Arnab Goswami: సుప్రీం కోర్టును ఆశ్రయించిన రిపబ్లిక్ టీవీ చీఫ్, ఆత్మహత్యలతో నాకు సంబంధం లేదు!
ముంబాయి/ న్యూఢిల్లీ: మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్, ప్రముఖ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 2018 మే నెలలో ముంబాయిలో అర్కిటెక్ట్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముదా నాయక్ ఆత్మహత్యల కేసులో అరెస్టు అయిన అర్నబ్ గోస్వామి తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చెయ్యాలని బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అర్నబ్ గోస్వామికి బెయిల్ మంజూరు కాకపోవడంతో మంగళవారం అర్నబ్ గోస్వామి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనకు ఈ కేసులో మద్యంతర బెయిల్ మంజూరు చెయ్యాలని అర్నబ్ గోస్వామి సుప్రీం కోర్టుకు మనవి చేశారు. అర్నబ్ గోస్వామితో పాటు అరెస్టు అయిన మరో ఇద్దరు కూడా బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
Kamala Harris: కమలా హ్యారిస్ గురించి 11 ఏళ్ల క్రితం మల్లికా శెరావత్ చిలక జోస్యం, గోల్డెన్ టంగ్ !

కేసు పాతదైనా కథ కొత్తది
2018 మే నెలలో ముంబాయిలోని ఆలీబాగ్ లో నివాసం ఉంటున్న అర్కిటెక్ట్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముదా నాయక్ ఆత్మహత్యలు చేసుకున్నారని అప్పట్లో కేసు నమోదైయ్యింది. ఈ కేసులో ముంబాయి పోలీసులు రిపబ్లిక్ టీవీ చీఫ్ ను ఈనెల 4వ తేదీన ముంబాయిలో అరెస్టు చేశారు. అర్నబ్ గోస్వామి తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చెయ్యాలని బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అర్నబ్ గోస్వామికి బెయిల్ మంజూరు చెయ్యకూడదని, కేసు విచారణలో ఉందని, ఆయన పలుకుబడితో సాక్షాలు తారుమారు చేసే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్, ముంబాయి పోలీసులు బాంబే హైకోర్టులో అభ్యంతరం వ్యక్తం చేశారు.

డెత్ నోట్ ఉంది !
ముంబాయిలోని ఆలీబాగ్ లో నివాసం ఉంటున్న అర్కిటెక్ట్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముదా నాయక్ ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆత్మహత్యలు చేసుకునే ముందు వారిద్దరూ డెత్ నోట్ రాసిపెట్టారని పోలీసులు అంటున్నారు. తమకు రావలసిన రూ. 5.40 కోట్లు ఇవ్వకుండా అర్నబ్ గోస్వామి, మరో ఇద్దరు తమను వేధింపులకు గురి చేస్తున్నారని, ఆర్థిక సమస్యల కారణంగా తాము ఆత్మహత్యలు చేసుకుంటున్నామని తల్లీ, కుమారుడు డెత్ నోట్ రాసిపెట్టారని ముంబాయి పోలీసులు అంటున్నారు.

హైకోర్టులో ఎదురుదెబ్బ
అర్నబ్ గోస్వామి బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న బాంబే హైకోర్టు అర్నబ్ గోస్వామికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసులకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామి బెయిల్ పిటిషన్ ను బాంబే హైకోర్టు తిరస్కరించడంతో ఆయన షాక్ కు గురైనారు.

నాకు ఏం సంబంధం లేదు
ముంబాయిలోని ఆలీబాగ్ లో నివాసం ఉంటున్న అర్కిటెక్ట్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముదా నాయక్ ఆత్మహత్యల కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబాయి పోలీసులు కావాలనే తన మీద కక్షకట్టి కేసులో ఇరికించారని, తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చెయ్యాలని అర్నబ్ గోస్వామి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బుధవారం సుప్రీం కోర్టులో అర్నబ్ గోస్వామి బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. అర్నబ్ గోస్వామితో పాటు అరెస్టు అయిన మరో ఇద్దరు కూడా బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు.