• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
LIVE

Republic day:72వ గణతంత్ర దినోత్సవంను జరుపుకుంటున్న భారత్

|

72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఉదయం నుంచి దేశ వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. గణతంత్ర వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని న్యూఢిల్లీ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఇప్పటికే దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.

కాగా, మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 జనవరి 26 దినానికి గౌరవ సూచకంగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ రోజున బ్రిటీషు కాలంనాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయి, భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ఇక మంగళవారం ఉదయం 8 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ త్రివర్ణ జెండాను ఎగురవేస్తారు.

 Republic day 2021 Live Updates:India celebrates 72nd Republic day

గతేడాది 1,50,000 మంది గణతంత్ర వేడుకలకు హాజరుకాగా.. ఈ సారి కరోనా కారణంగా 25వేల మందికి మాత్రమే అనుమతించారు. ఇక మీడియా ప్రతినిధుల సంఖ్య 300 నుంచి 200కు తగ్గింది. ఇక ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో జరిగే వేడుకలకు సంబంధించి మినిట్-టూ- మినిట్ అప్‌డేట్స్ మీకోసం

Newest First Oldest First
11:50 AM, 26 Jan
గణతంత్ర వేడుకల్లో పాల్గొని తన నివాసంకు బయలుదేరి వెళ్లిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
11:48 AM, 26 Jan
న్యూఢిల్లీలో గణతంత్ర వేడుకల్లో పాల్గొని తిరిగి రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరి వెళ్లిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. వీడ్కోలు పలికిన ప్రధాని మోడీ
11:44 AM, 26 Jan
సుఖోయ్ యుద్ధ విమానాలతో త్రినేత్ర ఆకారం. కెప్టెన్ ఏకే మిశ్రా నేతృత్వంలో ఆకాశంలో త్రిశూల్ ఆకారం
11:41 AM, 26 Jan
గణతంత్ర దినోత్సవం సందర్భంగా తొలిసారిగా ప్రదర్శనలో పాల్గొన్న రాఫెల్ యుద్ధ విమానాలు
11:34 AM, 26 Jan
ప్రజాస్వామ్య దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్ నేడు గణతంత్ర దినోత్సవంను జరుపుకుంటున్న నేపథ్యంలో దేశ ప్రజలకు శుభాకాంక్షలు. భారత్ నా హృదయానికి అత్యంత దగ్గరగా ఉన్న దేశం: బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్
11:32 AM, 26 Jan
ఆకట్టుకున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాపర్ విన్యాసాలు. రుద్ర ఆకారంలో ఫార్మేషన్
11:25 AM, 26 Jan
గణతంత్ర వేడుకల్లో భాగంగా నృత్యాలతో సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్న చిన్నారులు
11:16 AM, 26 Jan
ప్యాంగాంగ్ సరస్సు వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన ఐటీబీపీ పర్సనల్
11:14 AM, 26 Jan
ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌లో భాగంగా బయోటెక్నాలజీ శాఖ కోవిడ్ సురక్ష శకటంను ప్రదర్శించింది
11:01 AM, 26 Jan
ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో కనువిందు చేసిన ఏపీ లేపాక్షి శకటం. నంది విగ్రహంతో ఆకట్టుకున్న శకటం. శివతాండవం చేసిన కళాకారులు
10:51 AM, 26 Jan
గణతంత్ర వేడుకల్లో ఆకట్టుకున్న గుజరాత్‌కు చెందిన సూర్యదేవాలయం శకటం
10:34 AM, 26 Jan
గణతంత్ర వేడుకల పరేడ్‌లో ఆకట్టుకున్న ఒంటెల కంటింజెంట్
10:26 AM, 26 Jan
రిపబ్లిక్ డే లో ఆకట్టుకున్న బ్రహ్మోస్ శ్రేణికి చెందిన క్షిపణులు. భారత్ రష్యా దేశాలు సంయుక్తంగా ఈ క్షిపణులను తయారు చేశాయి. 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఇవి చేధించగలవు
10:24 AM, 26 Jan
రిపబ్లిక్ డే పరేడ్‌లో ఆకట్టుకున్న పినాకా మల్టీ లాంచర్ రాకెట్ వ్యవస్థ.
10:08 AM, 26 Jan
పరేడ్‌లో పాల్గొన్న బంగ్లాదేశ్ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్. రిపబ్లిక్ డే వేడుకల చరిత్రలోనే ఇలా ఇతర దేశాలకు చెందిన దళాలు పరేడ్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి
10:07 AM, 26 Jan
త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
10:00 AM, 26 Jan
21 గన్ సెల్యూట్ చేసిన 223 ఫీల్డ్ రెజిమెంట్
9:59 AM, 26 Jan
కర్నాటక
కర్నాటకలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన గవర్నర్ వాజూభాయ్ వాలా
9:58 AM, 26 Jan
రాజ్‌పథ్‌కు చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, స్వాగతం పలికిన ప్రధాని నరేంద్ర మోడీ,రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్రివిధ దళాల అధినేతలు
9:55 AM, 26 Jan
రాజ్‌పథ్‌కు చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు స్వాగతం పలికిన ప్రధాని నరేంద్ర మోడీ
9:54 AM, 26 Jan
రాజ్‌పథ్‌కు చేరుకోక ముందు అమరజవాన్ల స్థూపం వద్ద సెరిమోనియల్ పుస్తకంలో సంతకం చేసిన ప్రధాని మోడీ
9:52 AM, 26 Jan
రాజ్‌పథ్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ, స్వాగతం పలికిన రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
9:49 AM, 26 Jan
రాష్ట్రపతి భవన్‌లో సైనిక వందనం స్వీకరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
9:46 AM, 26 Jan
ఢిల్లీ
గణతంత్ర దినోత్సవం సందర్భంగా తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేసిన రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
9:45 AM, 26 Jan
అమకవీరుల స్థూపం వద్ద రెండు నిమిషాల పాటు మౌనం వహించి నివాళులు అర్పించిన ప్రధాని మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
9:43 AM, 26 Jan
న్యూఢిల్లీలోని వార్ మెమోరియల్‌ వద్ద అమర జవాన్లకు నివాళులు అర్పించిన ప్రధాని మోడీ
9:30 AM, 26 Jan
ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర వేడుకలు: ఆకట్టుకున్న వైయస్సార్ విలేజ్ క్లినిక్ శకటం
9:28 AM, 26 Jan
ఏపీ
ఆకట్టుకున్న అమూల్ పాల శకటం, వైయస్సార్ రైతు భరోసా కేంద్రం శకటం
9:10 AM, 26 Jan
దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగులో ట్వీట్ చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
9:09 AM, 26 Jan
బీహార్
తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన బీహార్ సీఎం నితీష్ కుమార్
READ MORE

English summary
Republic day celebrations 2021 in delhi live updates
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X