వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ రెండింటితోనే అసలు సమస్యలు- జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి కీలక ప్రసంగం

దేశ 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రపంచ దేశాల్లో భారత్- శరవేగంగా పురోగమిస్తోందని, ఆర్థికంగా బలోపేతమౌతోందని పేర్కొన్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇంకొన్ని గంటల్లో దేశం.. 74వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది. దేశ రాజధానిలో ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా పలు చారిత్రాత్మక, స్మారక కట్టడాలను మువ్వన్నెల విద్యుద్దీపాలతో అలంకరించారు. త్రివర్ణాలతో మెరిసిపోయేలా చేశారు. రాజ్ పథ్ లో ఇప్పటికే పూర్తిస్థాయి డ్రెస్ రిహార్సల్స్ కూడా ముగిశాయి. ఈ సంవత్సరం రిపబ్లిక్ దినోత్సవ వేడుకలకు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలోనే అయిదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఆవిర్భవించిందని అన్నారు. సమయానుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలు, అమలు చేస్తోన్న పథకాలే దీనికి ప్రధాన కారణమని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఆర్థిక అనిశ్చితి నెలకొని ఉందని, అలాంటి పరిస్థితుల మధ్య భారత్.. సుసంపన్న దేశంగా అవతరించిందని అన్నారు.

Republic day 2023: Global warming and climate change are most pressing them, says President Murmu

కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తరువాత భారత్.. నాలుగో సంవత్సరంలోకి ప్రవేశించిందని, అయినప్పటికీ ఆర్థికంగా శరవేగంగా నిలదొక్కుకోగలిగిందని రాష్ట్రపతి ముర్ము అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తరువాత పలు దేశాలు ఆర్థికంగా తీవ్రంగా ప్రభావితం అయ్యాయని, ప్రారంభంలో భారత్ కూడా తీవ్రంగా దెబ్బతీన్నదని చెప్పారు. అయినప్పటికీ కేంద్రంలో సమర్థవంతమైన ప్రభుత్వం ఉన్నందున శరవేగంగా ఆ ప్రతికూల పరిస్థితుల నుంచి త్వరలోనే బయటికి వచ్చామని అన్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాలు ఈ మహమ్మారి ప్రభావం నుంచి బయటపడ్డాయని ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు. ప్రత్యేకించి- ఆత్మనిర్భర్ నినాదం దేశాన్ని ముందుకు నడిపించిందని పేర్కొన్నారు. దీనికి దేశ ప్రజలందరూ ముక్తకంఠంతో తమ మద్దతును తెలియజేయడం గర్వించదగ్గ విషయమని చెప్పారు. లాక్ డౌన్ సమయంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని అమలు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించిందని గుర్తు చేశారు.

దేశ ప్రజలెవరూ ఆకలితో అలమటించాల్సిన దుస్థితి ఏర్పడలేదని, సుమారు 81 కోట్ల మంది పౌరులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలిగిందని రాష్ట్రపతి అన్నారు. దీన్ని ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని, నెలవారీ రేషన్‌ను లబ్దిదారులు ఉచితంగా పొందుతారని పేర్కొన్నారు. ఈ పరిణామాల మధ్య క్లైమెట్ ఛేంజ్, గ్లోబల్ వార్మింగ్.. ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతోన్నాయని, ఈ రెండు అడ్డంకుల నుంచి సమష్టిగా అధిగమించాల్సిన అవసరం ఉందని అన్నారు.

English summary
India is among the fastest-growing major economies due to timely and pro-active interventions from the government, said President Draupadi Murmu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X