వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గణతంత్ర దినోత్సవం: అమరవీరులకు మోడీ నివాళులు, బీఎస్ఎఫ్ మహిళల అద్భుత ప్రదర్శన

|
Google Oneindia TeluguNews

Recommended Video

Republic Day 2018 : PM Modi Pays Tribute At Amar Jawan Jyoti

న్యూఢిల్లీ: 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. శుక్రవారం ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, హోమంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, భద్రతాధికారులు పాల్గొన్నారు. అంతకుముందు ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ అమరవీరులకు నివాళులర్పించారు.

Republic Day

ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు 69వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 'రిపబ్లిక్‌ డే శుభాకాంక్షలు, జైహింద్‌' అని మోడీ ట్వీట్‌ చేశారు.

69వ గణతంత్ర వేడుకలకు 10మంది ఆసియాన్ దేశాల అధినేతలు పాల్గొన్నారు. థాయిలాండ్, వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, మయన్మార్, లావోస్, కాంబోడియా, బ్రూనై దేశాధినేతలకు మోడీ స్వాగతం పలికారు. గణతంత్ర వేడుకలకు సుమారు 60వేల మంది భద్రతా బలగాలతో బందోబస్తు ఏర్పాటుచేశారు. కాగా, దివంగతులైన ఎయిర్‌ఫోర్స్‌ కమాండో జేపీ నీరాలా భార్య, తల్లి అశోక చక్ర అవార్డును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా అందుకున్నారు.

ఆకట్టుకున్న ప్రదర్శనలు:

వేడుకల్లో సైనిక దళాల పరేడ్‌ ఆకట్టుకుంది. టీ-90 యుద్ధ ట్యాంకర్ల ప్రదర్శనతో పరేడ్‌ ప్రారంభమైంది. వేడుకల్లో ముఖ్యఅతిథులుగా హాజరైన పది దేశాలకు సంబంధించిన జెండాలను ప్రదర్శించారు. ఆర్మీ, వాయు సేన, నావికా దళాలలకు చెందిన శకటాలతో పాటు బీఎస్‌ఎఫ్‌ దళాలు, ఇండో టిబెటిన్‌ బార్డర్‌ పోలీసు బలగాలు, సశస్త్ర సీమబల్‌ బ్యాండ్, దిల్లీ పోలీసులు, ఎన్‌సీసీ బృందాల ప్రదర్శన అద్భుతంగా సాగింది. ఆకాశ్‌ క్షిపణి, బ్రహ్మోస్‌ క్షిపణులను కూడా ప్రదర్శించారు.

నిజమైన హీరోలు ఎవరంటే.. ఎళ్లవేళలా మనదేశాన్ని కాపాడుతున్న మన సైనికులనే చెప్పాలి. తాజగా, గణతంత్ర దినోత్సవం సందర్భంగా వారు మరో సాహసం చేశారు. ఏకంగా మైనస్‌ 30 డిగ్రీల ఉష్ణోగ్రతను సైతం లెక్కచేయకుండా ఐటీబీపీ(ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌) జవాన్లు మంచు కొండల్లో దేశజాతీయ పతాకం రెపరెపలాడేలా చేశారు. ప్రతికూల పరిస్థితులను కూడా పట్టించుకోకుండా ఐటీబీపీ జవాన్లు మంచులో నడుచుకుంటూ వెళ్లారు. 69వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐటీబీపీ జవాన్లు దాదాపు 18వేల అడుగుల ఎత్తులో జాతీయపతాకాన్ని ఎగరవేసి యావత్‌ దేశ ప్రజలు గర్వపడేలా చేశారు.

కాగా, రాజ్‌పథ్‌లో ఆర్మీ పరేడ్‌తో పాటు సైనిక బలగాల ప్రదర్శనలు, సాంస్కృతిక ప్రదర్శనలు వేడుకగా నిర్వహించారు. వేడుకల సందర్భంగా ఢిల్లీ నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

దేశంలోని పలు రాష్ట్రాలు, శాఖలు నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. పలువురు కళాకారులు ప్రదర్శించిన కార్యక్రమాలు ఆహుతులను మంత్రముగ్ధుల్ని చేశాయి. కాగా, తొలిసారి గణతంత్ర వేడుకల్లో మహిళా బైకర్లు సాహస విన్యాసాలు చేసి అమితంగా ఆకట్టుకున్నారు.

బీఎస్ఎఫ్ మహిళల అద్భుత ప్రదర్శన

బోర్డర్ సెక్యూర్టీ ఫోర్స్‌(బీఎస్ఎఫ్)కు చెందిన మహిళా సైనికులు అద్భుత ప్రదర్శన చేపట్టారు. రాజ్‌పథ్‌లో సీమా భవానీ వుమన్ బైకర్స్ విన్యాసాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఆర్డీ పరేడ్‌లో మహిళా మోటర్ సైకిల్ టీమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

seema bhavanis

టెకాన్‌పూర్‌లో ఉన్న బీఎస్‌ఎఫ్ దళాలు ఈ విన్యాసాలు నిర్వహించాయి. సీమా భవాని బృందానికి సబ్ ఇన్‌స్పెక్టర్ స్టాంజిన్ నర్‌యాంగ్ నాయకత్వం వహించారు. సీమా భవానీ డ్రైవింగ్ స్కిల్స్ అందర్నీ అబ్బురపరిచాయి. రైడింగ్ స్టంట్స్‌తో థ్రిల్ చేశారు. ప్రెసిడెంట్‌కు సెల్యూట్ చేయడంతో పాటు ఫిష్ రైడింగ్, సైడ్ రైడింగ్ లాంటి స్టంట్లతో సీమా భవానీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

English summary
India on Friday will celebrate the 69th Republic Day with great zeal and fervour. Prime Minister Narendra Modi will first pay tribute at Amar Jawan Jyoti to pay homeage to the martyred soldiers who laid down their lives for the nation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X