వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో ఘర్షణ వాతారణం: శాంతిభద్రతలు నెలకొల్పాలంటూ అమిత్ షాకు అరవింద్ కేజ్రీవాల్ వినతి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు సానుకూల, ప్రతికూల వర్గాల మధ్య చోటు చేసుకున్న అల్లర్లపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఘర్షణ వాతావరణాన్ని చల్లార్చి తిరిగి శాంతియువత వాతావరణాన్ని కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆయన కోరారు.

ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో అల్లర్లు చోటు చేసుకున్నాయన్న వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని, వెంటనే ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతలను నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ను, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అభ్యర్థించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించేవారిని క్షమించకూడదని అన్నారు.

ఉత్తర ఢిల్లీలోని భజన్‌పుర, మౌజపుర ప్రాంతాల్లో సోమవారం ఉదయం నుంచి ఇరువర్గాల మధ్య అల్లర్లు చోటు చేసుకున్నాయి. 24 గంటల్లో ఇలా ఘర్ణణ వాతావరణం ఏర్పడటం ఇది రెండోసారి కావడం గమనార్హం. సీఏఏకు అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయి పరస్పరం రాళ్లు రువ్వుకుంటూ ఉద్రిక్త వాతావరణానికి తెరతీశారు.

ఈ ఘర్షణలకు సంబంధించి పలు వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఓ ఆటోరిక్షాతోపాటు మరో వాహనాన్ని ఆందోళనకారులు దగ్ధం చేశారు. పోలీసులపైకి కూడా రాళ్లు రువ్వుతుండటం గమనార్హం. కాగా, ఈ రాళ్లదాడిలో ఓ పోలీసు కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు.

Restore Law And Order, Ensure Peace: Arvind Kejriwal urges Amit Shah

Recommended Video

Arvind Kejriwal To Take Oath As Delhi CM @ Ramlila Maidan On February 16 | Oneindia Telugu

కబీర్‌నగర్‌లో ఇరువర్గాలవారు రాళ్లు రువ్వుకుంటున్న దృశ్యాల వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. కాగా, జఫరాబాద్ ప్రాంతంలో 10వేల మంది మహిళలు సీఏఏకు వ్యతిరేకంగా శనివారం రాత్రి నుంచి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం రాళ్లు రువ్వుకోవడంతో ఈ అల్లర్లు మొదలయ్యాయి.

English summary
Delhi Chief Minister Arvind Kejriwal has called the violence between people for and against the Citizenship Amendment Act (CAA) as "distressing news", and said Union Home Minister Amit Shah must restore law and order and ensure peace in the national capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X