వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిపబ్లిక్ డే హింస: రైతు సంఘం నేతలకు ఢిల్లీ పోలీసుల లుకౌట్ నోటీసులు, పాస్‌పోర్ట్ సరెండర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మంగళవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ట్రాక్టర్ ర్యాలీలో చోటు చేసుకున్న హింసకు బాధ్యులైన పలువురు రైతు సంఘం నేతలపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా వారికి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు.

రైతు ట్రాక్టర్ ర్యాలీలో ఘర్షణలు: మరోవైపు పోలీసులకు గులాబీలు, రైతులతో భోజనాలురైతు ట్రాక్టర్ ర్యాలీలో ఘర్షణలు: మరోవైపు పోలీసులకు గులాబీలు, రైతులతో భోజనాలు

ఎప్ఐఆర్ నమోదు కాబడిన రైతు నేతలు తమ పాస్‌పోర్టులు స్వాధీనం చేయాలని పోలీసులు సూచించారు. ఢిల్లీలో ర్యాలీ సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం అనంతరం పోలీసులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

 Republic Day violence: Delhi Police issues lookout circulars against farmer leaders named in FIRs

కాగా, అమిత్ షా.. ఢిల్లీ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు, బుధవారం అర్థరాత్రి, గురువారం తెల్లవారుజామున సమావేశాలు నిర్వహించారు. నిందిత రైతు నాయకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.

నిందితుడు విదేశాలకు వెళ్లకుండా నిరోధించడానికి లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. ఢిల్లీ పోలీసులు 25 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు, ఇందులో 40 మంది రైతు సంఘాల నాయకులలో 30 మందికి పైగా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపినవారున్నారు.

ఢిల్లీలోని సమయపూర్ బద్లీ పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లలో జాయింట్ కిసాన్ మోర్చా (ఎస్కెఎం) ఆరుగురు ప్రతినిధులతో సహా 37 రైతు సంఘాల నాయకుల పేర్లున్నాయి. ఇంకా, ఆరుగురు ఎస్‌కెఎం ప్రతినిధులు జగ్జిత్ సింగ్ దల్లెవాల్, అధ్యక్షుడు, బికెయు (సిద్దపూర్); బల్బీర్ సింగ్ రాజేవాల్, అధ్యక్షుడు, బికెయు (రాజేవాల్); దర్శన్ పాల్, అధ్యక్షుడు, క్రాంతికారి కిసాన్ యూనియన్; రాకేశ్ టికైట్, అధ్యక్షుడు, బికెయు; కుల్వంత్ సింగ్ సంధు, ప్రధాన కార్యదర్శి, జంహూరి కిసాన్ సభ; యోగేంద్ర యాదవ్, అధ్యక్షుడు, స్వరాజ్ పార్టీ ఇండియా పేర్లున్నాయి.

ఎఫ్‌ఐఆర్‌లో పేరు నమోదైన ఇతరులు బూటా సింగ్ బుర్జ్‌గిల్, అధ్యక్షుడు, బికెయు డకౌండా; కీర్తి కిసాన్ యూనియన్ అధ్యక్షుడు నిర్భాయ్ సింగ్ ధుడికే; రుల్దు సింగ్ మాన్సా, అధ్యక్షుడు, పంజాబ్ కిసాన్ యూనియన్; కిసాన్ సంఘర్ష్ కమిటీ అధ్యక్షుడు ఇందర్‌జిత్ సింగ్ తదితరులున్నారు.

ఎర్రకోట సంఘటనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లలో పంజాబీ సినీ నటుడు దీప్ సిద్ధు, గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయ నాయకుడు, మాల్వా యూత్ ఫెడరేషన్ అధ్యక్షుడు లఖ్‌బీర్ సింగ్ సిధానా అలియాస్ లఖా సిద్ధానాల పేర్లున్నాయి.

English summary
The Delhi Police has issued lookout circulars against farmer leaders who have been named in FIRs registered in connection with the violence that broke out during farmers' tractor rally in the city on the Republic Day on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X