వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటేయండి ఉచితంగా మసాల దోశ తినండి: బెంగుళూరు ఓటర్లకు బంపర్ ఆఫర్

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. అయితే బెంగుళూరులోని ఓ హోటల్ నిర్వాహకుడు పోలింగ్ సరళిని పెంచేందుకు వినూత్న ప్రచారాన్ని ప్రారంభించాడు.

బెంగుళూరులోని నిసర్గ గ్రాండ్ హోటల్ యజమాని కృష్ణ రాజ్ బెంగుళూరులో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు తన వంతు ప్రయత్నాలను ప్రారంభించాడు. ఈ ఎన్నికల్లోనే తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకొంటున్న వారికి ఉచితంగా దోశను ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అంతేకాదు ఓటు వేసిన ఇతర ఓటర్లకు మాత్రం కాఫీని ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు.

Restaurant lures first time voters with Masala Dosa & Coffee for voting

ఓటు హక్కును వినియోగించుకొన్నట్టుగా ఓటర్లు తమ చూపుడు వేలిపై ఉన్న సిరా గుర్తును చూపించాల్సిందే. ఈ గుర్తును చూపించినవారికి మాత్రమే ఉచితంగా దోశతో పాటు కాఫీని ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు.

బెంగుళూరులో తక్కువ ఓటింగ్ శాతం నమోదౌతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఓటింగ్ శాతాన్ని పెంచేందుకుగాను ఈ ప్రయత్నం చేసినట్టు హోటల్ నిర్వాహకుడు కృష్ణ రాజ్ చెప్పారు. అయితే ఓటర్లు తమ ఇష్టమొచ్చిన పార్టీకి ఓటు చేసుకోవచ్చని ఆయన సూచించాడు. కానీ, ఓటింగ్‌లో పాల్గొనాల్సిందిగా మాత్రం ఆయన సూచించారు.

English summary
Karnataka is witnessing a record number of 15.2 lakh first time voters in the age group of 18-19 years and a city restaurant Group has come up with an attractive offer of feasting them with a Masala Dosa and a Coffee without any cost as inducement for them to turn out for casting their franchise in the tomorrow's Assembly elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X