వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు అయితే ఇంకా బెటర్.. చాలా సేప్టీ.. మాస్కులపై పరిశోధకులు

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చినా పెద్దగా ఉపయోగం లేదు. ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా వైరస్ సోకుతోంది. దీంతో అప్రమత్తతే ఇంపార్టెంట్ అని నిపుణులు చెబుతున్నారు. మరికొందరు ఒక మాస్క్ కాకుండా రెండు ధరించాలని సూచిస్తున్నారు. డబుల్ మాస్క్ వల్ల సేప్టీ కూడా ఎక్కువగా ఉంటుందని వివరించారు.

కరోనా వైరస్ నుంచి తప్పించుకునే నిబంధనల్లో ప్రాథమికమైనది.. మాస్కు ధరించడం అనే సంగతి తెలిసిందే. ఒక మాస్కు కంటే రెండు మాస్కులను ధరించడం వల్ల వైరస్‌ నుంచి రెట్టింపు రక్షణ లభిస్తుందని పరిశోధకులు అంటున్నారు. మాస్కు ధరించినప్పుడు అది మన ముక్కును, మూతిని, గడ్డాన్నీ పూర్తిగా అతుక్కుని ఉండదు. మన ముఖాకృతి వల్ల పక్కభాగాల్లోగానీ, పైనగానీ, కిందగానీ కొంత గ్యాప్‌ వచ్చే అవకాశం ఉంది.

 researchers suggest wearing two mask is a better safety

వైరస్‌ ఆ భాగాల గుండా లోపలికి ప్రవేశించే ప్రమాదం ఉందని పరిశోధకులు అంటున్నారు. రెండు మాస్కులు ధరిస్తే గ్యాప్‌లు ఉండవని, తద్వారా రెట్టింపు రక్షణ లభిస్తుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ ఎమిలీ సిక్‌బెర్ట్‌ బెన్నెట్‌ (నార్త్‌కరోలినా యూనివర్సిటీ-అమెరికా) పేర్కొన్నారు. ఈ సూచన సరైనదే.. మరీ అందరూ పాటిస్తే పోలా.. వైరస్‌ను సమిష్టింగా పారదోలిన వారిమి అవుతాం.

English summary
researchers suggest wearing two mask is a better safety for humans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X