• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డ్రోన్లతో దాడులు: ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం: అణువణువూ..!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసులు న్యూఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తుకుండా డేగకన్ను వేశారు. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. మిగిలిన ప్రాంతాల్లో పోలీసుల గస్తీని పెంచారు. అనేక మార్గాల్లో బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ ఆంక్షలు కూడా దీనికి తోడు కావడంతో తనిఖీలు ముమ్మరంగా సాగాయి.

ఈ మధ్యకాలంలో తరచూ దేశ సరిహద్దుల్లో అవాంఛనీయ సంఘటనలు తలెత్తుతూ వస్తున్నాయి. రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ గుర్తు తెలియని డ్రోన్లు సరిహద్దులను దాటుకుని భారత గగనతలంపైకి ప్రవేశించిన సందర్భాలు ఉన్నాయి. కొద్దిరోజుల కిందట ఘాజీపూర్ ఫ్లవర్ మార్కెట్‌లో భారీ ఎత్తున ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్‌ను స్వాధీనం చేసుకున్నారు ఢిల్లీ పోలీసులు. ఫ్లవర్ మార్కెట్‌లో అనుమానాస్పదంగా కనిపించిన బ్యాగ్‌లో ఉంచిన ఐఈడీని సీజ్ చేశారు.

ఇప్పుడు కూడా గణతంత్ర దినోత్సవాల సందర్భంగా దేశ రాజధానిపై డ్రోన్లతో దాడులకు పాల్పడే అవకాశం ఉందంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీనికి సంబంధించిన నివేదికను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అందజేశాయి. దీనితో కేంద్రం అప్రమత్తమైంది. కట్టుదిట్టమైన భద్రత చర్యలను చేపట్టాలంటూ ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఢిల్లీ పోలీసు యంత్రాంగం మొత్తం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందనే విషయం తెలిసిందే.

Republic Day 2022: Security Tightened in Delhi Amid Looming Drone Attack Threat

హోం మంత్రిత్వ శాఖ నుంచి కీలక ఆదేశాలు అందడంతో కొద్దిరోజులుగా ఢిల్లీ పోలీసులు డ్రోన్ల అమ్మకాలపై నిఘా ఉంచారు. వాటిని అమ్మిన, కొనుగోలు చేసిన వారి వివరాలను సేకరించారు. డ్రోన్ల వినియోగింపై కేంద్ర ప్రభుత్వం ఇదివరకే జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం వాటిపై పర్యవేక్షణ కొనసాగించారు. డ్రోన్లను ఎగురవేయడానికి ప్రత్యేకంగా అనుమతిని తీసుకోవాల్సి ఉంటుందని ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ అస్థానా తెలిపారు.

డ్రోన్లను ఎగుర వేసే విషయంలో ఢిల్లీని మూడు జోన్లుగా విభజించారు. ఢిల్లీ శివారు ప్రాంతాలను గ్రీన్ జోన్‌గా ప్రకటించారు. ఇక్కడ డ్రోన్లను ఎగురవేయడానికి అనుమతి ఉంది. రెండవది- ఎల్లోజోన్. ఆంక్షల మధ్య డ్రోన్లను ఎగురవేయవచ్చు. మూడోది- రెడ్ జోన్. ఈ జోన్ పరిధిలో డ్రోన్ల ఎగురవేతను పూర్తిగా నిషేధించారు. యాంటీ డ్రోన్ వ్యవస్థను యాక్టివేట్ చేశారు. హనుమాన్ టెంపుల, కన్నాట్ ప్లేస్ వంటి ప్రాంతాల్లో అనుమానితుల ఫొటోలతో కూడిన వాల్ పోస్టర్లను అతికించారు.

English summary
Security arrangements have been tightened in the national capital ahead of celebrations of 73rd Republic Day amid security agencies warning police about the danger of drone attacks in the national capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X