వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమరవీరుడి భార్యకు అశోకచక్ర: కన్నీళ్లు పెట్టిన రాష్ట్రపతి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవాల సందర్భంగా దేశం కోసం వీర మరణం పొందిన సైనికుల కుటుంబసభ్యులకు శౌర్య అవార్డులు ఇవ్వడం సాధారణమే. ఈ ఏడాది కూడా రాష్ట్రపతి హోదాలో తొలిసారి రామ్‌నాథ్ కోవింద్ ఈ అవార్డులను అందజేశారు.

Recommended Video

Republic Day 2018 : PM Modi Pays Tribute At Amar Jawan Jyoti

ఈ సందర్భంగా గతేడాది నవంబర్‌లో వీర మరణం పొందిన ఎయిర్‌ఫోర్స్ కమాండో జేపీ నిరాలా భార్య, తల్లికి అశోక చక్ర అవార్డు ఇచ్చిన తర్వాత కోవింద్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కంటతడి పెట్టారు. ఆయన కన్నీళ్లను కర్చీఫ్‌తో తుడుచుకుంటూ కనిపించారు. నిరాలా గత నవంబర్‌లో బందీపుర ఎన్‌కౌంటర్ సందర్భంగా వీర మరణం పొందారు.

కాగా, 69వ గణతంత్ర వేడుకలకు పది దేశాలకు చెందిన నేతలు హాజరయ్యారు. వారందర్నీ ప్రధాని మోడీ ఆహ్వానించారు. దీని కోసం రాజ్‌పథ్‌లో ప్రత్యేకంగా వేదికను ఏర్పాటు చేశారు. త్రివిధదళాధిపతులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

గణతంత్ర దినోత్సవం: అమరవీరులకు మోడీ నివాళులు, బీఎస్ఎఫ్ మహిళల అద్భుత ప్రదర్శనగణతంత్ర దినోత్సవం: అమరవీరులకు మోడీ నివాళులు, బీఎస్ఎఫ్ మహిళల అద్భుత ప్రదర్శన

ఆసియా దేశాల జెండాలతో ఆర్డీ పరేడ్ నిర్వహించనున్నారు. మొత్తం 23 శకటాలు కూడా పాల్గొంటాయి. థాయిలాండ్ ప్రధాని ప్రయుత్ చాన్ ఓచా, సింగపూర్ ప్రధాని లీ హిసన్ లూంగ్, పిలిప్పీన్స్ ప్రెసిడెంట్ రోడ్రిగో డుటెర్టో, ఇండోనేషియా ప్రెసిడెంట్ జోకో విడోడో, మయన్మార్ నేత ఆంగ్ సూకీ, బ్రూనై సుల్తాన్ హసన్‌లాల్‌లకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. లావోస్ ప్రధాని థంగ్‌లున్ సిసౌలత్, వియత్నం ప్రధాని నుయ్ జు ఫున్, కంబోడియా ప్రధాని సామ్‌డెక్ అక్కా మోహ సేనలు కూడా రాజ్‌పథ్‌కు వచ్చారు.

English summary
President Ram Nath Kovind on Friday was left teary-eyed after he presented an Ashoka Chakra award to Corporal Jyoti Prakash Nirala's mother and wife during Republic Day celebrations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X