిసేపటి తర్వాత దాన్ని తొలగించారు. దీనిపై రేణుకా చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

  కించపర్చారంటూ..

  కించపర్చారంటూ..

  రాజ్యసభలో తన నవ్వుపై మోడీ వ్యాఖ్యలను జతచేస్తూ.. కిరణ్ రిజిజు పోస్టుపై హక్కుల తీర్మానాన్ని ఆమె శుక్రవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ‘ఇది ఓ మహిళను అవమానించడమే కాదు, తీవ్ర అభ్యంతరం కూడా.. దీనిపై నేను హక్కుల నోటీసు తీర్మానం ప్రవేశపెట్టాను' అని రేణుకా తెలిపారు.

  పెద్దగా నవ్విన రేణుక

  పెద్దగా నవ్విన రేణుక

  కాగా, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతుండగా.. రేణుకా చౌదరి సభ మొత్తం వినబడేలా పెద్దగా నవ్వుతూనే ఉన్నారు. దీంతో ఆమెపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య ఉంటే వైద్యుడి వద్దకు వెళ్లాలని సూచించారు. సభ్యులు క్రమశిక్షణ పాటించాలని కోరారు.

  సౌభాగ్యమంటూ మోడీ..

  అయితే, ప్రధాని మోడీ కల్పించుకుని రేణుకా చౌదరిని ఏమీ అనవద్దని.. ‘రామాయణం సీరియల్ తర్వాత ఆ నవ్వు వినే భాగ్యం ఇప్పుడు మనకు కలిగింది' అని వ్యంగ్యాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. దీంతో సభలో అధికార పార్టీ సభ్యులు నవ్వులు చిందించారు. దీనిపై కాంగ్రెస్ తోపాటు ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

  అంతా ఏకం కావాల్సిందే: 2019లో మోడీని ఎదుర్కొనేందుకు సోనియా బిగ్ ప్లాన్

  అందుకే నవ్వా అంటూ రేణుక

  అందుకే నవ్వా అంటూ రేణుక

  కాగా, ‘గతంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆధార్ కార్డు అవసరం లేదని పెద్ద ప్రసంగమే చేశారు. అలాంటిది ఆధార్‌ను పుట్టించింది తామేనని చెప్తే నవ్వు రాకుండా ఉంటుందా' అని రేణుకా చౌదరి తన నవ్వుపై వివరణ ఇచ్చుకున్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Congress parliamentarian Renuka Chowdhury has put up a motion for breach of privilege against Union Minister Kiren Rijiju for sharing on Facebook a post mocking her laughter after Prime Minister Narendra Modi joked about it in the Rajya Sabha.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more