వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యక్తిగత జీవితాన్ని గౌరవించండి: కోహ్లీ-అనుష్కలపై యువరాజ్

|
Google Oneindia TeluguNews

ముంబై: ప్రపంచ కప్ టోర్నీ సెమీ ఫైనల్లో విఫలమైన భారత యువ ఆటగాడు విరాట్ కోహ్లీకి ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ట్విట్టర్ ద్వారా తన మద్దతుగా తెలియజేశాడు. విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో కేవలం ఒక పరుగు మాత్రమే చేసి ఔటైన సంగతి తెలిసిందే.

బాలీవుడ్ నటి, కోహ్లీ ప్రియురాలు అనుష్క శర్మ ఆ మ్యాచ్ జరుగుతున్న సిడ్నీ క్రికెట్ మైదానంలో ఉండటమే కోహ్లీ విఫలం కావడానికి కారణమని పలువురు సామాజిక మాధ్యమాల్లో దుయ్యబట్టారు. అయితే అభిమానులు ఈ విధంగా చేయడం సరికాదని 2011 ప్రపంచ కప్ హీరో యువరాజ్ అన్నాడు.

టోర్నీలో పాకిస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచులో కోహ్లీ శతకంతో ప్రారంభించాడని, ఆ మ్యాచులో ధోనీ నేతృత్వంలోని టీమిండియా 76 పరుగులతో గెలిచిందని గుర్తు చేశాడు. ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో సెంచరీ చేసిన ఏకైక భారత ఆటగాడు కోహ్లీ అని తెలిపాడు. అయితే తోర్నీలో తర్వాతి మ్యాచుల్లో కోహ్లీ అర్థ సెంచరీ కూడా చేయలేకపోయాడు.

‘Respect Virat Kohli and Anushka Sharma’s personal life,’ says Yuvraj Singh

క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై గెలిచిన టీమిండియా.. ఆ తర్వాత సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. ఈ మ్యాచులో కోహ్లీ భారీ స్కోరు చేస్తాడని ఆశించిన వారందరికీ ఒక పరుగుకే ఔటవడం తీవ్ర నిరాశకు గురిచేసింది. అంతేగాక, ఆ మ్యాచును వీక్షించేందుకు వచ్చిన కోహ్లీ ప్రియురాలు అనుష్క శర్మ కూడా స్టేడియంలో కూర్చుంది. ఇదే కొంపముంచిందని కొందరు అభిమానులు సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తి పోశారు.

కాగా, కోహ్లీకి క్రికెట్, సినీ ప్రముఖుల నుంచే కాక, ప్రజల నుంచి కూడా మద్దతు లభించింది. ఇప్పటికే భారత మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్‌లు కోహ్లీకి అండగా నిలువగా.. ఇప్పుడు యువరాజ్ కూడా తన మద్దతును కోహ్లీకి తెలియజేశాడు.

ప్రస్తుతం టీమిండియాలో ఉన్న స్టార్ ఆటగాళ్లలో ఒకడైన విరాట్ కోహ్లీని, అతని వ్యక్తి జీవితాన్ని గౌరవించాలని యువరాజ్ అభిమానులను కోరారు. త్వరలోనే కోహ్లీ తన ఫాంను కొనసాగిస్తాడని, భారత విజయాల్లో కీలక భూమిక పోషిస్తాడని యువరాజ్ ఆకాంక్షించాడు.

English summary
The most valuable player for this year’s Indian Premier League, Yuvraj Singh has called for the fans to respect Virat Kohli, who is one of India’s leading batsman, and his personal life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X