• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

LIVE : దేశవ్యాప్తంగా మువ్వన్నెల రెపరెపలు: అంగరంగ వైభవంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు

|

న్యూఢిల్లీ: 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఉదయం నుంచి దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగనున్నాయి. గణతంత్ర వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని న్యూఢిల్లీ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రెజిల్ దేశాధినేత జైర్ బోల్సోనారో మనదేశానికి విచ్చేశారు. ఆయనకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ ఘనస్వాగతం పలికారు.

కాగా, మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 జనవరి 26 దినానికి గౌరవ సూచకంగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ రోజున బ్రిటీషు కాలంనాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయి, భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.

 republic day celebrations 2020 in delhi live updates

భారతదేశానికి 1947 ఆగస్టు 15 న స్వాతంత్ర్యం వచ్చింది. దేశానికి రాజ్యాంగము తయారు చేయటానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. దీనికి అధ్యక్షుడుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు. 1947 ఆగస్టు 29 న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఛైర్మన్‌గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. రాజ్యాంగము తయారు చేయడానికి ఎంతోమంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ప్రజాస్వామ్య విధానంగా రూపుదిద్దారు. అనేక సవరణల అనంతరము 1949 నవంబర్ 26 న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది.

భారత రాజ్యాంగానికి 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలము పట్టింది. ప్రపంచములోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగముగా గుర్తించబడింది. అలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుంచి అమలుపరిచడంతో భారతదేశము సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగా రూపొందడంతో పరిణామ దశ పూర్తయింది. 1930 జనవరి 26న పూర్ణ స్వరాజ్ ప్రకటించడం జరిగింది.

Newest First Oldest First
4:23 PM, 26 Jan
భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన మాల్దీవ్స్ అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సొలిహ్,శ్రీలంక ప్రధాని మహీంద్రా రాజపక్షసలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. భారత్,మాల్దీవ్స్ మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయని,ఇది ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు.
3:53 PM, 26 Jan
న్యూఢిల్లీ
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నేపాల్‌ ప్రభుత్వానికి 30 అంబులెన్సులు, ఆరు బస్సులను బహుమతిగా అందజేసిన భారత్.
3:32 PM, 26 Jan
తెలంగాణ
గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం శ్యామా ప్రసాద్ ముఖర్జీ భవన్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జీ కిషన్ రెడ్డి
3:17 PM, 26 Jan
పశ్చిమ బెంగాల్
పశ్చిమబెంగాల్‌లోని హౌరాలో భారతమాత చిత్రపటానికి బీజేపీ కార్యకర్తల ప్రత్యేక పూజలు. అడ్డుకున్న పోలీసులు. బీజేపీ, పోలీసుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ.. ఉద్రిక్తత
2:50 PM, 26 Jan
తెలంగాణ
రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్
2:30 PM, 26 Jan
న్యూఢిల్లీ
గణతంత్ర దినోత్సవం సందర్భంగా తన నివాసంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
2:22 PM, 26 Jan
తెలంగాణ
గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో సైనిక అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు
2:18 PM, 26 Jan
తెలంగాణ
హైదరాబాద్‌లో వేదమంత్రోచ్ఛారణల మధ్య జాతీయ పతాకాన్ని ఎగురవేసిన శంకర గురుకుల వేద పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు
2:10 PM, 26 Jan
జమ్మూ కాశ్మీర్
జమ్మూ కాశ్మీర్‌లో పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎగిరిన త్రివర్ణ పతాకం. ఆర్ఎస్ పురా సెక్టార్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన బీఎస్ఎఫ్ అధికారులు
2:04 PM, 26 Jan
కర్ణాటక
బెంగళూరు ఫీల్డ్ మార్షల్ మాణిక్‌షా పరేడ్ మైదానంలో వైభవంగా కొనసాగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలా. హాజరైన ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప
1:59 PM, 26 Jan
ఆంధ్రప్రదేశ్
తన నివాసంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
1:45 PM, 26 Jan
న్యూఢిల్లీ
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆకట్టుకున్న జమ్మూ కాశ్మీర్ శకటం.. బ్యాక్ టు విలేజ్.
1:44 PM, 26 Jan
న్యూఢిల్లీ
గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో స్వీట్లను పంచుకున్న రెండు దేశాల సైనికులు
11:47 AM, 26 Jan
న్యూఢిల్లీ
మహిళా జవాన్ల శక్తికి అద్దం పట్టిన గణతంత్ర దినోత్సవ వేడుకలు
11:37 AM, 26 Jan
న్యూఢిల్లీ
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆకట్టుకుంటోన్న సుఖోయ్ విన్యాసాలు. గంటకు 900 కిలోమీటర్ల వేగంతో నింగిని చీల్చుకుంటూ దూసుకెళ్లిన యుద్ధ విమానాల
11:32 AM, 26 Jan
న్యూఢిల్లీ
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆలరించిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ శకటం: ఆరేళ్ల తరువాత ఆంధ్రప్రదేశ్ శకటానికి లభించిన చోటు
11:29 AM, 26 Jan
ఆంధ్రప్రదేశ్
సచివాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ
11:12 AM, 26 Jan
న్యూఢిల్లీ
గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొన్న 49 మంది సాహస బాల బాలికలు.
11:09 AM, 26 Jan
న్యూఢిల్లీ
గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో చూపుమరల్చుకోనివ్వని తెలంగాణ శకటం. బతుకమ్మకు అద్దం పట్టేలా రూపొందించిన శకటం
11:07 AM, 26 Jan
న్యూఢిల్లీ
గణతంత్ర దినోత్సవం సందర్భంగా అబ్బుర పరుస్తోన్న వివిధ రాష్ట్రాల శకటాల ప్రదర్శన
11:05 AM, 26 Jan
లఢక్
సియాచిన్‌లో మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో 17 వేల అడుగులో సగర్వంగా ఎగురుతోన్న త్రివర్ణ పతాకం
11:02 AM, 26 Jan
అస్సాం
బంద్‌కు పిలుపునిచ్చిన ఉల్ఫా. అస్సాంలోని పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు. భారీగా మోహరించిన భద్రతా బలగాలు
10:52 AM, 26 Jan
న్యూఢిల్లీ
సైనిక బెటాలియన్‌కు నాయకత్వం వహించిన ఆర్మీ మహిళా అధికారి తాన్యా షెర్గిల్
10:48 AM, 26 Jan
తెలంగాణ
దేశం మొత్తానికీ రోల్ మోడల్‌గా ఆవిర్భవించిన తెలంగాణ: ఆరేళ్ల వ్యవధిలో అద్భుత ప్రగతిని రాష్ట్రం సాధిస్తోంది: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
10:46 AM, 26 Jan
తెలంగాణ
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రసంగిస్తోన్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
10:37 AM, 26 Jan
తెలంగాణ
హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు
10:35 AM, 26 Jan
తెలంగాణ
71వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి
10:32 AM, 26 Jan
ఆంధ్రప్రదేశ్
పాలనను వికేంద్రీకరించడానికి, ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లడానికి మూడు రాజధానుల ఏర్పాటు వీలు కల్పిస్తుంది: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
10:31 AM, 26 Jan
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటుతో పాలన వికేంద్రీకర. పాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
10:30 AM, 26 Jan
ఆంధ్రప్రదేశ్
71వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రసంగిస్తోన్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
READ MORE

English summary
republic-day-2020 Multi-layered Security Cover in Delhi for Republic Day Celebrations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X