వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడే కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది: 45 ఏళ్ల గరిష్ట నిరుద్యోగ సమస్యపై నీతి ఆయోగ్ వివరణ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగ సమస్య గత 45 ఏళ్లలో 2017-18లోనే తీవ్రంగా ఉందనే వార్తలను నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ గురువారం కొట్టి పారేశారు. నిరుద్యోగ సమస్యపై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దేశంలో నిరుద్యోగ సమస్య 45 ఏళ్లలో అత్యధికంగా 2017-18లో నమోదయిందని జాతీయ నమూనా సర్వే సంస్థ (ఎన్ఎస్ఎస్ఓ) తెలిపిందని పేర్కొన్నారు.

దీనిపై అమితాబ్ కాంత్ స్పందించారు. అసలు ఆ డేటా అధికారికం కాదని, అలాగే, దానిని వెరిఫై కూడా చేయలేదని వెల్లడించారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ... విడుదలైన నివేదిక డ్రాఫ్ట్ అని, అది పూర్తి కావాల్సి ఉందని చెప్పారు. ఉద్యోగాలకు సంబంధించిన డేటాను ప్రభుత్వం విడుదల చేయలేదని చెప్పారు. ఎందుకంటే అది ఇంకా పూర్తి కాలేదని అన్నారు. డేటా పూర్తిగా తయారయ్యాక తాము విడుదల చేస్తామని చెప్పారు.

Report of unemployment at 45 year high not official, says NITI Aayog after day long Opposition attack

ఉద్యోగాలు సృష్టించామని చెప్పేందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని రాజీవ్ కుమార్ తెలిపారు. డేటా వివరాలు పూర్తి కాలేదని, ఆ తర్వాత దానిని ప్రభుత్వం అప్రూవ్ చేయాల్సి ఉందని చెప్పారు. మరింత డేటా జోడించాల్సి ఉందని తెలిపారు.

ఎన్ఎస్సీ తాత్కాలిక చీఫ్ పీసీ మోహనన్, అతని సహచరుడు జే మీనాక్షి రాజీనామా పైన రాజీవ్ కుమార్ స్పందిస్తూ... అందుకు వారి వ్యక్తిగత కారణాలు అని చెప్పారు. వారిని నీతి ఆయోగ్ కాంట్రాక్ట్ కుదుర్చుకోలేదని చెప్పారు. డ్రాఫ్ట్ రిపోర్ట్ కారణంగానే ఈ కన్ఫ్యూజన్‌కు కారణమైందని తెలిపారు. ఇది డ్రాఫ్ట్ రిపోర్ట్ కాబట్టి, ప్రభుత్వం విడుదల చేసిందని ఎలా చెప్పగలమని అన్నారు.

కాగా, దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చిందని రిపోర్టులు వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. 2017-18లో నిరుద్యోగ రేటు 6.1 శాతమని నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఓ) తెలిపినట్లుగా వచ్చింది. గత 45 ఏళ్లలో ఇదే గరిష్టం. నవంబర్ 2016లో ఎన్డీయే సర్కారు నోట్ల రద్దు చేశాక నిరుద్యోగ సమస్య పెరిగిందని, 1972-73 తర్వాత ఈ స్థాయిలో నిరుద్యోగ రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోందని, గ్రామీణ ప్రాంతాల (5.3 శాతం)తో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో (7.8 శాతం) నిరుద్యోగ సమస్య అధికంగా ఉందని రిపోర్ట్ వెల్లడించినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిని బీజేపీ నేతలు కూడా కొట్టి పారేశారు.

2004-05 నుంచి 2011-12 సంవత్సరాల మధ్య చదువుకున్న గ్రామీణ ప్రాంత మహిళల్లో నిరుద్యోగ శాతం 9.7-15.2 మధ్య ఉండగా, 2017-18లో అది 17.3 శాతానికి పెరిగిందని, గ్రామీణ పురుషుల్లో 2004-05 నుంచి 2011-12 మధ్య 3.5-4.4 శాతం మధ్యనున్న నిరుద్యోగ రేటు 2017-18లో 10.5 శాతానికి చేరుకుందని పేర్కొన్నారు.

English summary
The NITI Aayog CEO Amitabh Kant on Thursday dismissed the leaked National Sample Survey Office (NSSO) report which showed unemployment rate at 45-year high during 2017-18. NITI Aayog said that the data on jobs is not official and has not been verified yet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X